యువ

లాంగ్ మార్చ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

100 కిలోమీటర్ల నడక
48 గంటల్లో లక్ష్యసాధన
- అంటే...దాదాపు గంటలో రెండు కిలోమీటర్లుపైనే నడవాలి. ఒకటో రెండో కిలోమీటర్లయితే ఫరవాలేదు. కానీ ఏకధాటిగా వంద కిలోమీటర్లు నడవాలంటే కత్తిమీద సామే! ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళల బృందం.
బెంగళూరులో ఇటీవల ఆక్స్‌ఫామ్ ట్రయల్ వాకర్ ఇండియా ఛాంపియన్‌షిప్ జరిగింది. 100 కిలోమీటర్ల దూరాన్ని 48 గంటల్లో చేరుకోవడం లక్ష్యం. హైదరాబాద్‌కు చెందిన ‘షీ కేర్స్’ సంస్థలో పనిచేసే ఐదుగురు మహిళల బృందం ఈ ఛాలెంజ్‌ను స్వీకరించింది. ఈ లక్ష్యాన్ని 40 గంటల్లోనే పూర్తి చేసి విజయం సాధించింది.
అర్చనా బిష్త్, పుష్పిత బాలకృష్ణన్, అంజలి జోషి, అనురాధ కమ్మిలరాజు ఈ బృందంలో సభ్యులు. ప్రతిష్ఠాత్మకమైన ఈ పోటీల్లో పాల్గొనేందుకు వీరంతా ముందుగానే కసరత్తు మొదలుపెట్టారు. తమ అనుభవాల గురించి అర్చన వివరించారు. ‘మొదటి రోజు 61 కిలోమీటర్లు నడవాలని ముందుగానే నిర్దేశించుకున్నాం. ఎంత జాగ్రత్తగా నడిచినా కాళ్లు బొబ్బలెక్కిపోయాయి. మా దారి ఎత్తుపల్లాలతో, పర్వతప్రాంతంగా ఉండటం అందుకు కారణం. దాంతో తొలిరోజు కేవలం 41 కిలోమీటర్లు మాత్రమే నడవగలిగాం. మాతోపాటు వచ్చిన సహాయక బృందం వైద్య సపర్యలు చేసినా, అంతకుమించి ముందుకు వెళ్లడం మావల్ల కాలేదు. మూడు గంటలు విశ్రాంతి తీసుకున్నాక, రెండో రోజు నడక మొదలెట్టాం. 24 గంటల్లో 59 కిలోమీటర్లు నడవాలి. లక్ష్యం మా ముందు కొండలా కనబడుతూంటే అడుగు ముందుకేశాం. ఆయాసం ఎగదన్నుతున్నా, అడుగులు ముందుకు పడనంటున్నా పట్టు వదలక నడిచాం. చివరి ఐదు కిలోమీటర్లూ అయితే మాకు పెద్ద సవాల్‌గానే పరిణమించాయి. అయినా సరే, పట్టు వదలని విక్రమార్కుల్లా నడిచి ఇంకా ఎనిమిది గంటలు మిగిలి ఉండగానే లక్ష్యం చేరుకున్నాం’ అంటూ వివరించారు.
ఈ పోటీలో పాల్గొనడానికి ముందు తాము చేసిన ప్రాక్టీస్ గురించి పుష్పిత వివరిస్తూ ‘రోజుకి ఐదు కిలోమీటర్ల చొప్పున నడుస్తూ, దానిని చివరికి 15 కిలోమీటర్ల దూరం వరకు పెంచాం. అయితే మేం ప్రాక్టీస్ చేసింది తారు రోడ్లపైన. తీరా పోటీలో పాల్గొన్నప్పుడు చూస్తే దారంతా రాళ్లూ రప్పలమయం. ఆనేక సందర్భాల్లో పర్వత ప్రాంతాల్లో కూడా నడవాల్సి వచ్చింది. దీంతో ఎక్కువ సమయం పట్టింది’ అని చెప్పారు. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్న అంజలి అందుకుంటూ ‘సమాజానికి మా వంతుగా ఎంతో కొంత చేయాలన్నదే మా నలుగురి లక్ష్యం. ఒక్కొక్కరూ విడివిడిగా చేసే సాయం కంటే సమష్టి కృషి చేసి, విజయం సాధిస్తే పెద్దమొత్తంలో సాయపడవచ్చు. ఈ ఆలోచనే మమ్మల్ని ఈ పోటీలో పాల్గొనేలా చేసింది. ఈ పోటీలో విజయం సాధించడం ద్వారా వచ్చిన డబ్బుతో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఉపయోగపడుతుంది’ అని వివరించారామె.
కొసమెరుపేమిటంటే- ఈ నలుగురూ ఇప్పుడు 40వ పడిలో ఉండటం. ఆ వయసులో ఇంత సాహసం చేయడం మాటలు కాదు కదా! సో...హేట్సాఫ్ టు దెమ్!
**