యువ

పాటల ప్రపంచంలో మరో కోకిల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిక్-2 సినిమా ఫ్లాప్ అయినా అందులో ‘కుక్కురుకు’పాటను మాత్రం మ్యూజిక్ లవర్స్ మరిచిపోలేరు. ఆ పాట పాడింది పదహారేళ్ల అమ్మాయంటే ఎవరూ నమ్మలేరు కూడా. హైదరాబాద్‌కు చెందిన స్ఫూర్తి యాదగిరి ఇప్పుడు తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఓ తాజా సంచలనం. ఆ మాటకొస్తే పదకొండేళ్ల వయసులోనే ‘యమహో యమ’ చిత్రంలో పాట పాడటం ద్వారా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది స్ఫూర్తి. ఇప్పటికే ఎస్‌ఎస్ తమన్, అనూప్ రూబెన్స్ వంటి సంగీత దర్శకుల మార్గదర్శకత్వంలో పాటలు పాడిన స్ఫూర్తి, ప్రస్తుతం లండన్‌లోని ట్రినిటీ కాలేజీలో చదువుకుంటోంది. ఐటెమ్ సాంగ్స్ పాడటం తనకు ఇష్టమనే స్ఫూర్తి, ఎప్పటికైనా హాలీవుడ్ టాప్ టెన్ సింగర్స్‌లో ఒకతెగా ఉండాలన్నది తన ఆశయమంటుంది. స్ఫూర్తి తండ్రి జితేందర్ దర్శకుడిగా సినీరంగంలో కొనసాగుతున్నారు. ‘పాటలు పాడటం, నా అంతట నేనుగా చిన్న చిన్న గీతాలు రాసుకోవడం మూడే ఏటనుంచే అలవడింది. పెద్దయ్యాక పాటలే ప్రపంచమయ్యాయి. ఓ పక్క చదువుకుంటూనే పాటలు పాడటంలోనూ శిక్షణ తీసుకుంటున్నాను. నన్ను ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు’ అంటూ చెప్పింది స్ఫూర్తి. చిన్న వయసులోనే సినీ సంగీత రంగంలో రాణిస్తున్న స్ఫూర్తి...ఎందరో ఔత్సాహిక సంగీత కళాకారులకు స్ఫూర్తిదాయకం కదూ!