యువ

టాలెంట్ హంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువతులకు నిజంగా ఓ అద్భుత అవకాశం.. జాతీయ స్థాయిలో నెంబర్ వన్‌గా నిలిచిన ఐఐటిల్లో అడ్మిషన్ పొందాలనుకునే అమ్మాయిల కలలు సాకారం కాబోతున్నాయి.. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటిల్లో అడ్మిషన్ల కోసం ఏటా నిర్వహించే ‘జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్’ (‘జీ’)లో ప్రస్తుతం అబ్బాయిల హవా కొనసాగుతోంది. ఈ పరిస్థితిని మార్చాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ (హెచ్‌ఆర్‌డి) ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఐఐటిల్లో ప్రవేశం పొందుతున్న బాలికల నిష్పత్తి కేవలం ఎనిమిది శాతం మాత్రమే. 2020-21 విద్యా సంవత్సరానికి దీనిని ఇరవై శాతం మేరకు పెంచాలని హెచ్‌ఆర్‌డి నిర్ణయించింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికల్లో ప్రతిభావంతులను గుర్తించే పనిని ఐఐటిలకే అప్పగించి, ప్రవేశపరీక్షకు తగిన తర్ఫీదు ఇవ్వాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ నాలుగంచెల ప్రణాళికను ఖరారు చేసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికలకు, వారి తల్లిదండ్రులకు ఐఐటి ప్రొఫెసర్లు స్వయంగా కౌనె్సలింగ్ ఇస్తారు. ప్రతిభావంతులైన బాలికలను ఐఐటి ప్రాంగణాలకు రప్పించి అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పిస్తారు. నిపుణులైన ప్రొఫెసర్ల పర్యవేక్షణలో శిక్షణ తరగతులను నిర్వహిస్తారు. ఐఐటి ప్రవేశాల్లో యువతులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించాక నిర్దిష్ట ప్రణాళికను అమలు చేసి, ఐఐటిల్లో యువతుల భాగస్వామ్యాన్ని పెంచాలని హెచ్‌ఆర్‌డి నిర్ణయించింది. ప్రతిభావంతులైన గ్రామీణ యువతులను గుర్తించడమే కాదు, ప్రవేశ పరీక్షకు అవసరమైన సహాయ సహకారాలు అందజేయాలని, ఇందుకు ఐఐటి అధ్యాపకులు దిశానిర్దేశం చేయాలని హెచ్‌ఆర్‌డి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఐటిలకు కొద్దిరోజుల క్రితం ఆదేశాలు పంపారు. ఇంజనీరింగ్‌ను తగిన కెరీర్‌గా ఎంచుకునేందుకు యువతులను ప్రోత్సహించాలని, ప్రవేశపరీక్షకు నియమబద్ధంగా శిక్షణ తరగతులు నిర్వహించాలని హెచ్‌ఆర్‌డి సూచించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రైవేటు కోచింగ్ సంస్థలు ఐఐటి ప్రవేశపరీక్షకు శిక్షణ ఇస్తున్నాయి. వీటిలో శిక్షణ పొందడం ఎంతో ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో గ్రామీణ యువతులు ఐఐటిల్లో ప్రవేశం పొందలేకపోతున్నారు. చాలా కోచింగ్ సెంటర్లలో ఏడవ తరగతి నుంచే ఐఐటి ఫౌండేషన్ కోర్సులను నిర్వహిస్తున్నారు. అయితే, ఎనిమిదో తరగతి చదివే అమ్మాయిల్లో ప్రతిభావంతులను గుర్తించి శిక్షణ ఇవ్వాలని హెచ్‌ఆర్‌డి సంకల్పించింది. ఈ శిక్షణ తరగతులకు ఐఐటి ప్రొఫెసర్లు స్వయంగా నేతృత్వం వహిస్తారు. ‘ప్రొఫెసర్ పర్యవేక్షణలో శిక్షణ’(పిఎఎల్) పేరిట ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. హైస్కూల్ స్థాయిలో బాలికలు సైన్స్, గణితం సబ్జెక్టుల్లో ముందంజలో ఉండేలా తర్ఫీదు ఇస్తారు. ఇంటర్నెట్, డిటిహెచ్ సౌకర్యం ఉన్న పాఠశాలల్లో- ముందుగానే రికార్డు చేసిన వీడియో పాఠాలను అందుబాటులో ఉంచుతారు. గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో ఐఐటి ప్రొఫెసర్లు ఈ వీడియో పాఠాలను రూపొందిస్తారు. సైన్స్, గణితం పట్ల బాలికల్లో ఆసక్తిని రేకెత్తించేందుకు ఎంపిక చేసిన కొన్ని ఐఐటిల్లో వీడియో పాఠాలకు రూపకల్పన చేస్తారు. ఈ విధానం ద్వారా ఐఐటిలో చేరాలనుకునే యువతుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుందని ఖరగ్‌పూర్ ఐఐటి ప్రొఫెసర్లు చెబుతున్నారు. సరైన అవగాహన, తగిన శిక్షణ లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంత బాలికలు ఐఐటిల వంటి ప్రసిద్ధ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందలేకపోతున్నారని అధ్యాపకులు గుర్తు చేస్తున్నారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చాక ‘ఐఐటి-జీ’ పట్ల అమ్మాయిల్లో ఆసక్తి పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్లను ఆశ్రయించడం కన్నా హెచ్‌ఆర్‌డి కల్పిస్తున్న ఈ అవకాశాన్ని మారుమూల ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. గ్రామీణ, పేదవర్గాల బాలికలకు హెచ్‌ఆర్‌డి ప్రకటించిన పథకం ఓ వరం లాంటిదని చెబుతున్నారు. ఇంజనీరింగ్ విద్య పట్ల ఇప్పటికీ పల్లెప్రాంతాల్లో కొన్ని అపోహలున్నాయని ఐఐటి ప్రొఫెసర్లు అంటున్నారు. ఇంజనీరింగ్ కోర్సులంటే యువకుల కోసమేనని, ఇంగ్లీష్ భాషపై పట్టులేని వారు ఈ కోర్సులకు పనికిరారని చాలామంది భావిస్తుంటారని వారు గుర్తు చేస్తున్నారు. ఈ అపోహలు నిజం కాదని నిరూపించేందుకు ఐఐటి ప్రవేశాల్లో యువతుల సంఖ్యను పెంచాలని హెచ్‌ఆర్‌డి నిర్ణయించిందని వారు తెలిపారు. అమ్మాయిల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఇది అరుదైన కార్యక్రమమని వారు అభివర్ణిస్తున్నారు. *