యువ

మెట్లెక్కే చైయిర్ దివ్యాంగులకు వరమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంగ వైకల్యంతో బాధపడుతున్నవారు మెట్లు ఎక్కాలంటే నరకమే. మన దేశంలోని అనేక రైల్వే స్టేషన్లలో దివ్యాంగులు పడే అవస్థలు వర్ణనాతీతం. ప్లాట్‌ఫామ్‌నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు మారాలంటే మెట్లు ఎక్కడం, దిగడం తప్పదు. అలాగే దివ్యాంగులు పని మీద ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా ఇబ్బందే. అయితే ఇకపై అలాటి అవస్థలు ఉండకపోవచ్చు. వారికోసం ప్రత్యేకంగా రూపొందించిన చైయిర్ మార్కెట్లోకి అందుబాట్లోకి రాబోతోంది. దాని పేరు -స్కెవో స్టెయిర్ క్లైంబింగ్ వీల్ చెయిర్. దీనికి చక్రాలతోపాటు రబ్బర్ ట్రాక్స్ కూడా ఉంటాయి. మామూలు మెట్లే కాదు...స్పైరల్ స్టెయిర్‌కేసేస్‌ను కూడా ఇవి అవలీలగా ఎక్కేస్తాయట. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ వీల్‌చైయిర్లను దివ్యాంగులకోసం ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు వంటి వాటిచోట ఉంచితే వారికెంతో ఉపయోగంగా ఉంటుంది.