యువ

నోకియా-5 యూజర్లకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ తన నోకియా 8 స్మార్ట్ఫోన్‌కు ఈమధ్యే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇప్పుడు నోకియా 5 స్మార్ట్ఫోన్‌కు కూడా ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను అందిస్తున్నది. అయితే, ఇది బీటా వెర్షన్ మాత్రమే. పూర్తి స్థాయి వెర్షన్ కాదు. అయినప్పటికీ ఈ కొత్త అప్‌డేట్‌ను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా తమ నోకియా 5 స్మార్ట్ఫోన్‌లో నోకియా అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను అందులో ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి.
కొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ 8.0
కొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ 8.0.. ఆ తర్వాతనే బీటా వెర్షన్ పొందేందుకు అర్హులు అవుతారు. ప్రాసెస్ అయిన తరువాత కొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను పొందవచ్చు. యూజర్లు సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లి అబౌట్ ఫోన్ సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.
ఓవర్ ది ఎయిర్ రూపంలో
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో బీటా ఓఎస్ ఓవర్ ది ఎయిర్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు కొత్త ఓఎస్‌ను వాడుకోవచ్చు.
ఆకట్టుకునే ప్రత్యేకతలు..
5.2 ఇంచ్ హెచ్‌డి 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280/720 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4కిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జిబి ర్యామ్, 16 జిబి స్టోరేజ్, 128 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యూయల్ సిమ్, 13 మెగా పిక్సెల్ బ్యాక్ కెపెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4 జి వీవోఎల్‌టిఇ, బ్లూటూత్ .1, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ.