యువ

జర్మనీలో మన జెండా రెపరెపలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏ రంగంలోనైనా వైవిధ్యం చూపితేనే గుర్తింపు సాధ్యం.. కష్టం అనిపించినా ఇష్టపడిన దాంట్లో కఠోర శ్రమ చేస్తే అసాధ్యమన్నది లేనే లేదు..’ అంటోంది బెంగళూరుకు చెందిన పదో తరగతి విద్యార్థిని వినయ శేషన్. ఇటీవల జర్మనీలో జరిగిన ‘డ్యాన్స్ వరల్డ్ కప్- 2017’ పోటీల్లో మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించన ఆమె ఏకంగా మూడు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. జర్మనీలో అంతర్జాతీయ వేదికపై భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించిన వినయ నృత్యంలో ఇప్పటికే అనేక అవార్డులు సాధించింది. ‘డ్యాన్స్ వరల్డ్ కప్’ పోటీల్లో 43 దేశాల నుంచి సుమారు పదివేల మంది పాల్గొనగా, తన నృత్య విన్యాసాలతో ఆమె ఆహూతులను ఆశ్చర్యచకితులను చేసింది. వివిధ వయసుల బాలలు, యువతీ యువకులు పాల్గొన్న ప్రపంచ స్థాయి నృత్య పోటీల్లో సత్తాచాటిన ఆమె గత ఏడాది ‘డ్యాన్స్ వరల్డ్ కప్’ పోటీలోనూ పలు పతకాలను సాధించింది. బెంగళూరులోని ‘ఇన్‌వెంటర్ అకాడమీ’లో తర్ఫీదు పొందుతూ నృత్యంలో ఎన్నో మెళకువలను తెలుసుకున్న ఆమె వేదికపై నర్తిస్తే చాలు... అందరి కళ్లూ ఆమె పాదాల కదలికలపైనే దృష్టిసారిస్తాయి. నీలిరంగు దుస్తులు ధరించి నృత్య విన్యాసం చేయడం అంటే తనకెంతో ఇష్టమని చెబుతున్న వినయ తాజాగా జరిగిన ప్రపంచ స్థాయి పోటీలో డ్యూయట్ కేటగిరీ, హిప్-హప్ గ్రూప్, హిప్-హప్ సోలో కేటగిరీలో బంగారు పతకాలు సాధించింది.
నృత్యంలోనే కాదు, ఫుట్‌బాల్ క్రీడాకారిణిగానూ వినయ సంచలనాలు సృష్టిస్తోంది. పగ్వారాలో జరిగిన మహిళల సీనియర్ ఫుట్‌బాల్ పోటీల్లోను, బెంగళూరులో జరిగిన అండర్-19 జాతీయ మహిళల ఫుట్‌బాల్ పోటీల్లోను పాల్గొంది.
పాఠశాలలో చేరిన నాటి నుంచే ఆమె నృత్యం, ఫుట్‌బాల్‌పై సమాన ఆసక్తి పెంచుకుంది. ఫుట్‌బాల్‌పై నిలబడి నృత్య విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకునేది. ఆ తర్వాత ఆమె నృత్యం, సంగీతంలో రాణించేందుకు ఓ శిక్షణ సంస్థలో చేరింది. లార్డ్ విజయ్ డ్యాన్స్ స్కూల్‌లో వారం రోజుల పాటు జరిగిన నృత్య శిక్షణ శిబిరానికి ఎంపిక కావడం తన జీవితంలో ఊహించని మలుపు అని వినయ చెబుతోంది. ఆ శిక్షణ శిబిరంలో పాల్గొన్న అనంతరం 2015లో జరిగిన ‘డ్యాన్స్ వరల్డ్ కప్’ పోటీల్లో మన దేశం తరఫున పాల్గొని రజత పతకాన్ని సాధించింది. నృత్యరంగంలో కృషిచేస్తూనే తబలా, గిటార్, పియానోలపై పట్టుసాధించి సంగీత పరంగానూ తన నైపుణ్యాన్ని చాటుకుంటోంది.