యువ

ఆమె దారి రాదారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకలితో అలమటించేవారికి అన్నంపెట్టే అన్నదాతల్ని చూశాం.
ఇల్లు లేకపోతే ఇళ్లు కట్టించే దానగుణశీలురినీ చూశాం.
అంతేగానీ...రోడ్డు లేకపోతే స్వయంగా రోడ్డు వేసేవారిని ఎక్కడైనా చూశామా?
చూడాలనుకుంటే మణిపూర్ వెళ్లొచ్చు. ఎవరా వ్యక్తి? ఏమా రోడ్డు కథ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం ఈ కథనం చదవాల్సిందే.
మణిపూర్ రాష్ట్రంలో ఉఖ్రుల్ అనే జిల్లా ఉంది. ఈ జిల్లా కేంద్రానికి చెందిన పంఖులా షైజా అనే 24 ఏళ్ల అమ్మాయి చాలాకాలం చదువుల నిమిత్తం ఊరికి దూరంగా ఉంది. డిల్లీ వర్శిటీలో ఎంఏ చేసి, లండన్‌లో ఆంత్రోపాలజీలో పిహెచ్‌డీ చేయాలని నిర్ణయించుకుంది. వీసా కూడా వచ్చేసింది. లండన్ వెళ్లడానికి మరో రెండు నెలల గడువు ఉండటంతో సొంత ఊర్లో కొన్ని రోజులు గడిపేందుకు ఉఖ్రుల్ వచ్చింది. ఉఖ్రుల్‌లో బస్సు దిగి రోడ్డు మీద నడుస్తుంటే...నడక సాగడం లేదు. కంకర లేచిపోయి, గాలిలోకి దుమ్మూ దుమారం పైకి లేస్తుంటే అడుగు ముందుకేయడం సాధ్యం కాలేదు. ‘రోడ్డు పరిస్థితిని చూసి, దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆ రోడ్డు మీద అరగంటసేపు నడిస్తే జ్వరమొచ్చి మంచం పట్టడం ఖాయం. వర్షాకాలంలో రోడ్డుపై ఉన్న గుంతలన్నీ నీటిపై నిండిపోయి, ప్రయాణం నరకాన్ని తలపిస్తుంది. ఉఖ్రుల్ జిల్లా కేంద్రంలో నివసిస్తున్న ప్రజలంతా ఈ రోడ్డు వల్ల రోగాల బారిన పడినవారే’నంటూ షైజా చెప్పుకొచ్చింది.
ఆ రోజు ఇంటికి చేరాక కూడా షైజాను రోడ్డు తాలూకు చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఆమె ఉఖ్రుల్ రోడ్డు గురించి ఆరా తీస్తే ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రోడ్డును 1977-79 మధ్యకాలంలో వేశారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకున్నవారే లేరు. పైగా ఉఖ్రుల్ జిల్లాలో వర్షపాతం ఎక్కువ. రోడ్డు దెబ్బతినడానికి భారీ వర్షాలు కూడా కారణం. గత రెండు దశాబ్దాలుగా ఆ రోడ్డును పట్టించుకున్న వారే లేరు. ఏళ్లూ పూళ్లూ గడిచినా మరమ్మతుల జాడ లేదు. సుమారు 6.4 కిలోమీటర్ల పొడవునా రోడ్డు అధ్వాన స్థితికి చేరింది. రోజూ కొన్ని లక్షల మంది ప్రయాణించే రోడ్డుపై పాలకవర్గాల నిర్లక్ష్యం ఆమెను ఆశ్చర్యంలో పడేసింది. ఈలోగా ఆమెను దినపత్రికలో ఓ వార్త ఆకట్టుకుంది. అస్సాం, మణిపూర్ రాష్ట్రాలను కలిపే టామెన్‌లాంగ్ జిల్లాలోని ఓ రోడ్డును గ్రామస్థులే నిర్మించుకున్నారన్నది ఆ వార్త సారాంశం. ఇది చదివాక ఆమెలో ఆలోచన మొదలైంది. అధికార వర్గాల చుట్టూ తిరిగేకన్నా, రోడ్డు మరమ్మతులను తానే ఎందుకు చేపట్టకూడదు? ఇలా అనుకున్నాక ఆమె రోడ్డు వేసేందుకు నిధులకోసం క్రౌడ్ ఫండింగ్‌ను ఆశ్రయించింది. ఆరున్నర కిలోమీటర్ల రోడ్డు నిర్మించేందుకు రెండు కోట్లు ఖర్చవుతాయి. రోడ్డు నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అద్దెపై ఇప్పించమని మణిపూర్ రోడ్డు కన్‌స్ట్రక్షన్ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. రోడ్డు నిర్మాణ పనుల్ని పర్యవేక్షించేందుకు స్థానికంగా వలంటీర్లను నియమించింది. తాను లండన్ వెళ్లేలోగా పనులు పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉందామె. షైజా పట్టుదలకు ‘యువ’ జోహార్లు అర్పిస్తోంది. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆశిస్తోంది.

చిత్రాలు....మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లా కేంద్రంలోని రోడ్డు ఇదే. పంఖులా షైజా