యువ

పాదాలకు రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డయాబెటిక్ రోగులకు పాదాల సంరక్షణ ఎంతో ముఖ్యం. శరీరంలో చక్కెర శాతం ఏ మాత్రం పెరిగినా పాదాలపై ముందుగా ప్రభావం కనబడుతుంది. అలాగే పాదాలకు దెబ్బ తగిలితే ఓ పట్టాన తగ్గదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని, పాదాల సంరక్షణకు ప్రత్యేకంగా సాక్స్ మార్కెట్లోకి వచ్చాయి. వీటి పేరు ‘సైరన్ స్మార్ట్ సాక్స్’. వీటిలో ఉండే సునిశితమైన సెన్సర్లు.. పాదాలకు రక్తప్రసరణ తీరు, ఉష్ణోగ్రత వంటి వివరాలను ఇవి ఎప్పటికప్పుడు సంబంధిత యాప్‌కు చేరవేస్తాయి. ఈ సమాచారం ఆధారంగా డయాబెటీషియన్ సలహాపై తగిన చికిత్స చేసుకునే వీలుంటుందన్నమాట. అన్నట్టు ఈ సాక్స్‌ను హాయిగా ఉతుక్కోవచ్చు కూడా.