యువ

సీడ్ బాంబులు వేద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కల పెంపకానికి వినూత్న పద్ధతి
ముంబయికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కృషి

పర్యావరణం..ప్రకృతి...పచ్చదనం!
ఈ పదాలన్నీ వినడానికి బాగానే ఉన్నా, వాటికోసం పరితపించేవారు, వాటిని పరిరక్షించేవారూ కరవైపోతున్నారు.
ఈ మూడూ బాగుండాలంటే వృక్ష సంతతి పెరగాలి. మొక్కలు నాటాలి, చెట్లను నరకకూడదని అందరికీ తెలిసినా, స్వార్థ ప్రయోజనాలకోసం వాటిని బలి చేస్తూనే ఉన్నారు. ఫలితంగా పర్యావరణ సమతూకం దెబ్బతింటోంది. కాలుష్యం పెచ్చుమీరుతోంది. ఓజోన్ పొర దెబ్బతిని ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలు భూమిపై జీవజాలాన్ని హరిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో నూటికో కోటికో ఒక్కరు చొప్పున ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ పరిరక్షకులు ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే నానుడిని ప్రజల్లోకి తీసుకువెళ్లి, మొక్కలు నాటే దిశగా వారికి స్ఫూర్తిని అందిస్తున్నారు. అలాంటి కోవకు చెందినదే ‘ఫ్రెండ్స్ ఫర్ రివైవింగ్ అవర్ గ్రీన్ ఎర్త్’ సంస్థ. ప్రకృతి ప్రేమికులు, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు, పర్యావరణ హితులు వంటివారు ఈ సంస్థలో సభ్యులు. ముంబయికి చెందిన ఫ్రెండ్స్ ఫర్ రివైవింగ్ అవర్ గ్రీన్ ఎర్త్... మొక్కలు నాటేందుకు వినూత్న పద్ధతులు అవలంబిస్తోంది. అందులో ప్రధానమైనది సీడ్ బాంబ్స్.
బాంబ్స్ పేరు వినగానే బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. చూడటానికి ఇవి బాంబుల్లా ఉంటాయి కాబట్టి ఆ పేరు పెట్టారంతే. వాస్తవానికి ప్రాచీన కాలంలో ఈజిప్టులో సీడ్ బాంబ్స్‌ను వాడేవారట. ఈ విషయాన్ని జపాన్‌కు చెందిన చరిత్రకారుడు, రైతు అయిన మసనోబు ఫుకుఒకా పసిగట్టి, మళ్లీ సీడ్ బాంబ్స్‌కు ప్రాచుర్యం లభించేలా చేశారు. వీటినే సీడ్ బాలింగ్ అనీ, సీడ్ గ్రెనేడ్స్ అనీ కూడా అంటున్నారు. వినడానికి, చూడటానికి వింతగా ఉండే ఈ సీడ్ బాంబ్స్ జనబాహుళ్యంలోకి సునాయాసంగా చొచ్చుకుపోతున్నాయి. వీటిని నాటేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు.
అసలు ఏమిటీ ఈ సీడ్ బాంబ్స్?
ఇదే విషయాన్ని ఫ్రెండ్స్ ఫర్ రివైవింగ్ అవర్ గ్రీన్ ఎర్త్ సంస్థ వ్యవస్థాపకుడు వికాస్ మహాజన్‌ను అడిగితే ఇలా చెప్పుకొచ్చారు. ‘సీడ్ బాంబ్స్ అనేవి చిన్నసైజు బంతుల్లా ఉంటాయి. మరోమాటలో చెప్పాలంటే లడ్డూల్లా ఉంటాయి. మట్టి, ఆవు పేడ మిశ్రమంతో వీటిని తయారు చేస్తారు. మూడొంతులు మట్టి, ఒక వంతు ఆవుపేడ కలిపి ముద్దగా తయారు చేసి, అందులో విత్తనాన్ని ఉంచుతారు. ఇదే సీడ్ బాంబ్’ అని వివరించారు వికాస్. ఆవుపేడ కలపడం వల్ల పురుగూ పుట్రా చేరదట.
సీడ్ బాంబ్ తయారు చేయడానికి ఏ విత్తనమైనా ఫరవాలేదు. అసలు మన వంటిల్లే సీడ్ బాంబ్స్ తయారీకి తొలి మెట్టు అంటారు వికాస్. ఆవాలు, మిరియాలు వంటి విత్తనాలతోనూ సీడ్ బాంబ్స్ తయారు చేయవచ్చంటారాయన. ‘అయితే మన నేలలో ఏం పండుతుందో చూసి, అలాంటి విత్తనాలనే ఎంచుకోవాలి. మహారాష్టల్రో యాపిల్స్ పండించమంటే అది జరిగే పనేనా? అని వికాస్ ప్రశ్నిస్తారు. విత్తనాలను ఎంచుకున్నాక వాటిని బాగా కడగాలి. ఆ తర్వాత వాటిని ఎండలో కాకుండా నీడ ఉన్న చోట ఎండబెట్టాలి. విత్తనంలో తేమ ఉండటం ముఖ్యం. ఎండలో ఎండబెడితే విత్తనంలో తేమ పూర్తిగా హరించుకుపోతుంది. అందువల్ల నీడలోనే ఎండబెట్టాలి. తరవాత వాటిని గాలి చొరబడని డబ్బాలో వేసి మూతబెట్టాలి. వర్షాకాలం వచ్చాక ఆ విత్తనాలతో సీడ్ బాంబ్స్ తయారు చేసి, నాటాలి. ఈ సీడ్ బాంబ్స్‌ను నేలపై కప్పు ఆకారంలో చిన్నపాటి గొయ్యి తీసి పాతాలి. అంటే సీడ్ బాంబ్ సగం నేలలో, సగం నేలపైన ఉండేలా పాతాలన్నమాట. వేప, మర్రి, రావి వంటి వృక్ష జాతులకు సంబంధించిన విత్తనాలను అడవుల్లో నాటుతూ పండ్లనిచ్చే విత్తనాలను ఇళ్లలోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ నాటడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని వికాస్ మహాజన్ చెప్పారు. సీడ్ బాంబ్స్ తయారు చేయడం, పంపిణీ చేయడం సులువు కావడంతో ఇప్పుడు వీటిపట్ల జనం మొగ్గు చూపుతున్నారు. సీడ్ బాంబ్స్ కానె్సప్ట్ మరింతగా జన బాహుళ్యంలోకి చొచ్చుకువెళ్లేందుకు తమ సంస్థ తరపున కృషి చేస్తున్నామని వికాస్ చెప్పారు.

సీడ్ బాంబులు నాటుతున్న ‘ఫ్రెండ్స్ ఫర్ రివైవింగ్ అవర్ గ్రీన్ ఎర్త్’ సభ్యులు