యువ

మాట్లాడే రెజ్యూమె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెజ్యూమె పంపించడం...ఇంటర్వ్యూకి హాజరు కావడం పాత పద్ధతి.
సెల్ఫీ వీడియో రెజ్యూమె పంపడం...ఉద్యోగం సంపాదించడం - కొత్త పద్ధతి!
సెల్ఫీ వీడియో రెజ్యూమెనా! కొత్తగా ఉందే! అనుకుంటున్నారా? అవును. నిజం... ఇక అప్లయ్ చేసుకోవడాల్లేవ్...ఇంటర్వ్యూలకు వెళ్లడాల్లేవ్! మీ గురించి మీరు పంపే సెల్ఫీ వీడియో రెజ్యూమెనే మాట్లాడుతుంది. మీ ఆలోచనలేంటి...అభిరుచులేంటి..హాబీలేంటి అనేవి ఆ రెజ్యూమేనే చెబుతుంది. మీ తెలివితేటల్ని రిక్రూటర్ల కళ్లకు కడుతుంది. చివరగా...మీకు ఉద్యోగం తెచ్చిపెడుతుంది!
ఇదెలా సాధ్యమైంది అనేగా మీ ప్రశ్న?
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ ఇంకా రెజ్యూమె పంపడమేంటీ చీప్‌గా...అనుకుంది హైదరాబాద్‌కు చెందిన హ్యాపీ మైండ్స్ మాన్‌పవర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్సల్టింగ్ సంస్థ. అనుకున్నదే తడవు మేధావులంతా చీప్‌గా చూస్తున్న ‘సెల్ఫీ’ని తన వీడియో రెజ్యూమేకి సాధనంగా ఎంచుకుంది. ఇప్పటివరకూ సెల్ఫీని సరదాకోసమే అంతా వాడుతున్నారు. సెల్ఫీ అనేది కుర్రకారును ప్రమాదాల్లోకి నెడుతోందని వాదించేవారూ లేకపోలేదు. అలాంటి సెల్ఫీయే యువతరానికి కీలకం అయ్యేలా వీడియో రెజ్యూమేకు రూపకల్పన చేసింది హ్యాపీ మైండ్స్!
ఇంతకీ హ్యాపీ మైండ్స్ సంస్థ ఏం చేసింది?
ఏదైనా ఉద్యోగానికి ఓ అభ్యర్థి సెల్ఫీ వీడియో రెజ్యూమె పంపించాలనుకుంటే...ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి హ్యాపీ మైండ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తన అర్హతలను, అభిరుచులను వివరిస్తూ ఓ నిమిషం సేపు సెల్ఫీ తీయాలి. దీనికి యాప్ సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. అలా రూపొందించిన రెజ్యూమెను హ్యాపీ మైండ్స్‌కు పంపిస్తే, ఆ సంస్థతో టై అప్ చేసుకున్న కంపెనీలకు ఈ రెజ్యూమెను ఫార్వర్డ్ చేస్తారన్నమాట. సింపుల్! ఈ సెల్ఫీ వీడియో రెజ్యూమె ఆధారంగా అభ్యర్థి మాట తీరును, భాషను, బాడీ లాంగ్వేజీను అంచనా వేయొచ్చన్నది హ్యాపీ మైండ్స్ అభిప్రాయం.
ప్రస్తుతానికి హ్యాపీ మైండ్స్‌తో పలు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతోపాటు సుమారు 20కి పైగా సంస్థలు టై అప్ అయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని హ్యాపీ మైండ్స్ ధీమా వ్యక్తం చేస్తోంది. నిజానికి సెల్ఫీ వీడియో రెజ్యూమెకి హ్యాపీ మైండ్స్ మూడేళ్ల కిందటే శ్రీకారం చుట్టింది. ఇప్పుడిప్పుడే దీనికి ప్రాచుర్యం లభిస్తోంది.