యువ

విజ్ఞానమా? వినాశనమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపుడు ఎక్కడ చూసినా వయోభేదం లేకుండా అన్ని వర్గాల వారూ స్మార్ట్ఫోన్లతో ఎంతో ఉత్సాహంగా, గర్వంగా కనిపిస్తుంటారు. కంప్యూటర్, స్మార్ట్ఫోన్, ఆన్‌లైన్, యూ ట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సప్.. వీటిని వాడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. టెక్నాలజీని వాడుతూ క్షణం తీరిక లేనట్టు బిజీ బిజీగా వుండడం ఆధునికతకు సంకేతమా? ఈ సాంకేతిక విజ్ఞానం అందరికీ విజ్ఞానం అందస్తున్నదా? విఘాతం కలిగిస్తున్నదా? మనం ప్రగతి సాధిస్తున్నామా? అధోగతి పాలవుతున్నామా? అని ఎవరికి వారు తరచి చూసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇటీవల అనుకోని పెనుభూతంలా ఆన్‌లైన్ వేదికపై కొన్ని ప్రాణాంతక క్రీడలు వ్యాపిస్తున్నాయి. మొన్నటి దాకా పోక్‌మన్ ఇపుడు ‘బ్లూవేల్ చాలెంజ్’ క్రీడలు యువతను పెడత్రోవ పట్టిస్తున్నాయి. ‘బ్లూవేల్’ మత్తు నుంచి పైకి రాలేని యువత సంఖ్య నానాటికీ పెరుగుతోందని మనదేశంలోని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆ గేమ్‌ని నిషేధించడంతో పెనుముప్పునుండి బయటపడ్డాం. అయితే, ఈ చర్య తాత్కాలికమే. ఆధునిక సాంకేతిక నైపుణ్యం ఒకదాన్ని మించి మరొకటి సృష్టించగలదు. హైస్కూలు స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకూ స్మార్ట్ఫోన్ల వినియోగానికి చాలామంది కుర్రకారు బానిసలవుతుండడంతో టెక్నాలజీని సరైన రీతిలో వినియోగించుకోని పరిస్థితి నెలకొంది. రూపాయి సంపాదన లేని విద్యార్థులు ఖరీదైన స్మార్ట్ఫోన్లను ఎలా ఉపయోగిస్తున్నారు? అంటే తల్లిదండ్రులే వాటిని కొని పిల్లలను ప్రోత్సహిస్తున్నారని చెప్పక తప్పదు. స్మార్ట్ఫోన్లను వాడడం ఓ హోదాగా భావిస్తూ కొందరు పలురకాల వ్యసనాలకు బానిసలవుతున్నారు. పగలూ రాత్రి స్మార్ట్ఫోన్‌తో కాలక్షేపం చేసేవారు తిండికి, నిద్రకు దూరమై అనారోగ్యం బారిన పడుతున్నారు. కొందరైతే మితిమీరి వీడియో గేమ్స్ ఆడడడం, ఏ దశలోనూ గెలకపోతే పోటీనుండి విరమించుకోలేక తోటివారి అవహేళనకు తట్టుకోలేక, పగ, ద్వేషం పెంచుకుంటున్నారు. కొందరు నేరాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక, సెల్ఫీల వ్యామోహంలో తమ చుట్టుపక్కల పరిసరాలను మరచిపోయి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలను నడిపేవారి వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. చైనాలాంటి దేశాలే ఇంటర్‌నెట్ విషయంలో అనేక నిషేధాలను విధించినపుడు మన దేశంలో వీటిపై అవగాహన ఎందుకు పెరగదు? సాంకేతికత వల్ల విజ్ఞానం, వినోదంతో పాటు వినాశనం కూడా ఉంటుందని యువత గుర్తెరిగి వ్యవహరించాలి.

-అడపా రామకృష్ణ