S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/26/2019 - 22:39

బెళుగుప్ప, ఫిబ్రవరి 26 : మండల పరిధిలోని ఆవులెన్న గ్రామంలో శిల్పా (19) మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు లక్ష్మన్న, ముత్యాలమ్మ కుమార్తె శిల్పాకు, నాగేంద్రతో వివాహమైంది.

02/26/2019 - 22:38

కణేకల్లు, ఫిబ్రవరి 26 : మండల పరిధిలోని గరుడచేడు గ్రామానికి చెందిన కురుబ దేవేంద్రప్ప (23) మంగళవారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సాయంత్రం పొలానికి వెళ్లిన దేవేంద్రప్ప విద్యుత్ తీగలను తగిలి షాక్‌కు గురయ్యాడు. గమణించిన చుట్టుపక్కల వారు హుటాహుటిన కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీరించారు.

02/26/2019 - 22:25

తిరుపతి, ఫిబ్రవరి 26: రంగంపేట సమీపంలో కేఎంఎం కళాశాల వద్ద ఆటో-కారు ఢీకొన్న ప్రమాదంలో గాయపడ్డ మహిళను కాపాడేందుకు వెళ్లి అదే సమయంలో మదనపల్లి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నారాయణ కళాశాల ఏజీఎం సుధీర్ బాబు తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. తమ కళాశాల ముందు కారు - ఆటో ఢీకొనడంతో ఓ మహిళ గాయపడింది. ఆమెను కాపాడేందకు సుధీర్ బాబు 108కు ఫోన్ చేశాడు.

02/26/2019 - 22:25

తిరుపతి, ఫిబ్రవరి 26: శ్రీవారి మెట్టు మార్గంలో జూపార్క్ సమీపంలో శేషాచల అడవుల్లో నరికి అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న జువ్వాది మలైకి చెందిన ఒక స్మగ్లర్ అన్నామలైని టాస్క్ఫోర్స్ సిబ్బంది సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా మరి కొంత మంది స్మగ్లర్లు తప్పించుకుని పారిపోయారు. వారి కోసం గాలింపును ముమ్మరం చేశారు. వారు వదిలి వెళ్లిన 12 ఎర్రచందనం దుంగలను గుర్తించారు.

02/26/2019 - 06:24

పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సోమవారం రాత్రి ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

02/26/2019 - 05:51

హైదరాబాద్, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంత్‌కుమార్‌లు వేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం స్టే విధించింది. శాసనసభ నియమాలను ఉల్లంఘించి తమపై గత స్పీకర్ అనర్హత వేటు వేశారని వీరిద్దరు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు వీరిపై అనర్హతను ఎత్తివేయాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది.

02/26/2019 - 05:48

న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006లో విద్యుత్ సంస్థలు భర్తీ చేసిన జూనియర్ లైన్‌మెన్ల నియామకాలకు సుప్రీం కోర్టు ఒకే చెప్పింది. జూనియర్ లైన్‌మెన్ల నియామకాలపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ లావు నాగేశ్వరావు, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. విద్యుత్ సంస్థలు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాయని దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం తుది తీర్పును వెలువరించింది.

02/26/2019 - 05:34

కామవరపుకోట, ఫిబ్రవరి 25: పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లి బౌద్ధ ఆరామాల వద్ద ఆదివారం రాత్రి శ్రీ్ధరణి అనే డిగ్రీ విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆ యువతి వెంట ఉన్నట్లుగా భావిస్తున్న నవీన్ అనే యువకుడు సైతం తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించిన సంగతి విదితమే.

02/26/2019 - 01:13

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయంగా మరింత సున్నిశితంగా మారిన రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన కేసును సుప్రీం కోర్టు మంగళవారం విచారించబోతోంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్. అబ్దుల్ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందుకు ఈ కేసు రాబోతోంది.

02/26/2019 - 01:03

గాజువాక, ఫిబ్రవరి 25: నాటు సారా అనుకుని రసాయన ద్రావకాన్ని తాగి మృతి చెందిన వారి సంఖ్య సోమవారానికి ఏడుకి చేరింది. మరో 8 మంది ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వారి వారి కుటుంబీకులు చెబుతున్నారు.

Pages