యువ

జల కాలుష్యానికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యర్థాలతో నిండిపోతున్న నదీ జలాలను శుద్ధి చేసేందుకు చవకలో ఓ రోబోను కనిపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు ముంబయి విద్యార్థులు. వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బిటెక్ చదువుతున్న కిరణ్ పార్టే, అజిత్ కృష్ణమూర్తి, పీయూష్ దేవికర్, కేదార్ పెడ్నేకర్ అనే విద్యార్థులు డఉ్గ్ళ్ద అనే రోబోను కనిపెట్టారు. చూడటానికి ఓ పెద్ద తెప్పలా కనిపించే ఈ రోబోను పివిసి పైపులతోనూ, రబ్బర్‌తోనూ తయారు చేశారు. దీనికి ఓ పెద్ద కనే్వయర్ బెల్ట్ కూడా ఉంటుంది. ఈ రోబోను కంప్యూటర్‌తో అనుసంధానం చేస్తారు. తద్వారా రోబో కదలికలను కంప్యూటర్ ద్వారా నియంత్రిస్తారు.నదుల్లో ఉపరితల జలాలపై పేరుకున్న వ్యర్థాలను ఈ రోబో దివ్యంగా తొలగిస్తుంది. ఈ వ్యర్థాలు కనే్వయర్ బెల్ట్ ద్వారా క్యారియర్ ట్రేలో పడతాయి. వాటిని ఒడ్డుకు చేర్చడంతో రోబో పని పూర్తవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో వ్యర్థాలను శుభ్రం చేసే అన్ని రకాల మెషీన్లకన్నా తమ రోబో అత్యంత చవకైనదని చెబుతున్నాడు కిరణ్ పార్టే. అతను ఈ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ‘రోజూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు నదులు, కాలవల్లో కలుస్తున్నాయి. తద్వారా జల కాలుష్యం పెరిగిపోతోంది. వీటిని తొలగించేందుకు ప్రస్తుతం రివర్ క్లీనింగ్ మెషీన్లను వాడుతున్నారు. ఇవి చాలా ఖరీదైనవి. ఎక్కువ స్పేస్‌ను ఆక్రమిస్తాయి కూడా. మేం రూపొందించిన సెర్చ్ రోబో ఖరీదు కేవలం 12వేలనుంచి 15వేల మధ్య ఉంటుంది. ఇతర రివర్ క్లీనింగ్ మెషీన్లతో పోలిస్తే మా రోబో రేటు పది రెట్లు తక్కువ’ అని వివరించాడు కిరణ్ పార్టే.