యువ

కోహ్లీకి ‘పాఠం’ చెబుతాడట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటలో గెలుపు ఓటములు సహజమే. అయితే, ప్రతిష్ఠాత్మక పోటీలో మొదటే చేతులెత్తేసి.. చెత్తగా ఆడి చిత్తుగా ఓడిపోతే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. కొద్దిరోజుల క్రితం చాంపియన్‌షిప్ క్రికెట్ ఫైనల్ పోటీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో మన ‘కోహ్లీ సేన’ ఘోర పరాజయం చవిచూశాక సాధారణ జనం సైతం ఆగ్రహంతో రగిలిపోయారు. ‘తప్పు వెనుక తప్పు చేస్తూ కప్పు చేజార్చుకున్న’ మన క్రికెటర్ల తీరు చూసి దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగాయి. మన క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ వల్లే దారుణ ఓటమి ఎదురైందని, అతనికి ‘పాఠాలు’ నేర్పాల్సిన తరుణం ఆసన్నమైందని నాసిక్ (మహారాష్ట్ర)కు చెందిన యువ ఇంజనీర్ ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి వినూత్న రీతిలో తన నిరసన తెలిపాడు. ‘దురహంకారి’ అయిన కోహ్లీని ‘దారిలో’ పెట్టడం అత్యంత అవసరం అని ఆయన వాదిస్తున్నాడు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన బ్రహ్మచారి (30) భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేసి సంచలనం సృష్టించాడు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఈయన మన ‘క్రికెట్ రాజకీయాల’ను సామాజిక మీడియాలో తూర్పారబట్టాడు. నిరసన తెలిపేందుకు, మన క్రికెట్ జట్టు దురవస్థను చాటిచెప్పేందుకు ‘కోచ్’ పోస్టుకు దరఖాస్తు చేశానంటున్నాడు. ‘కోచ్’గా తనను నియమిస్తే జట్టును పూర్తిగా ప్రక్షాళన చేస్తానని భరోసా ఇస్తున్నాడు.
‘కోచ్’ పోస్టు నుంచి అనిల్ కుంబ్లేకు ఉద్వాసన పలకడం వెనుక కోహ్లీ హస్తం ఉందని బ్రహ్మచారి ఆరోపిస్తున్నాడు. ‘కోచ్’ పోస్టు కోసం ‘్భరత క్రికెట్ కంట్రోల్ బోర్డు’ (బిసిసిఐ)కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడమే గాక, కుంబ్లే అంతటి గొప్ప ఆటగాడు కోహ్లీకి ‘కోచ్’గా ఉండాల్సిన అవసరం లేదంటున్నాడు. ‘కోచ్’ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ బిసిసిఐ ఇచ్చిన ప్రకటనను తాను చూశానని, అనుభవజ్ఞులను ఎంపిక చేసినా వారిని కోహ్లీ పనిచేయనివ్వడని బ్రహ్మచారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. క్రికెట్‌లో మెళకువలు తెలియక పోయినా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తే, కోహ్లీకి తగిన ‘పాఠాలు’ చెబుతానంటున్నాడు. ‘దురహంకారి’ అయిన కోహ్లీని దారిలో పెట్టడానికి తాను సరిపోతానని, అందుకు క్రికెట్ దిగ్గజాలు ఎవరూ రానక్కర్లేదని అంటున్నాడు. బ్రహ్మచారి దరఖాస్తును బిసిసిఐ బుట్టదాఖలు చేస్తుందని తెలిసినప్పటికీ, ఆయన చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో మద్దతు వెల్లువెత్తుతోంది. కుంబ్లే పట్ల బిసిసిఐ, కోహ్లీ వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని, దీనిపై క్రీడాభిమానులంతా నిరసన తెలపాలని బ్రహ్మచారి పిలుపునిచ్చాడు. మరోవైపు ‘కోచ్’ పోస్టుకు మెకానికల్ ఇంజనీర్ దరఖాస్తు చేయడం పట్ల బిసిసిఐ నేతలు విస్మయం వ్యక్తం చేశారట! పాఠశాల స్థాయిలో తాను క్రికెట్ ఆడానని, ఇంతకు మించి తనకు అనుభవం లేదని, కోహ్లీకి మాత్రం కుంబ్లే వంటి కోచ్‌లు ఎందుకంటున్నాడు. క్రికెట్ దిగ్గజాల్లో ఎవరిని కోచ్‌గా నియమించినా కోహ్లీ వల్ల వారికి ‘చేదు అనుభవాలు’ తప్పవని బ్రహ్మచారి హెచ్చరిస్తున్నాడు. కాగా, మాజీ క్రికెటర్లు వీరేందర్ సహ్వాగ్, రిచర్డ్ పైబస్, లాల్‌చంద్ రాజ్‌పుత్, మెక్‌డెర్మాట్, రవిశాస్ర్తీ వంటి వారు కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసినా, ఎవరికీ రాని ప్రచారం ఇపుడు బ్రహ్మచారికి రావడం చర్చనీయాంశమైంది.

చిత్రం.. ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి