యువ

‘వీడియోగేమ్’ శ్రుతిమించితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నపిల్లాడేం కాదు.. అయినా వీడియోగేమ్‌లంటే విపరీతమైన మోజు.. ఇంజనీరింగ్ చదువుతున్న ఆ కుర్రాడు వీడియోగేమ్ కొనివ్వలేదని తండ్రిపై అలిగాడు.. తండ్రి కోప్పడ్డాడని భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. హైదరాబాద్ నగర శివారులో జరిగిన ఈ విషాద ఘటన - క్షణికావేశంలో జరిగే అనర్థాలకు నిదర్శనం..
***
సరదాకో, కాలక్షేపానికో కుర్రకారు వీడియోగేమ్‌లతో గడపడం తప్పుకాదు.. కానీ- ఆ అలవాటు శ్రుతిమించిపోయి ఓ వ్యసనంలా మారితే యువత ఆరోగ్యానికీ, చదువుకు చేటు తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ వీడియోగేమ్‌లకు బానిసలైతే మెదడుకు కీడు తప్పదని కెనడాకు చెందిన పరిశోధకులు తాజా అధ్యయనంలో తేల్చిచెప్పారు. అదే పనిగా వీడియోగేమ్‌లతో మమేకం అయితే మెదడులోని ముదురురంగు కణజాలం బలహీనపడుతుందని మాంట్రియల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు హెచ్చరించారు. మెదడులోని హిప్పోకాంపస్‌లోని కణజాలం క్షీణించడం వల్ల అల్జీమర్స్, కుంగుబాటు వంటి మానసిక వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉంది. అధ్యయనం సందర్భంగా పలురకాల వీడియో గేమ్‌లు ఆడిన సుమారు వందమంది శారీరక, మానసిక పరిస్థితులను శాస్తవ్రేత్తలు క్షుణ్ణంగా విశే్లషించారు. జ్ఞాపకాలను గుర్తు పెట్టుకునే విధులను మెదడులోని హిప్పోకాంపస్ అనే భాగం నిర్వహిస్తుంది. వీడియోగేమ్‌ల ఒత్తిడితో ఈ భాగంలోని కణజాలం క్రమంగా క్షీణించడం మొదలవుతుంది. దీనివల్ల మతిమరపు, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు. వేళకు తినడం, మంచినీరు తాగడం వంటి పనులను కొందరి మెదడులో ‘స్ట్రయేటం’ అనే నిర్మాణం ప్రేరేపిస్తుంది. వీడియోగేమ్‌లకు అలవాటుపడ్డ వారిలో దాదాపు 85 శాతం మంది హిప్పోకాంపస్‌పై కాకుండా ‘స్ట్రయేటం’పై ఆధారపడుతున్నారట! కణజాలం క్షీణించడంతో హిప్పోకాంపస్ సక్రమంగా విధులను నిర్వహించలేకపోతోందని, దానికి ప్రత్యామ్నాయంగా ‘స్ట్రయేటం’ పనిచేస్తోందని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. ఈ పరిణామాలు మెదడులో అవాంఛనీయ పరిస్థితులకు దారితీస్తున్నాయి. వీడియోగేమ్‌లు ఆడని వారిలో కంటే- వాటికి దాసోహమైపోయిన వారిలోనే మెదడుకు సంబంధించి అనారోగ్యకర పరిస్థితులు నెలకొంటున్నాయని పరిశోధకులు తేల్చారు.