యువ

టాప్ కాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ పోలీస్ శాఖలో రాధిక పేరు చెబితే అంతా ఇట్టే గుర్తు పడతారు. ఇటీవలే పోలీస్ ట్రెయినింగ్ కాలేజీ ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొందిన రాధిక పర్వతారోహణలో దిట్ట. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాలో ఉన్న రాధిక గతంలో ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం-ఎవరెస్ట్‌ను అధిరోహించి, ఈ ఘనత సాధించిన ఏకైక మహిళా పోలీస్ అధికారిణిగా రికార్డు నెలకొల్పారు. ఇటీవలే ‘ఆస్సీ 10 పీక్ ఛాలెంజ్’ను విజయవంతంగా పూర్తి చేసి, మరో రికార్డు సాధించారు. ఇందులో భాగంగా వౌంట్ కొసియూజొకో (2,228 మీటర్లు), వౌంట్ టౌన్‌సెండ్ (2,209), వౌంట్ ట్వైనామ్ (2,195), వౌంట్ రామ్స్ హెడ్ (2,190), వౌంట్ అలైస్ రాసన్ పీక్ (2,160 మీటర్లు) వంటి ఎత్తయిన శిఖరాలను అధిరోహించారామె.
వాస్తవానికి ఆస్సీ 10 పీక్ ఛాలెంజ్‌లో పాల్గొనాలని హైదరాబాద్‌కు చెందిన తనతో సహా ఐదుగురు మహిళలు నిర్ణయించుకున్నామని రాధిక చెప్పారు. చివరి నిమిషంలో మిగిలిన నలుగురూ విరమించుకోవడంతో తాను ఒక్కతెనే ఆస్ట్రేలియాకు బయల్దేరానన్నారు. కాన్‌బెర్రా చేరుకున్నాక, అక్కడి స్థానిక మహిళలతో కలసి పర్వతారోహణ ప్రారంభించానని చెప్పారామె. వాస్తవానికి ఆస్సీ 10 పీక్ ఛాలెంజ్‌ను పూర్తి చేసేందుకు ఎవరికైనా రెండున్నర రోజులనుంచి మూడు రోజులు పడుతుంది. అయితే రాధిక కేవలం రెండు రోజుల్లో పూర్తి చేయడం విశేషం.
తాను శాకాహారిని కావడంతో పర్వతారోహణలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, బంగాళా దుంపల చిప్స్, చాకొలెట్స్, ఉడకబెట్టిన గుమ్మడి కాయ ముక్కలు, యాపిల్ పళ్లు వంటి వాటితో సరిపెట్టుకోవలసి వచ్చిందని చెప్పారు. పర్వతారోహణకు ఫిట్‌నెస్ ముఖ్యం కాబట్టి రోజూ సైక్లింగ్, రన్నింగ్ చేస్తానన్నారు. 2012లో తాను పర్వతారోహణ ప్రారంభించాననీ, తన భర్త, ఇద్దరు పిల్లలూ తనకు ఎంతో ప్రోత్సాహం అందజేస్తారని ఆమె తెలిపారు. ఏయే పర్వతాలను అధిరోహించవచ్చు, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి వంటి సమాచారాన్ని తన పిల్లలే తనకు అందిస్తారని ఆమె చెప్పారు. తనను చాలామంది ‘ఎందుకు ఇలా రిస్క్ తీసుకోవడం?’ అని అడుగుతూ ఉంటారని, అయితే రిస్క్ తీసుకోవడం వల్ల పోయేదేమీ లేదు, మనలో ఉండే అహం తప్ప అని సమాధానం చెబుతానంటున్న రాధిక, కాస్త ఆగి మరో పర్వతారోహణకు ప్లాన్ చేస్తానంటున్నారు.