యువ

మోడు చిగురించింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల సీమా సాధిక వృత్తిరీత్యా డాక్టర్. ప్రవృత్తిరీత్యా సమాజ సేవకురాలు. ఒకవైపు వృత్తిని ప్రేమిస్తూనే మరోవైపు సమాజ సేవను ఆస్వాదిస్తోంది. నిరక్షరాస్యత తాండవిస్తున్న గ్రామాల్లో విద్యాసుమాలు విరబూయిస్తోంది. అచేతనంగా ఉన్న గ్రామస్థుల్లో చైతన్యం రగిలిస్తోంది.
డాక్టర్‌గా సీమ వీలు దొరికినప్పుడల్లా గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఒకసారి ధార్వాడ్ జిల్లా బణదూర్ గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించినప్పుడు కొందరు మహిళలు ఆమె వద్దకు వచ్చారు. ఆరు నెలలకోసారి వచ్చి శిబిరాలు నిర్వహించడం బాగానే ఉన్నా, ఈ మధ్యలో ఏం జరిగినా తాము డబ్బులు వెచ్చించి, ట్రీట్‌మెంట్ చేయించుకోలేకపోతున్నామని వాపోయారు. తమకు ఉపాధి చూపిస్తే, తమ కాళ్లపై తాము నిలబడతామని, అప్పుడు ఆరోగ్య శిబిరాల అవసరమే ఉండదని వేడుకున్నారు. వారి మాటలు డాక్టర్ సీమను ఆలోచనలో పడేశాయి. తన ఆలోచనలకు కార్యరూపమిస్తూ ‘నమ్మ మిత్ర ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది.
అయితే బణదూర్ గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించడం ఆమెకు అంత తేలికగా సాధ్యం కాలేదు. గ్రామస్థులు అనేక వర్గాలుగా విడిపోయి ఉన్నారు. వారిని ఒకేతాటిపైకి తీసుకురావడం సాధ్యం కాదని సీమ త్వరలోనే గ్రహించారు. దాంతో పిల్లలపై దృష్టి సారించారు. బణదూర్‌లో చాలామంది పిల్లలు బడికి వెళ్లరు. చదువుపై ధ్యాస పెట్టరు.
దీనికి కారణం గ్రామంలో కరెంటు లేకపోవడం. దాంతో నమ్మ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సీమ ఓ సోలార్ గ్రిడ్‌ను ఏర్పాటుచేసి, 70 ఇళ్లకు కరెంటు తెప్పించారు. కరెంటు రావడంతో బడికెళ్లే పిల్లలు చదువుపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. దాంతో డాక్టర్ సీమపై గ్రామస్థులకు నమ్మకం కుదిరింది. బడికెళ్లే పిల్లల సంఖ్య కూడా పెరిగింది. అలాగే చీకటిపడితే అడవి జంతువులు దాడి చేస్తాయనే భయంతో గ్రామస్థులెవరూ రాత్రిళ్లు ఇల్లు కదిలేవారు కాదు. కరెంటొచ్చాక, ఆ భయం పోయింది. అలాగే అంగన్‌వాడి కేంద్రంలో ఇ -శాల పేరిట చిన్నారులకోసం ఓ ట్యూషన్ సెంటర్‌ను పెట్టారు. ఇది అందరికీ ఉచితం. దీనిద్వారా విద్యాసంబంధిత అంశాలపై సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అంతా కలసి ఒకేచోట కూర్చుని చదువుకోవచ్చు.
నమ్మ మిత్ర ఫౌండేషన్ అంతటితో ఆగలేదు. అదే గ్రామంలో ఇద్దరు వ్యక్తులు మస్కులార్ అట్రొఫీతో బాధపడుతుండటం డాక్టర్ సీమ గమనించారు. ఆ వ్యాధికి మందుల్లేవు. దాంతో సీమ పూనుకుని, వారికి మొబైల్ రిపెయిరింగ్‌లో శిక్షణ ఇప్పించారు. దాంతో ఆ ఇద్దరూ తమ కాళ్లపై తాము నిలబడగలిగారు.
గ్రామంలో మరింతమందికి ఉపాధి కల్పించే నిమిత్తం ఓ టైలరింగ్ ట్రెయినింగ్ సెంటర్‌నూ ఏర్పాటు చేసి, గ్రామస్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఓ కంప్యూటర్ కేంద్రాన్ని నెలకొల్పాలని నమ్మ మిత్ర ఫౌండేషన్ సంకల్పించింది.
నమ్మ మిత్ర ఫౌండేషన్ గ్రామంలోని ప్రతి ఇంటినుంచి నెలకు 20 రూపాయల చొప్పున వసూలు చేస్తుంది. ఈ డబ్బును సోలార్ గ్రిడ్ నిర్వహణకు, దానికోసం నియమించిన కేర్ టేకర్‌కు ఇచ్చే వేతనం కోసం వెచ్చిస్తుంది.
బణదూర్ గ్రామం దారిలోకి రావడంతో సీమ ఇప్పుడు సమీపంలోని కుక్రెవాడ సహా మరికొన్ని గ్రామాలపై దృష్టి సారించారు.
బణదూర్‌లో తాను సాధించిన విజయాలపై సీమ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి, తనకు గ్రామస్థులంతా సహకరించడం వల్లే ఈ విజయం సాధ్యమైందంటారు. పైగా తాను చాలావరకూ గ్రామంలోనే ఉంటాననీ, ఏ చిన్న కార్యక్రమానికైనా గ్రామస్థులు తనను పిలవడం తనకెంతో ఆనందంగా ఉంటుందని ఆమె చెబుతారు.

చిత్రం.. సీమా సాధిక