యువ

సెల్‌ఫోన్లను బంధించేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్‌ఫోన్ అనేది ఒక వరం...అలాగే ఒక శాపం కూడా. సెల్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే. మరోవైపు మానవ సంబంధాలను సెల్‌ఫోన్ హరిస్తోందన్న అభియోగాలు కూడా లేకపోలేదు. నలుగురు కూర్చున్నప్పుడు పట్టుమని పది నిమిషాలు కూడా నిరంతరాయంగా మాట్లాడుకోలేకపోతున్నాం. ఈలోగానే ఎవరికో ఒకరికి కాల్ రావడమో, మెసేజ్ రావడమో జరుగుతుంది. వాళ్లు దానిని ఆన్సర్ చేసేంతవరకూ మాటలు ఆగిపోతున్నాయి. ఈ ఇబ్బందిని తప్పించేందుకు ‘సెల్‌ఫోన్ లాకప్ కేజ్’ మార్కెట్లో దొరుకుతోంది. ఉదాహరణకు ఏదైనా మీటింగ్ జరగబోతోందనుకోండి. ఆ మీటింగ్‌కు హాజరైన వారంతా తమ సెల్‌ఫోన్లను ఆఫ్ చేసి, ఈ కేజ్‌లో పెట్టి, టైమర్ ఆన్ చేస్తే చాలు. ఎలాంటి రణగొణధ్వనులు లేకుండా హాయిగా మీటింగ్ జరుపుకోవచ్చు. ఈ కేజ్‌లో ఆరు సెల్‌ఫోన్లు పడతాయి. 15, 30, 45, 60 నిమిషాలు...ఇలా టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. దీని ధర 64.99 డాలర్లు.