యువ

సైకిల్ ఎక్కితే పరశురాముడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన జాతీయ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు రజత పతకం లభించింది. పాతికేళ్ల తర్వాత సైక్లింగ్‌లో భాగ్యనగరానికి లభించిన పతకమిది. ఈ ఘనత సాధించింది...పరశురామ్ ఛెంజీ అనే 23 ఏళ్ల కుర్రాడు!
స్కూల్‌లో ఫుట్‌బాల్ ఆటపై ఇష్టం పెంచుకున్న పరశురామ్, సైక్లింగ్‌వైపు మళ్లడానికి, పతకం సాధించే స్థాయికి ఎదగడానికి అతని పట్టుదలే కారణం. పదహారేళ్ల వయసులో తండ్రి అరవింద్ ఛెంజీ ఓ సైకిల్ కొని, కొడుక్కి ఇచ్చాడు. దానిపై ఎక్కి, ట్యూషన్‌కి, స్కూల్‌కి వెళ్లడం మొదలుపెట్టిన పరశురామ్..రానురాను దానిని వదిలి బయటకు వెళ్లలేని పరిస్థితికి చేరుకున్నాడు. అంతగా సైకిల్‌పై ఇష్టం పెంచుకున్నాడు. ఇప్పుడు 23 ఏళ్ల వయసులో 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకు వెడుతున్నా అదీ సైకిల్‌పైనే. సైకిల్‌పట్ల కొడుకు మమకారం చూసిన తండ్రి, అతన్ని పోటీల్లో పాల్గొనే దిశగా ప్రోత్సహించాడు. అయితే జాతీయ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పరశురామ్ పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పాల్గొని, దేశంలోనే టాప్10లో ఒకడుగా నిలిచాడు. ఇప్పుడు ఏకంగా సిల్వర్ మెడల్‌నే సంపాదించాడు. అయితే గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమంటాడు పరశురామ్. దానికోసం రోజుకు ఐదు గంటల చొప్పున, వారంలో ఆరు రోజులు ప్రాక్టీస్ చేస్తున్నాడు. గతంలో బెల్జియంలోనూ శిక్షణ పొందాడు. ఇష్టంతో చేస్తే ఏ పనీ కష్టం కాదనడానికి పరశురామే నిలువెత్తు ఉదాహరణ. అతనికి ‘యువ’ హ్యాట్సాఫ్ చెబుతోంది!