యువ

గ్రీన్ ఫ్యాషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గా జాసూస్...త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ ఎకో ఫ్రెండ్లీ దుస్తులతో అలరించబోతోంది. లాస్‌ఏంజెలిస్‌లోని ఓ స్టోర్‌నుంచి కత్రినా ఈ దుస్తుల్ని ఎంపిక చేసుకుంది. ఈ ట్రెండ్ కేవలం బాలీవుడ్‌కో, ఇండియాకో పరిమితం కాలేదు. బ్రిటిష్ నటి ఎమ్మా వాట్సన్ ధరించేదీ వీటినే. తన అభిమానుల్ని కూడా ఇవే దుస్తులు ధరించమని ఆమె పిలుపునిస్తోంది. ఇటీవల ఓ ఫంక్షన్‌లో ఎమ్మా వాట్సన్ ధరించిన గౌన్ ఫ్యాషన్ ప్రేమికుల్ని కట్టిపడేసింది. పునరుత్పాదక కాటన్, శాటిన్‌లతోపాటు రీసైకిల్డ్ ప్లాస్టిక్ నూలునుంచి తయారు చేసిన టఫెటాల మిశ్రమంతో రూపొందించిన ఈ గౌన్ ఎకో ఫ్రెండ్లీ అని ఎమ్మా సగర్వంగా చాటింది. ఇటీవల జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్-2017లో ఎక్కువమంది మోడళ్లు ఎకో ఫ్రెండ్లీ దుస్తులు ధరించి క్యాట్‌వాక్‌లో పాల్గొన్నారు. అలాగే వాంకోవర్‌లో జరిగిన ఎకో ఫ్యాషన్ వీక్ కూడా ఎంతోమందిని ఆకట్టుకుంది.
వాస్తవానికి పర్యావరణహిత దుస్తుల్లో మూడు రకాలు ఉన్నాయి. సస్టెయినబుల్ క్లోత్స్ తయారీలో వేస్టేజ్ ఉండదు. ఆర్గానిక్ దుస్తుల తయారీలో రసాయనాలను అసలు వాడరు. ఎకో ఫ్రెండ్లీ క్లోత్స్‌తో పర్యావరణం సురక్షితం. ఫ్యాషన్ డిజైనర్లు ఇప్పుడు ఎకోఫ్రెండ్లీ బాట పడుతున్నారు. రెండు దశాబ్దాలుగా పర్యావరణహిత దుస్తుల్ని తయారు చేస్తున్న డిజైనర్ శ్రవణ్‌కుమార్ ఈ తాజా పరిణామం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘అమలా అక్కినేని, ప్రశాంతి తిపిర్నేని (బాహుబలి కాస్ట్యూమ్ డిజైనర్) నాకు రెగ్యులర్ క్లయింట్లు. ఎకోఫ్రెండ్లీ దుస్తులనగానే చీరలు, కుర్తీలనే అనుకుంటారు. కానీ ట్రౌజర్లు, జాకెట్లు, స్కర్టులు వంటివాటినీ తయారు చేయొచ్చు. పైగా వీటి ధర కూడా తక్కువే’ అంటారు శ్రవణ్. మరో ప్రముఖ డిజైనర్, ‘క్రియేటివ్ బీ ఫౌండేషన్’ అధినేత బీనారావు ఓటు వేసేదీ ఎకో ఫ్రెండ్లీ దుస్తులకే. ‘గత ఇరవయ్యేళ్లుగా నేను పర్యావరణహితమైన దుస్తుల తయారీలో ఉన్నాను. నిజానికి ఇప్పుడు చాలామంది పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెడుతున్నారు. అందులోభాగంగా ఎకోఫ్రెండ్లీ దుస్తులపై ఇష్టం కనబరుస్తున్నారు. ఇది మంచి పరిణామం’ అన్నారు. బీనారావు తాజాగా జపాన్‌లోని ఓ స్టోర్‌కు ఎకోఫ్రెండ్లీ దుస్తుల్ని సరఫరా చేస్తున్నారు. ప్రఖ్యాత నటి టబూ తనకు రెగ్యులర్ కస్టమర్ అని చెబుతారామె.
....................................................
ఎకోఫ్రెండ్లీ దుస్తులంటే కేవలం చీరలు, కుర్తీలే కాదు...ట్రౌజర్లు, జాకెట్లు, స్కర్టులు ఇలా ఎన్నో తయారవుతున్నాయి.
-శ్రవణ్ కుమార్, డిజైనర్

ఇప్పుడంతా పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించారు. డిజైనర్లు కూడా ‘గ్రీన్ వే’ బాట పడుతున్నారు. ఇది మంచి పరిణామం.
- బీనా రావు, డిజైనర్