యువ

కొత్త సంకల్పం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక జీవన శైలి మనిషిపై ఎంతో ప్రభావం చూపిస్తోంది. శారీరికంగానే కాదు...మానసికంగానూ మనిషిని దెబ్బతీస్తోంది. ప్రశాంతతను దూరం చేస్తోంది. ఉదయం లేచిన దగ్గర్నుంచీ యంత్రంలా మారి, కాలంతోపాటు పరిగెత్తే మనిషి తన జీవితంలో ఎంతో కోల్పోతున్నాడన్నది మానసిక శాస్తవ్రేత్తలూ, డాక్టర్లూ నెత్తీ నోరూ కొట్టుకుని చెబుతున్నమాట. కానీ, ఆ మాట చెవికి ఎక్కించుకునేది కొందరే. పొద్దున లేవగానే బెడ్ కాఫీ, స్నానం చేసిన వెంటనే టిఫిన్, స్కూటర్‌పైనో, కారులోనో లేదా బస్సులోనే ఆఫీస్‌కి ప్రయాణం. సాయంత్రం ఇంటికొచ్చాక కాసేపు పిల్లలతో, టీవీతో కాలక్షేపం. ఆ తర్వాత నిద్ర. ఇదే చాలామంది దైనందిన చర్య. ఇందులో వ్యాయామానికి చోటేదీ? స్నేహితులతోనో, కుటుంబీకులతోనో ఉల్లాసంగా గడపడానికి టైమేదీ? సెలవు రోజుల్లో కూడా మన తీరు మారదు. పక్క వీధిలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్లాలంటే మోటార్ సైకిల్ బయటకు తీస్తాం. ఇలా మనల్ని మనమే ఓ చట్రంలో బిగించుకున్నాం. వీటన్నింటికీ తోడు కాలుష్యం ఉండనే ఉంది. పట్టణాలు, నగరాల్లో పెచ్చుమీరుతున్న కాలుష్యం చాపకింద నీరులా విస్తరిస్తూ మనిషిపై దొంగ దెబ్బ తీస్తోంది. ఈ నేపథ్యంలో మనం మారాల్సిన అవసరం లేదా? ఒత్తిడిని దూరం చేసుకునేందుకూ, మానసిక ప్రశాంతతను అంది పుచ్చుకునేందుకూ ప్రణాళిక రచించుకోవాల్సిన అవసరం లేదా? కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా కొత్త సంకల్పం చెప్పుకుందాం. మనలో మార్పు సాధిద్దాం.