S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/20/2018 - 20:09

అందాల రాక్షసి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు హను రాఘవపూడి. తరువాత సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ పరిశ్రమలో ప్రత్యేకత నిలుపుకున్నాడు. తాజాగా సరికొత్త ప్రేమకథతో ‘పడిపడి లేచె మనసు’ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. శర్వా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో మీడియాతో హను..

12/20/2018 - 20:07

వరుణ్‌సందేశ్, జీవన్, చరిష్మాశ్రీకర్, కారుణ్య చౌదరి హీరోహీరోయిన్లుగా మధుసోభా.టి దర్శకత్వంలో ఏ డీజే ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై శంకర్ ఆరా నిర్మిస్తున్న చిత్రం ‘దాడి’. ఈ సినిమా బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఏడిద శ్రీరామ్ కెమెరా స్విచాన్, శివాజీరాజా క్లాప్‌నిచ్చారు.

12/20/2018 - 20:05

హర్రర్ ‘క్షుద్ర’ చిత్రాన్ని అందించిన దర్శకుడు నాగుల్ దర్శకత్వంలో ఎం. నరేంద్ర సమర్పణలో వర్కింగ్ యాన్ట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘బంజార’. షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న చిత్రం తెలుగు, తమిళ భాషల్లో జనవరి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. రొటీన్‌కు భిన్నమైన హారర్ కథాంశంతో కూడుకున్న చిత్రమని నిర్మాత కోయ రమేష్‌బాబు తెలిపారు.

12/20/2018 - 20:04

ప్రియాంత్‌ని హీరోగా పరిచయం చేస్తూ నిశ్చయ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘కొత్తగా మా ప్రయాణం’. యామిని భాస్కర్ కథానాయిక. ‘ఈవర్షం సాక్షిగా’ ఫేం రమణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరాయ. ఇటీవలే రిలీజైన టీజర్ ఆద్యంతం ఫన్, లవ్, యాక్షన్‌తో ఆకట్టుకుంది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆడియో త్వరలో రిలీజ్ కానుంది.

12/20/2018 - 20:03

సుమంత్ నటిస్తోన్న వైవిధ్య చిత్రం ‘ఇదం జగత్’. అనీల్ శ్రీకంఠం దర్శకుడు, అంజు కురియన్ కథానాయికగా పరిచయమవుతోంది. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీ్ధర్‌లు సంయుక్తంగా నిర్మించారు. సినిమా ట్రైలర్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. అతిథిగా హాజరైన అడివి శేష్ మాట్లాడుతూ టీజర్, ట్రైలర్‌లో ‘ఇదం జగత్’ టైటిల్ వచ్చినపుడు ఒకే రకమైన సంగీతం వస్తుంది.

12/19/2018 - 20:16

భిన్నమైన కథలతో... అంతకంటే భిన్నమైన సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు శర్వానంద్. హీరోయిజానికి దూరంగా కథలకే ప్రాధాన్యనిస్తూ అటు ఫ్యామిలీ ప్రేక్షకులకు ఇటు యూత్‌కు దగ్గరయ్యాడు. తాజాగా ‘పడి పడి లేచే మనసు’ అంటూ సాయి పల్లవితో జోడిగా వస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 21న విడుదల అవుతున్న సందర్భంగా శర్వాతో ఇంటర్వ్యూ...

12/19/2018 - 20:14

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది హీరోయిన్ తాప్సి. తాజాగా ఆమె నటించిన తమిళ చిత్రం ‘గేమ్ ఓవోర్’. ఈ చిత్రంలో తాప్సి వీడియో గేమ్ డెవలపర్ పాత్రలో నటిస్తోంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి ‘మాయ’ ఫేమ్ అశ్విన్ శరవణ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

12/19/2018 - 20:13

ఇటీవల ‘హ్యాపీ వెడ్డింగ్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగా డాటర్ నిహారిక కొణిదెల సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఆమె ‘సూర్యకాంతం’లో నటిస్తుంది. యువ హీరో రాహుల్ విజయ్ నిహారికకు జోడీ. లీడ్ పెయిర్‌తో రూపొందించిన చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలై ఆకట్టుకుంటుంది. నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న చిత్రాన్ని కొత్త దర్శకుడు ప్రణీత్ బ్రమండపల్లి తెరకెక్కిస్తున్నాడు. వచ్చే జనవరిలో చిత్రం విడుదలకానుంది.

12/19/2018 - 20:11

వరుత్‌తేజ్, అతిదిరావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం 9000’. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మాతగా చిత్రం రూపొందింది.

12/19/2018 - 20:09

శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, రియాల్ నిర్మించిన హుషారు మంచి టాక్ తెచ్చుకోవడంతో కెరీర్‌పై మంచి హుషారుతో ఉంది హీరోయిన్ ప్రియావడ్లమాని. ఆ ఆనందంలో మీడియాకు చెప్పిన విశేషాలు.

Pages