యువ

స్మార్ట్ ఫోన్‌ను తలదనే్న స్మార్ట్‌వాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ వాచ్‌ల సాంకేతికత స్మార్ట్ఫోన్లను తలదనే్న విధంగా పదునెక్కుతోంది. జెబ్రానిక్స్ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ టైమ్ 100 వాచ్ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ వాచ్‌తోపాటు చీళఇ ఇ్ద502 పేరిట ఓ బ్లూటూత్ హెడ్‌సెట్ కూడా అందిస్తున్నారు. 64 ఎంబి ర్యామ్, 32 ఎంబి ఇంటర్నల్ మెమొరీతో బ్లూటూత్‌పై 3 గంటల టాక్‌టైమ్ అందించే ఈ స్మార్ట్ వాచ్‌లో..టచ్ స్క్రీన్ డిస్‌ప్లే కూడా ఉంది. ఇందులో సిమ్ స్లాట్ ఉండటం మరో ప్రత్యేకత. బ్లూటూత్ హెడ్‌సెట్‌తో స్మార్ట్ టైమ్ 100ని కనెక్ట్ చేస్తే, ఇక మాటలే మాటలు. ఇదే వాచ్‌లో ఇన్‌బిల్ట్ స్పీకర్, మైక్ కూడా ఉన్నాయట. ఇక స్మార్ట్ వాచ్‌లో ఉండే ఇతరత్రా ప్రయోజనాలు ఇందులోనూ ఉన్నాయి. హార్ట్‌రేట్, నడక వేగం, కేలరీల లెక్క ఇలాంటవన్నిటినీ స్మార్ట్ టైమ్ 100 కూడా అందిస్తుంది.