యువ

‘లీడర్‌షిప్’తో లక్ష్యానికి లంగరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వమే లక్ష్యంగా మహిళల నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందని జి-20 (గ్రూప్ ఆఫ్ ట్వంటీ) మహిళల బృందం అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న 20 దేశాలకు చెందిన మహిళా ప్రతినిధులతో ఈ బృందం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తతరానికి చెందిన మహిళలు నాయకత్వం వహించేలా చూడటం, పనిచేసే వర్గంలో మహిళల భాగస్వామ్యం పెరిగేలా చూడటం ఈ గ్రూప్ లక్ష్యం. ఈ జి-20 మహిళల బృందంలో వివిధ దేశాలకు చెందిన మహిళాప్రతినిధులు ఉంటారు. ఆ బృందంలో ఇండియా తరపున ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్థిని అనన్య పరేఖ్ సారథ్యం వహిస్తోంది. ఈ జి-20 మహిళల సదస్సు లక్ష్యాలు, ఈ బృందంలో అవకాశం పొందడానికి నిర్దేశించిన విధానాలు, జి-20 ప్రాధాన్యం ఏమిటో అనన్య వివరించింది.
ఇలా ఎంపికయ్యా..
‘2009 నుంచి గర్ల్స్ 20 (జి20) సదస్సులు నిర్వహించడం మొదలైంది. ఏటా 300 నుంచి 400 మంది అవకాశం కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఈ ఏడాది వచ్చిన దరఖాస్తుదారుల్లో నాతోపాటు మరొకరికి స్కైప్‌లో ఇంటర్వ్యూకు అవకాశం వచ్చింది. చివరకు నేను ఎంపికయ్యా’ అని అనన్య చెప్పింది. కెనడా ప్రభుత్వ అనుమతితో ఏర్పడిన లాభాపేక్షలేని సంస్థ ఇది. శ్రామిక, ఉద్యోగవర్గంలో మహిళలను ప్రోత్సహించేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ప్రధానమైన జి-20 దేశాల సదస్సు సందర్భంగా ఈ గ్రూప్ ఒక నివేదికను సమర్పిస్తుంది. మహిళలకు ఉద్యోగావకాశాలు ఎలా పెంచవచ్చో కొన్ని ప్రతిపాదనలను చేస్తుంది. దీనిని గర్ల్స్ గ్రూప్ 20 అనుసరిస్తుంది. ఈ నివేదిక రూపొందించే ముందు జి-20 దేశాల నుంచి మహిళా ప్రతినిధులు ఆయా దేశాలకు సంబంధించిన మహిళా ఉద్యోగుల సంఖ్య, అవకాశాలపై గణాంకాలు, సమాచారం ఆధారంగా కొన్ని ప్రతిపాదనలు చేస్తారు. ఈసారి సదస్సులో వలసలు, డిజిటల్ ఎకానమీ, వాతావరణ మార్పులు అనే అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. తమ తమ దేశాల్లో మహిళలకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాల అమలుకు తగిన శిక్షణను ఈ ప్రతినిధులకు ఇస్తారు.
ఈసారి ఇలా..
వివిధ దేశాలకు చెందిన 22 మంది యువతులను ఈ సదస్సుకు ఎంపికయ్యారు. వ్యూహాత్మక ప్రణాళిక, నాయకత్వ అభివృద్ధి వంటి అంశాలపై చర్చ జరిగింది. పాకిస్తాన్ సాహస యువతి, నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ తండ్రి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. జి-20 దేశాలు 2025 నాటికి 10 కోట్లమంది మహిళలకు ఎలా ఉద్యోగావకాశాలు సృష్టిస్తారన్న అంశంపై వక్తల సూచలను క్రోడీకరించారు. ఈ సదస్సు ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశాలపై చర్చల సరళిని దగ్గరగా పరిశీలించి ఎన్నో విషయాలను నేర్చుకున్నానంటోంది అనన్య. నెగోషియేషన్స్ అనేది ఒక కళ అని అర్థమైందని చెబుతున్న అనన్య ఈ సదస్సు వల్ల తనలో ఆత్మవిశ్వాసం రెట్టింపైందని పేర్కొంది. విభిన్న సంస్కృతులు, స్థాయిలకు చెందిన విభిన్న దేశాల నుంచి వచ్చిన యువతులు ఒకే లక్ష్యంతో కలసి పనిచేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె చెప్పింది. మహిళల నాయకత్వ దిశగా అడుగులు వేసేందుకు తాను ‘ది ఇన్నర్ గాడ్డెస్ అకాడమీ’ పేరుతో ఒక స్టార్టప్ కంపెనీ పెట్టానని, రెండేళ్లుగా అది పనిచేస్తోందని వివరించింది. అయితే ఈ సదస్సులో పాల్గొని వచ్చిన తరువాత తన దృక్పథంలో స్పష్టత వచ్చిందని, తన సంస్థను ఆ దిశగా నడుపుతానని చెపుతోంది. ఈ సదస్సులో తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిన వారు ఉన్నారని, దీర్ఘకాలంపాటు తన సంస్థను నిర్వహించే విశ్వాసం కలిగిందని అంటోంది. మహిళల అభివృద్ధికి బాటలు వేసే వివిధ స్థాయిల్లో మహిళలు నాయకత్వం వహిస్తే అనుకున్నది త్వరితగతిన సాధించే అవకాశం ఉందని ఆమె అంటోంది.

చిత్రం.. అనన్య