యువ

కారుచీకట్లో కాంతిరేఖ.. ‘మీ నేస్తం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసు పొరల్లో నైరాశ్యం చీకట్లు ఆవరించినపుడు ఆత్మహత్య ఎలాంటి పరిష్కారం కాదని, కాసేపు స్థిమితంగా ఆలోచిస్తే కుంగుబాటుపై తిరుగుబాటు బావుటా ఎగరేయ వచ్చని గౌహతి ఐఐటి పూర్వ విద్యార్థిని రిచా సింగ్ భరోసా ఇస్తున్నారు. మానసిక ఒత్తిళ్లతో సతమతమయ్యే వారిలో భావోద్వేగాలను నియంత్రించి, వారికి ఆసరాగా నిలిస్తే ఆత్మహత్యలను నివారించడం అసాధ్యమేమీ కాదని ఆమె అంటున్నారు. కుంగుబాటుకు లోనై జీవితంపై విరక్తి చెందిన వారిని ఆదుకునేందుకు ‘యువర్ దోస్త్‌డాట్ కామ్’ పేరిట రిచా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించి, ఇంతవరకూ సుమారు 70వేల మందిని ఆత్మహత్యల బారి నుంచి కాపాడారు. చదువు, సంపాదన, కుటుంబ సమస్యలు, సామాజిక పరిస్థితుల కారణంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించలేక మన దేశంలో నిత్యం ఎంతోమంది జీవితాలను అర్ధంతరంగా ముగించడం తనకు ఆవేదన కలిగించిందని, ఇలాంటి వారికి జీవితంపై కొత్త ఆశలు చిగురింపజేయడమే తన ఆశయం అని ఆమె అంటున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం మన దేశ జనాభాలో దాదాపు 36 శాతం మంది కుంగుబాటుకు లోనవుతున్నారు. భారత్‌లో ప్రతి నాలుగు నిముషాలకు ఓ ఆత్మహత్య నమోదవుతోంది. సమస్యలకు ఎదురీద లేక జీవితాలను ముగిస్తున్న వారిలో యువతీ యువకులే ఎక్కువగా ఉంటున్నారు. ఐఐటిల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో తెలివైన విద్యార్థులు సైతం ఒత్తిళ్లకు తలొగ్గి ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని భావిస్తున్నారు. 2014లో దేశ వ్యాప్తంగా ఐఐటిల్లో 14 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సివిల్స్, క్యాట్ వంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించలేదన్న మానసిక వ్యధతో జీవితాలను ముగిస్తున్న వారు కూడా ఉన్నారు. ఎంతగా కష్టపడినా చదువులో రాణించలేక పోతున్నామని, మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు దొరకడం లేదని డీలా పడిపోతున్న వారి సంఖ్యా తక్కువేమీ కాదు.
ముందుగా భయాన్ని జయించి, ప్రణాళిక ప్రకారం నిబద్ధతతో చదివితే ఎలాంటి పరీక్షలైనా సులభంగా రాసేయవచ్చని, మంచి ఉద్యోగాలు పొందవచ్చని రిచా సింగ్ ఎంతోమంది యువతీ యువకులకు నిపుణుల చేత కౌనె్సలింగ్ ఇప్పిస్తున్నారు. కుంగుబాటుకు గురైన వారికి సకాలంలో సరైన ‘మానసిక సహాయం’ అందజేస్తే ఆత్మహత్యలను నివారించ వచ్చని ఆమె అంటున్నారు. ‘మన చుట్టూ ఎనె్నన్నో సమస్యలున్నా జీవితాన్ని సాఫీగా సాగించేందుకు అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి.. కష్టాలు ఎదురైనపుడు సన్నిహితులను, మానసిక వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకుంటే కుంగుబాటు నుంచి సులభంగా గట్టెక్కవచ్చు.. సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధి అవకాశాలు దండిగా ఉన్న నేటి ఆధునిక కాలంలో ఏదీ సాధించలేమని నీరసపడి పోనక్కర్లేదు.. భావోద్వేగాలను నియంత్రించుకుని మానసిక ప్రశాంతతను అలవరచుకుంటే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనే రాదు..’ అని రిచా చెబుతుంటారు. సమస్య ఏదైనప్పటికీ దాన్నో సవాలుగా తీసుకుంటే- జీవించడంలో ఉన్న మాధుర్యం మాటలకు అందదని ఆమె అంటున్నారు. కుంగుబాటుకు లోనైన వారికి జీవితంపై భరోసా కలిగించేందుకు ‘యువర్ దోస్త్’ పేరుతో వెబ్‌సైట్‌ను, మొబైల్ యాప్‌ను నిర్వహిస్తూ రిచా సింగ్ తన బృందంతో ఉచిత సేవలను అందిస్తున్నారు. కొత్తదనం కోసం పరితపించే నేటి యువతరం ఎనె్నన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తోందని, ‘ఆత్మహత్యే శరణ్యం’ అన్న వైఖరిలో మార్పు తేవడమే ‘యువర్ దోస్త్’ లక్ష్యమని ఆమె అంటున్నారు.