యువ

హై..హై..హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ డయరీస్...
కంత్రీ గైజ్...
ది బైగాన్ వైన్స్...
హైదరబాదీ కలాబ్...
హైదరాబాదీ బ్రాట్స్...
తరచూ యూ ట్యూబ్ చూసేవారికి ఈ పేర్లు చూడగానే అర్ధమైపోయి ఉంటుంది...ఇవన్నీ కామెడీ చానెల్స్ పేర్లని! యూ ట్యూబ్‌లో హిట్లు కొడుతున్న ఈ చానెళ్లను నడుపుతున్నది, నిర్వహిస్తున్నదీ మన హైదరాబాదీ కుర్రాళ్లే. యూ ట్యూబ్‌లో వీరు నిర్వహిస్తున్న కామెడీ స్కిట్స్‌ని లక్షలాదిమంది వీక్షిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. హిందీలో...అదీ అచ్చమైన హైదరాబాదీ యాసలో మాట్లాడే ఈ చానెల్స్ ప్రసారాలకు గల్ఫ్‌పాటు అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లోనూ విపరీతమైన ఆదరణ ఉంది.
‘హైదరాబాద్ డయరీస్’ పేరిట షారుఖ్ కె అద్నాన్, అబ్రార్ ఖాన్‌లు నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెల్ ఒక్కదానికే దాదాపు లక్షమంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ‘యూట్యూబ్‌లో హైదరాబాదీ హ్యూమర్‌కి ఓ ప్రత్యేకత ఉంది. హైదరబాదీ యాస వారిని కట్టిపడేస్తుంది. కొంతమందికి మా యాస అర్థం కాకపోవచ్చు, కానీ వినేందుకు ఆసక్తి కనబరుస్తారు’ అంటాడు షారుఖ్. వికారుద్దీన్, ఖాజా మిస్బహుద్దీన్, సయ్యద్ ఆతిఫ్ మొహియుద్దీన్, మహమ్మద్ అబ్దుల్ సమద్ కలసి ‘కంత్రీ గైజ్’ పేరిట ఓ ఛానెల్ నిర్వహిస్తున్నారు. దీనికీ యూ ట్యూబ్‌లో బాగా గిరాకీ ఉంది. ‘చాలామందికి మా యాస అంటే ఇష్టం. అది వారికి ఫన్నీగా అనిపిస్తుంది. అర్థమయ్యేవారు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు’ అంటారు వికారుద్దీన్.
కేవలం హాస్యాన్ని అందరికీ అందించడమేనా అంటే, ఇందులో మరో పరమార్థం కూడా ఉంది. అది...సంపాదన! యూట్యూబ్‌లో ఓ కార్యక్రమాన్ని ఎంత ఎక్కువమంది చూస్తే అంత ఎక్కువ డబ్బులొస్తాయి. కొంతమంది ఇదే వ్యాపకంగా ప్రోగ్రాములు తయారు చేస్తుంటే, మరికొందరు సరదాకోసం చేస్తున్నారు. అలాంటివారికి యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బు పాకెట్ మనీగా పనికొస్తోంది. ‘ప్రతిభ గల కళాకారులు హాస్యం వండి వారుస్తున్నప్పుడు దానిని ఉచితంగా అందించలేం కదా! డబ్బు కూడా వస్తే, మాకు కాస్త హుషారుగా ఉంటుంది. మరింత మనసుపెట్టి కార్యక్రమాలు రూపొందించేందుకు ఆస్కారం ఉంటుంది. మేమంతా కుర్రాళ్లం కాబట్టి మాకు పాకెట్ మనీగానూ ఉపయోగపడుతుంది’ అంటాడు 22 ఏళ్ల ఆమెర్ బిన్ ఇషాక్. ‘ది బైగాన్ వైన్స్’ చానెల్‌ను నిర్వహిస్తున్న వారిలో ఇషాక్ కూడా ఒకడు. చానెల్ ఏదైనా వీరి కార్యక్రమాలన్నీ హైదరాబాద్ చుట్టూనే తిరుగుతాయి. ఉదాహరణకు కంత్రీ గైజ్ ‘ఓల్డ్ సిటీ వెర్సస్ న్యూ సిటీ’ పేరిట యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసిన కామెడీ స్కిట్‌లో ఇద్దరు చాయ్ బడ్డీ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వారి వాదనంతా పాత బస్తీ గొప్పదా....న్యూ సిటీ గొప్పదా అని సాగుతుంది. మాకు బంజారా హిల్స్ ఉందని ఒకరంటే మాకు చార్మినార్ ఉందని ఒకడంటాడు. చివరికి వీరిద్దరూ కూడా హైదరాబాద్ బిర్యానీ విషయంలో మాత్రం రాజీ పడతారు. అది మన ఇద్దరిదీ అని అంగీకారానికి రావడంతో ఎండ్ టైటిల్ పడుతుంది. పూర్తిగా హైదరాబాదీ యాసలో సాగే ఈ ప్రోగ్రామ్‌లో కొన్ని పదాలు అర్థం కావు. అయినా వినోదం పండించడంలో మాత్రం అద్భుతమనే చెప్పాలి.
కంత్రీ గైజ్‌ను 2014లో ప్రారంభించిన వికార్, దానికి విపరీతమైన ఆదరణ లభించడంతో ఇప్పుడు షార్ట్ ఫిల్స్, వెబ్ సిరీస్ వైపు దృష్టి సారించాడు. కంత్రీ గైజ్ తాజాగా యూ ట్యూబ్ నెక్స్ట్ అప్ పోటీల్లో గెలుపొందింది. మిగిలిన చానెల్స్ నిర్వహకులు కూడా ఎప్పటికప్పుడు తమ ఆలోచనలకు పదను పెట్టుకుంటూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేందుకు ముందడుగు వేస్తున్నారు. హైదరాబాదీ యువత టెక్నాలజీని ఔపోసన పట్టి, కెరీర్‌ను భిన్నంగా మలచుకుంటోందనడానికి ఈ చానెల్సే నిదర్శనం. వారికి ‘యువ’ బెస్ట్ఫా లక్ చెబుతోంది!

చిత్రాలు.. ‘ది బైగాన్ వైన్స్’ సారథులు ఒస్సామా టిప్పు, ఎండి.జీషన్, ఆమెర్ బెన్ ఇషాక్, సయ్యద్ అహ్మద్, మహమ్మద్ బిన్ ఇషాక్

‘హైదరాబాద్ డయరీస్’ ప్రతినిధులు షారుఖ్ కె అద్నాన్, అబ్రార్ ఖాన్