యువ

సైకిల్ తొక్కింది.. నెదర్లాండ్ పిలిచింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైక్లింగ్‌పై విస్తృత ప్రచారం మెరుగైన ఆరోగ్యానికి అదేమార్గం
ఇంజనీరింగ్ యువతి సరికొత్త ప్రయోగం బైసైకిల్ మేయర్ ఫర్ బరోడాగా ఖ్యాతి

బరోడా అమ్మాయికి ఓ పిలుపు వచ్చింది...
నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌డామ్‌లో జరిగే ఓ అంతర్జాతీయ సమావేశానికి రమ్మనమని... ఇంతకీ ఆ అపూర్వ అవకాశం ఆమెకు ఎందుకు వచ్చింది? అదే విశేషం.
***
సైకిల్ తొక్కడం మంచిదని ఆమె నమ్మడం... ఆచరించడం, పదిమంది చేత ఆ పని చేయించడం ఆమెకు ఆ అవకాశాన్ని తెచ్చిపెట్టింది.ఓ కష్టం నేర్పిన పాఠం ఆమెకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆమె ఓ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోంది... ఆమె పేరు నిఖిత లల్వాని. బరోడా ఆమె స్వస్థలం. అక్కడే చదువుకుంది. అక్కడే ఉద్యోగం. మూడేళ్ల క్రితం ఓ చిక్కువచ్చిపడింది. బరోడాలో వారుండే ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించారు. ఇక అప్పటినుంచి కష్టాలు మొదలు. ట్రాఫిక్‌జామ్‌లు సరేసరి. టైమ్‌కు ఆఫీసుకు చేరుకోవడం గగనమే అయ్యేది. ఆటోరిక్షాలు, స్కూటీ, చివరకు కార్లను నమ్ముకున్నా ప్రయోజనం లేకపోయింది. ఆమె జీవితంలో అదో పెద్ద సమస్యగా మారింది. 2014లో ఓ సారి జర్మనీ వెళ్లింది. అక్కడి ప్రజల్లో ఎక్కువమంది సైకిల్‌ను విస్తృతంగా వాడటాన్ని గమనించింది. మనమూ అలా చేస్తే తప్పేంటి అనుకుంది. ఇండియా వచ్చాక సైకిల్ తొక్కడం మొదలెట్టింది. సైకిల్‌ను నమ్ముకున్నాక ఆఫీసుకు వెళ్లడం చాలా సులువైంది. పైగా ఆరోగ్యాన్ని ప్రసాదించే ఓ చక్కటి వ్యాయామంగా సైక్లింగ్ మారిపోయింది. ఆమెను చూసి మరో ఆరుగురు.. ఆ తరువాత మరో పదిమంది ఇలా సైకిల్‌ను వినియోగించడం మొదలెట్టారు. కాలుష్యం వెదజల్లని ప్రయాణ సాధనం సైకిల్ అని ప్రచారం చేయడం మొదలెట్టింది. 2030 నాటికి జనాభాలో మూడోవంతుమంది సైకిల్‌ను వినియోగించాలన్న లక్ష్యంతో ఆమె ఓ సంస్థను ప్రారంభించింది. దాని పేరు ‘సైక్లింగ్ సిటీస్’. ఆమె ఆలోచనకు చక్కటి స్పందన వచ్చింది. తరచూ సైకిల్ పోటీలు నిర్వహించేది. ఇందులో రకరకాల విభాగాల్లో పోటీ ఉండేది. పెడల్ పవర్, కమ్యూటి, సైక్లింగ్ మిత్ బస్టర్ ఇలా అన్నమాట. ఆయా విభాగాలోల గేమ్స్ ఉండేవి. తను సైకిల్ తొక్కాలనుకున్నప్పుడు, సైక్లింగ్‌ను ప్రోత్సహించాలనుకున్నప్పుడు ఆషామాషీగా ఆమె రంగంలోకి దిగలేదు. శారీరక, మానసిక ప్రభావం, లాభనష్టాలపై పలు సర్వేలు చేయించింది. ఎంతో సమాచారాన్ని సేకరించింది. ఆ తరువాత కార్యరంగంలోకి దిగింది. అద్దెకు సైకిళ్లు, హెల్మెట్‌లు అందుబాటులోకి తెచ్చింది. సైకిల్ తొక్కాలనుకునేవారికి గైడెన్స్ ఇచ్చే సౌకర్యమూ ఏర్పాటు చేసింది. చివరకు బరోడాలో ఆమె ఓ సెలబ్రిటీగా మారిపోయింది.
బైసైకిల్ మేయర్ ఫర్ బరోడా
నెదర్లాండ్ కేంద్రంగా సైక్లింగ్‌ను ఉద్యమంగా నిర్వహిస్తున్న సంస్థ ‘సైకిల్ స్పేస్ ఆర్గనైజేషన్’. ఓ పట్టణం లేదా ఓ నగరం, ఓ దేశంలో సైక్లింగ్‌పై విస్తృత ప్రచారం చేస్తున్న వ్యక్తులకు ఆ సంస్థ ఇచ్చే అవార్డు బైసైకిల్ మేయర్. అలా బరోడాలో సైక్లింగ్‌ను ఆచరిస్తూ ప్రోత్సహిస్తున్న నిఖిత లల్వానికి ఆ సంస్థ బైసైకిల్ మేయర్ ఫర్ బరోడాగా అవార్డును ప్రకటించింది. అలా ప్రపంచవ్యాప్తంగా ఎంపికైనవారితో ఈ ఏడాది జూన్ 10, 11 తేదీల్లో అమెస్టర్‌డామ్‌లోని వెలోసిటీలో ఓ సదస్సు నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమానికి హాజరుకావలసిందిగా నిఖిత లల్వానీకి ఆహ్వానం అందింది. అయితే అక్కడికి వెళ్లడానికి ఆమెకు దాదాపు 3వేల యూరోల వరకు ఖర్చు అవుతుంది. ఆ మొత్తం తనవద్ద లేకపోవడంతో సహాయం కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి సదస్సు జరగడం ఇదే తొలిసారి. బరోడా, ఢిల్లీలోని రోహిణి ప్రాంతాల్లో ఇప్పటికే ఆమె సైకిల్ పోటీలు నిర్వహించింది. బరోడా మేయర్ భరత్ దంగార్ కూడా ఆమెకు అండగా నిలిచారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని బరోడాలో చాలామంది సైకిల్‌పై ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు.