యువ

లేచింది మహిళాలోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో టాక్స్ లేని వస్తువేదైనా ఉందా?
ఎవరినడిగినా ఈ ప్రశ్నకు లేదనేదే సమాధానం!
కానీ కొన్నిటికి మాత్రం మినహాయింపు ఉంది...
అవేమిటో తెలుసా...కండోమ్స్, కాంట్రాసెప్టివ్ పిల్స్!
అవును నిజం...వీటికి టాక్స్ లేదు!
మనిషి తన దైనందిన జీవితంలో ఎక్కువగా వినియోగించే అనేక వస్తువులపై పన్ను పడుతూనే ఉంది. అలాంటివాటిలో మరీ ముఖ్యమైనది మహిళలు ఉపయోగించే శానిటరీ నాప్‌కిన్స్.
వీటికీ పన్నుపోటు తప్పడం లేదు.
నిజానికి శానిటరీ నాప్‌కిన్స్ కొనలేక, కొన్నా వాటిని మార్చుకునేందుకు టాయిలెట్ సౌకర్యం లేక గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది బాలికలు రజస్వల కాగానే చదువుకు స్వస్తి చెబుతున్నారు.
పాఠశాలలో డ్రాపవుట్లు పెరగడానికి గల కారణాల్లో ఇదీ ఒకటి.
శానిటరీ నాప్‌కిన్స్ వాడకపోవడం వల్ల రకరకాల వ్యాధులకు గురవుతున్న మహిళలూ ఉన్నారు.
ఈ విషయం తెలిసినా ప్రభుత్వాలకు చీమకుట్టినట్టయినా లేదు.
కానీ ఇప్పుడో ఉద్యమం మొదలైంది. అది చినికి చినికి గాలివానగా మారబోతోంది.
ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది ఓ పార్లమెంట్ సభ్యురాలు. పేరు సుస్మితా దేవ్. కండోమ్స్‌కూ, కాంట్రాసెప్టివ్స్‌కూ లేని పన్ను పోటు శానిటరీ నాప్‌కిన్స్‌కు ఎందుకంటూ ఆమె సోషల్ మీడియాలో ఉద్యమం చేపట్టారు. ‘టాక్స్ ఫ్రీ వింగ్స్’ పేరుతో ఛేంజ్.ఆర్గ్ వెబ్‌సైట్‌లో ఆమె ఓ పిటిషన్ పెట్టారు. దీనికి విపరీతంగా మద్దతు లభిస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఉద్దేశిస్తూ రాసిన ఈ పిటిషన్‌కు మద్దతిచ్చిన వారిలో రాహుల్ గాంధీ, సల్మాన్ ఖుర్షీద్ వంటి ప్రముఖులు ఉన్నారు. ‘మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని లక్షలాది మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు నడుం బిగించండి..నేను ఈ పిటిషన్‌పై సంతకం చేశాను. మీరూ చేయండి’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం విశేషం.
మహిళల రుతుక్రమానికి సంబంధించిన టాంపన్స్, మెన్‌స్ట్రువల్ కప్స్, శానిటరీ నాప్‌కిన్స్ వంటి అన్నిటిపైనా టాక్స్ తొలగించాల్సిందేనంటారు అదితి గుప్తా. ఆమె మెన్‌స్ట్రుపీడియా అనే ఆన్‌లైన్ గైడ్‌ను నిర్వహిస్తున్నారు. రుతుస్రావం సమయంలో మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఈ వెబ్‌సైట్ సూచనలూ, సలహాలూ ఇస్తూ ఉంటుంది.
ఖరీదైన శానిటరీ నాప్‌కిన్స్ కొనలేని బాలికలకోసం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు చవకగా నాప్‌కిన్స్ తయారు చేసి, తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. టాక్స్ తొలగించడం ద్వారా ఇలాంటి సంస్థలను ప్రోత్సహించినట్టవుతుంది. శానిటరీ నాప్‌కిన్స్‌లో ప్లాస్టిక్‌ను ఉపయోగించి తయారు చేసేవి బయో డీగ్రేడబుల్ కావు. ఇలాంటివాటిపై కాస్తోకూస్తో పన్ను విధించి, పర్యావరణహిత నాప్‌కిన్స్‌పై పూర్తిగా పన్ను రద్దు చేయాలని సుస్మితా దేవ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రముఖ నటి, మోడల్ దియా మీర్జా మరో అడుగు ముందుకేసి, శానిటరీ నాప్‌కిన్స్ తయారు చేసే అన్ని సంస్థలూ తప్పనిసరిగా బయో డీగ్రేడబుల్ నాప్‌కిన్స్‌ను మాత్రమే తయారు చేయాలంటారు. దీనివల్ల వ్యర్థాల బెడద తప్పుతుందంటారు. భారతదేశంలోని ప్రతి మహిళ నాన్ బయో డీగ్రేడబుల్ నాప్‌కిన్స్‌ను వాడిన పక్షంలో ఏటా లక్షల టన్నుల వ్యర్థాలు పెరుగుతాయి. దీనివల్ల పర్యావరణానికి ఎంత హానికరమో ఆలోచించాలంటారామె.
ప్రస్తుతం సుస్మితా దేవ్ ఆన్‌లైన్ పిటిషన్‌పై 66వేల మందికి పైగా సంతకాలు చేశారు. ఈ సంఖ్య 75వేలకు చేరాక, పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపుతారు.
*

ఇదీసంగతి
మన దేశంలోని 35.5 కోట్లమంది మహిళల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే శానిటరీ నాప్‌కిన్స్‌ను వినియోగిస్తున్నారు.
ఈ పనె్నండు శాతం మందీ దాదాపు 14 శాతం వరకూ విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో 2 శాతం మంది మహిళలే వీటిని వినియోగిస్తున్నారు.
జిఎస్‌టి అమలులోకి వచ్చినా, శానిటరీ నాప్‌కిన్స్‌పై 12 శాతం పన్ను చెల్లించవలసి వస్తుందని అంచనా.
*

ఈవ్ టీజింగ్‌పై మాట్లాడేందుకు మహిళలు ముందుకొస్తున్నప్పుడు, శానిటరీ నాప్‌కిన్స్‌పై మాట్లాడేందుకు ఎందుకు వెనకాడటం? నా స్నేహితుల్లో ఆర్థికంగా వెనుకబడిన కొందరు శానిటరీ నాప్‌కిన్స్ కొనలేకపోతున్నారు. ఎంపి సుస్మితా దేవ్ చొరవను నేను అభినందిస్తున్నా. ప్రభుత్వం త్వరలోనే స్పందించి, టాక్స్ రద్దు చేస్తుందని భావిస్తున్నా.
- ఆయేషా ఫర్హీన్, విద్యార్థిని
(ఎమ్మెస్సీ న్యూట్రిషన్),
షాదాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
మెడికల్ సైనె్సస్
*
చిత్రం..సుస్మితా దేవ్