యువ

వెలుగు దివ్వెలు ఈ సోలార్ ట్రీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోలార్ ట్రీ
ఈ కానె్సప్ట్ ఇప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. పదుగురికీ వెలుగులు పంచిపెట్టే సోలార్ ట్రీలు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాయి. నాలుగడుగుల చోటులో ఈ ట్రీని ‘పాతితే’, రోజుకు మూడు నుంచి ఐదు కిలోవాట్ల కరెంటునిస్తుంది. అంటే, దాదాపు ఐదిళ్లకు కరెంటు అందుతుందన్నమాట.
దుర్గాపూర్‌లోని సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఎంఇఆర్‌ఐ)లో పనిచేసే శివనాథ్ మైటీ అనే శాస్తవ్రేత్త సృష్టే ఈ సోలార్ ట్రీ. ఫొటోలో చూస్తున్నారుగా...చెట్ల ఆకుల్ని పోలిన పలకల అమరిక. కేవలం నాలుగడుగుల చోటు చూసుకుని, సోలార్ పవర్ ట్రీని ఏర్పాటు చేసే వీలుండటం ఇందులో ప్రత్యేకత. దీనికి శివనాథ్ పేటెంట్ కూడా పొందారు. సోలార్ ట్రీ గురించి విన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఇటీవల దీని పనితీరును స్వయంగా పరిశీలించి, ఢిల్లీలో కొన్నిటిని ఏర్పాటు చేయించారు. ఒక్కో సోలార్ ట్రీ 20 వీధి దీపాలను వెలిగిస్తోంది. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు ఇప్పుడు సోలార్ ట్రీని అందిపుచ్చుకుని, ప్రజలకు వెలుగులు పంచేందుకు ముందడుగు వేస్తున్నాయి.