యువ

ఎక్కడికి వెళితే అక్కడికి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేరెవర్ యు గో...అవర్ నెట్‌వర్క్ ఫాలోస్!- ఒకప్పటి హచ్ నెట్‌వర్క్ స్లోగన్ ఇది. ఓ కుర్రాడు ముందు వెడుతుంటే అతన్ని అనుసరించి పగ్ వెళ్లే ఈ అడ్వర్టయిజ్‌మెంట్ అప్పట్లో ఓ సంచలనం. పగ్‌లాగే మిమ్మల్ని అనుసరించి, మీ సూట్‌కేస్ వెనకాలే వస్తుంటే ఎలా ఉంటుంది? మజాగా ఉంటుంది కదూ. ఫొటోలో ఆ వ్యక్తి కూర్చున్నది అలాంటి సూట్‌కేస్‌పైనే. దీని పేరు ట్రావెల్‌మేట్ రోబో సూట్‌కేస్. ఇందులో ప్రత్యేకమైన సెన్సర్ల అమరిక ఉంటుంది. ఇది స్మార్ట్ఫోన్‌తో అనుసంధానమై ఉంటుంది. రైలు దిగిన వెంటనే సూట్‌కేస్ బటన్ నొక్కితే అది మిమ్మల్ని అనుసరిస్తూ వస్తుంది. పైగా ఇది నిలువుగానూ, అడ్డంగానూ కూడా ప్రయాణిస్తుందట. మరో విశేషమేమంటే దానిపై కూర్చుంటే మనల్ని కూడా మోసుకుపోతుందట. ఈ రోబో సూట్‌కేస్ ధర 399 డాలర్లు. ఎదురుగా ఎవరైనా అడ్డంగా ఉంటే, వారిని తప్పించుకుంటూ వెళ్లడం దీని ప్రత్యేకత.