యువ

ప్రేమ రాతలు వలపు గీతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలంటైన్స్ డై వస్తోందంటే చాలు... గ్రీటింగ్ కార్డులు, హృదయాకారంలో మలచిన రకరకాల బొమ్మలు, వస్తువులను కొనేందుకు ప్రేమికులు రెడీ అయిపోతారు. ‘ఎప్పుడూ అవేనా? కాస్త డిఫరెంట్‌గా ఆలోచించకూడదూ’ అని ఎవరైనా సలహా ఇస్తే డైలమాలో పడిపోతారు. రొటీన్‌కు భిన్నంగా ఆలోచించే ప్రేమికులు ప్రఖ్యాత చిత్రకళాకారుడు శిశిర్ సహానా కార్డుల్ని ట్రై చేయొచ్చు. గ్లాస్ పెయింటింగ్స్ వేయడంలో పేరొందిన శిశిర్ తాజాగా హైదరాబాద్‌లోని కళాకృతిలో నిర్వహించిన చిత్ర కళా ప్రదర్శన కాస్త డిఫరెంట్‌గా ఉంది. చిత్రకారుడే కాకుండా, కాస్తో కూస్తో కవితలు కూడా రాయడం అలవాటు ఉండటంతో తన కళకు కవితను జోడించి సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు శిశిర్. శాంతినికేతన్‌లో చిత్ర కళను అభ్యసించిన శిశిర్ దేశవ్యాప్తంగా అనేక చోట్లు ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించాడు. కవితలు కూడా రాయగలగడంతో తన కళాకృతులకు కవితలను కూడా జోడించడం మొదలుపెట్టాడు. అయితే కవితలు మరీ పొడుగ్గా ఉండటంతో కొందరు స్నేహితుల సలహాపై ఎస్‌ఎంఎస్ తరహాలో కవిత నిడివిని తగ్గించి, రెండే లైన్లుగా మలచి తన ఆర్ట్‌కు జోడించడం మొదలుపెట్టాడు. తాజాగా యువతీ యువకులకోసం ప్రేమ కవితల్ని తన ఆర్ట్ వర్క్‌కి జోడించి, వాటిని డిజిటల్ ప్రింట్స్ తీసి, కార్డులు వేయడం ప్రారంభించాడు. వీటికి డిమాండ్ బాగుందంటున్నాడు శిశిర్. సో, వేలంటైన్స్ డేకి శిశిర్ కార్డుల్ని మీరూ ట్రై చేయండి మరి! *