యువ

ఒకప్పటి మోడల్.. ఇప్పుడందరికీ రోల్ మోడల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలలు అందరూ కంటారు...ఆ కలలను నిజం చేసుకునేది మాత్రం కొందరే!
సినిమా రంగం అంటేనే పేరు, డబ్బు, ఫ్యాన్ ఫాలోయింగ్ అడగకుండానే వస్తాయి. అందుకే ఏ రంగంలో ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా సినిమాల్లో ఛాన్స్ వస్తే, ఎవరైనా ఎగిరి గంతేస్తారు!
ఇక అక్కడే పాతుకుపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు.
వేషాలు రాకపోయినా, అవకాశాలు అడుగంటిపోయినా సినిమా రంగాన్ని వదిలి వెళ్లేందుకు ఇష్టపడరు!
సినిమాలకూ, నటీనటులకు ఉన్న క్రేజ్ అటువంటిది మరి!
కానీ మోడల్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి...సినిమాల్లో నటించి... పైలెట్ కావాలన్న చిరకాల వాంఛతో ఆ రంగాన్నీ వదిలేసి అనుకున్నది సాధించిన ఓ నటి గురించి తెలుసా?
ఆమె పేరు...గుల్ పనాగ్!
గుర్తొచ్చిందా?
డోర్, మనోరమ సిక్స్‌ఫీట్ అండర్, అబ్ తక్ ఛప్పన్ 2, ధూప్, రణ్, జుర్మ్ వంటి సినిమాల్లో నటించిన గుల్ పనాగ్ ఇప్పుడు పైలెట్!
పైలెట్ కావాలన్నది ఆమె చిన్ననాటి ఆశయం. అందం, అతిశయం ఆమెను సినిమాలవైపుకు లాక్కొస్తే, తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఆమె ఆ సినిమాలనే వదిలిపెట్టి...అనుకున్నది సాధించింది.
ఆ మాటకొస్తే...గుల్ పనాగ్ బహుముఖ ప్రతిభావంతురాలు.
ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను చూస్తే ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. నిండా నలభై ఏళ్లు లేని గుల్ పనాగ్ మోడల్, యాక్టర్, సినీ నిర్మాత, రాజకీయవేత్త, బైక్ రేసర్ కూడా.
గుల్ పనాగ్ చండీగఢ్‌లో పుట్టింది. తండ్రి వృత్తిరీత్యా ఆర్మీలో పనిచేయడంతో తరచూ ట్రాన్స్‌ఫర్లు జరిగేవి. అలా గుల్ 14 స్కూళ్లలో చదివిందట. చండీగఢ్ వర్శిటీనుంచి పొలిటికల్ సైన్స్‌లో పిజి చేసిన గుల్, మంచి వక్త కూడా. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి డిబేట్ కాంపిటీషన్లలో (వక్తృత్వ పోటీలు) ఆమె ఎన్నో ప్రైజ్‌లు సంపాదించింది. అంతర్ వర్శిటీ పోటీల్లో బంగారు పతకాలనూ గెలుచుకుంది. అందగత్తె కావడంతో స్నేహితుల ప్రోత్సాహంతో అందాల పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. 1999లో మిస్ ఇండియా కిరీటం ఆమెను వరించింది. ఆ తర్వాత మోడల్‌గా మారి ర్యాంప్‌లపై హొయలొలికించింది. సినిమాల్లోకి అడుగుపెట్టి, బాలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటించింది.
సినిమాలనుంచి తప్పుకుని రిషి అట్టారీ అనే కుర్రాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరింది. ఆ పార్టీలో కొనసాగుతూనే రేసింగ్‌పై దృష్టి సారించింది. స్కార్పియో వాహనానికి మార్పులు చేర్పులు చేసి, హిమాలయాల్లోని కచ్చా రోడ్లపైనా రేసింగుల్లో పాల్గొందామె. ఈశాన్య రాష్ట్రాల్లో ఆమె పాల్గొన్న రేసులపై ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని త్వరలో డిస్కవరీ చానెల్ ప్రసారం చేయనుంది.
అనుకున్న లక్ష్యాలను ఒకదాని తర్వాత ఒకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న గుల్ పనాగ్, ఈ ఏడాది ఆరంభంలో పైలట్ కావడంపై దృష్టి పెట్టింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఉన్న కైమ్స్ ఏవియేషన్ అకాడెమీలో చేరి శిక్షణ పొందింది. సుమారు రెండు నెలలపాటు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి చదివి... డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) పరీక్ష రాసి పాసైంది. ఆ తర్వాత పైలట్‌గా శిక్షణ పొందింది. ఇటీవలే పైలట్‌గా ఆమెకు లైసెన్స్ లభించింది.
ఇదీ గుల్ పనాగ్ ప్రస్థానం. ఇంతా చేసి ఆమె వయసు 37 ఏళ్లే. పైలెట్‌గా లైసెన్స్ అందుకున్న వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలకు ప్రశంసలు వెల్లువెత్తాయి. కట్టుబాట్ల అడకత్తెరలో నలిగిపోతూ, ఆశయాలను సాధించలేక, లక్ష్యాలను అధిగమించలేకపోతున్న ఎందరో మహిళలకు గుల్ పనాగ్ ప్రస్థానం స్ఫూర్తిదాయకం అనడంలో అతిశయోక్తి లేదు కదూ!