యువ

మార్కెటింగ్‌లో మహరాణులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీలకమైన మార్కెటింగ్ రంగంలో అతివలకు అగ్రతాంబూలం ఇస్తూ, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు ‘టాటా గ్రూపు’ వంటి పారిశ్రామిక దిగ్గజాలు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. సుమారు 104 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్న టాటా గ్రూపులో ఇప్పటికే ‘చీఫ్ మార్కెటింగ్ మేనేజర్లు’ (సిఎంఓ)గా పదిమంది మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉక్కు నుంచి సాఫ్ట్‌వేర్ వరకూ విస్తరించిన పలు విభాగాల్లో మార్కెటింగ్ బాధ్యతలను మహిళలకు అప్పగించారు. టైటన్, ట్రెంట్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, టటా కెమికల్స్, టాటా క్యాపిటల్, టాటా ట్రస్ట్స్, టాటా కమ్యూనికేషన్ వంటి పలు కంపెనీలకు దేశవ్యాప్తంగా సుమారు 650 మంది వినియోగదారులు ఉన్నారు. వీరిని ప్రభావితం చేసి తమ ఉత్పత్తులకు డిమాండ్ పెంచేలా మార్కెటింగ్ బాధ్యతలను నిపుణులైన మహిళలకు ‘టాటా గ్రూపు’ అప్పగించింది. మన దేశంలో మరే ఇతర పారిశ్రామిక సంస్థలోనూ లేని విధంగా సిఎంఓలుగా అతివలను నియమించాలని ‘టాటా’ యాజమాన్యం నిర్ణయించింది.
సహనం, ఓర్పుకు నిదర్శనమైన మహిళలను మార్కెటింగ్ రంగంలో నియమిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చని టాటా గ్రూపు ఇప్పటికే నిరూపించింది. వినియోగదారుల అవసరాలు, మార్కెటింగ్ మెళకువలు వంటి అంశాల్లో పురుషుల కంటే మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. సిఎంఓలుగా మహిళలను నియమించే ‘ట్రెండ్’ ఇప్పటికే పలు సంస్థల్లో ప్రారంభమైందని, భవిష్యత్‌లో ఇది మరింతగా ఊపందుకుంటుందని మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గణాంకాల విశే్లషణ, సమాచార సేకరణ, మీడియా మేనేజ్‌మెంట్, ప్రచార వ్యూహాల్లో మహిళలు అద్భుత నైపుణ్యం చూపుతున్నారు. ఈ కారణంగానే ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థలు వీరికి కీలక బాధ్యతలను అప్పగించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. సృజనాత్మకత, డిజైనింగ్ వంటి అంశాల్లోనూ అతివలు సత్తా చాటుకుంటున్నారు. మార్కెటింగ్ పరంగా స్తబ్దత ఏర్పడిన సందర్భాల్లో వినియోగదారుల మనోభావాలకు అనుగుణంగా ప్రచార వ్యూహాన్ని అమలు చేయడంలో మహిళా సిఎంఓలు ముందంజలో ఉంటున్నారు. దీంతో నైపుణ్యం ఉన్న మహిళలకు డిమాండ్ పెరుగుతోంది. వాణిజ్య సంస్థల మధ్య నానాటికీ పోటీ పెరగడంతో క్లిష్టమైన సవాళ్లను అధిగమించే బాధ్యత మార్కెటింగ్ అధిపతులకే ఉంటుంది. కేవలం అనుభవం ఒక్కటే ఇందుకు సరిపోదు, సృజనాత్మకత, సహనం వంటివి అవసరమవుతాయని నిపుణులు విశే్లషిస్తున్నారు. ఈ లక్షణాలు పురుషులలో కంటే మహిళలలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో మార్కెటింగ్ ఉద్యోగాల్లో అతివల భాగస్వామ్యం పెరుగుతోంది. ఉన్నత విద్యార్హతలున్న వారిని నేరుగా కీలక పోస్టుల్లో నియమించేందుకు ప్రముఖ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టాటా కెమికల్స్‌లో రిచా అరోరా, టైటన్‌లో సుపర్ణ మిత్ర, ఇండియన్ హోటల్స్‌లో రాజశ్రీ బక్షీ, టాటా క్యాపిటల్‌లో వీతిక దేవరస్, ట్రెంట్‌లో నమితా పంత్, తనిష్క్‌లో దీపికా తివారీ, టాటా కాఫీలో రుచితా భట్టాచార్య, టాటా కమ్యూనికేషన్స్‌లో జూలీఉడ్స్ మోస్ మహిళా సిఎంఓలుగా రాణిస్తున్నారు.
వ్యాపార రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న టాటా గ్రూపు తన సంప్రదాయబద్ధమైన వాణిజ్య వ్యూహాలను కాలానుగుణంగా మార్చుకుంటోంది. మహిళలకు తగిన అవకాశాలు కల్పించేలా విధాన నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ‘టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్’ (టిఎఎస్)లో ఏభై శాతం పోస్టులకు మహిళలను ఎంపిక చేశారు. గతంలో మహిళల శాతం 20-30కి మించలేదు. ప్రస్తుతం టాటా గ్రూపులోని వివిధ సంస్థల్లో 1,78,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. కీలకమైన సిఎంఓ వంటి పోస్టులకూ అతివలనే ఎంపిక చేస్తున్నారు. మార్కెటింగ్ రంగంలో లింగవివక్షకు తావులేకుండా చేసేందుకు, మహిళలను ప్రోత్సహించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అతివలకు ప్రాధాన్యం ఇచ్చాక మార్కెటింగ్ రంగంలో అద్భుత ప్రగతి కనిపిస్తోందని టాటా గ్రూపు ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ సంస్థలో పనిచేస్తున్న మహిళలను ప్రోత్సహించేందుకు పదోన్నతులు కల్పిస్తున్నామని, అనుభవం లేకున్నా నైపుణ్యవంతులను నేరుగా ఎంపిక చేస్తున్నామని వారు చెబుతున్నారు. నాయకత్వ లక్షణాలు, మేధో వికాసం, సృజనాత్మకత, ప్రచార వ్యూహరచనలో మహిళలు తీసిపోరని, భవిష్యత్‌లో వారి భాగస్వామ్యం అనూహ్యంగా పెరుగుతుందని మార్కెటింగ్ నిపుణలు విశే్లషిస్తున్నారు.