యువ

మెడికో సాహసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీర్ ఖాన్ సినిమా త్రీ ఇడియట్స్‌లో అందర్నీ ఆకట్టుకునే ఓ సన్నివేశం ఉంది. అదేమిటంటే- హీరోయిన్ కరీనా కపూర్ సోదరికి అర్థరాత్రి వేళ పురిటి నొప్పులు మొదలవుతాయి. జోరున వర్షం. అంబులెన్స్ సౌకర్యం ఉండదు. కరీనా డాక్టరే అయినా ఆ సమయంలో ఇంట్లో ఉండదు. ఈ విషయం తెలిసి, అమీర్ ఖాన్ స్వయంగా ఫోన్‌లో కరీనాను సంప్రదిస్తూ విజయవంతంగా డెలివరీ చేస్తాడు.
కట్ చేస్తే... ఇటీవల ఇదే సన్నివేశం నిజ జీవితంలో రిపీట్ అయింది. కాకపోతే ఈ సంఘటన జరిగింది అహ్మదాబాద్-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో. ఆ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. చెయిన్ లాగినా రైలు ఆగలేదు. దాంతో రైలులో ఎవరైనా డాక్టర్ ఉన్నారేమోనని టికెట్ కలెక్టర్, గార్డు కలసి రైలంతా వెదికారు. చివరకు ఓ డాక్టర్ దొరికాడు. అతని పేరు విపిన్ ఖాడ్సే. నిజానికి అతను ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థి. మొదట డెలివరీ చేసేందుకు విపిన్ అంగీకరించలేదు. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ లేని తాను సాహసానికి పూనుకుంటే ప్రమాదమని భావించడం వల్లనే అతను వెనక్కి తగ్గాడు. కానీ ఆ రైలులో మరో డాక్టర్ లేకపోవడంతో ఇక తప్పదనుకుని రంగంలోకి దిగాడు. అయితే ముందుగా అతను తాను చదువుతున్న నాగపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీనియర్లను సంప్రదించాడు. షీఖా మాలిక్ అనే సీనియర్ గైనకాలజిస్ట్ అందుబాట్లోకి రావడంతో వాట్సాప్ సాయంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతూ విపిన్ డెలివరీ చేశాడు. అయితే తల్లి గర్భంలోంచి ముందుగా తలకు బదులు చేయి బయటకు రావడంతో తాను కంగారు పడ్డాననీ, అప్పుడు షీఖా సలహా మేరకు డెలివరీని విజయవంతంగా పూర్తి చేశాననీ విపిన్ చెప్పాడు. రైలు నాగపూర్ చేరుకున్న వెంటనే అప్పటికే స్టేషన్‌కు చేరుకున్న వైద్య బృందం ఆమెకు వైద్య సహాయం అందజేయడంతో కథ సుఖాంతమైంది.

చిత్రం..మెడికో విపిన్ ఖాడ్సే. రైలులో పుట్టిన చిన్నారితో తల్లి