S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/18/2018 - 19:58

‘వర్కవుట్ అయ్యింది’ పేరిట వెబ్ సిరీస్ ప్రారంభమైంది. మా ఆయి పతాకంపై బి శివకుమార్ దర్శకత్వంలో రూపేష్‌కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సిరీస్ షూటింగ్ జరపనున్నారు. రూపేష్‌కుమార్ చౌదరి, మీనాకుమారి, శశిధర్, సూర్య, ఫన్ బకెట్ ఫణి, ఫన్ బకెట్ భార్గవి, ఇషాని, ఫణీంద్ర, మోడబుల్ గై, రాహుల్ కొసరాజు నటిస్తున్న వెబ్ సిరీస్‌లో ప్రముఖ డాన్స్‌మాస్టర్ అనీలామా కీలక పాత్ర చేస్తున్నారు.

12/17/2018 - 19:54

బాలీవుడ్ బబ్లీ బ్యూటీ శ్రద్ధాకఫూర్‌తో ప్రభాస్ పండించే కెమిస్ట్రీ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు తీపికబురు అందేసింది. బాహుబలి బిగినింగ్, కన్‌క్లూజన్ తరువాత చాలా గ్యాప్‌తో వస్తున్న ప్రభాస్ చిత్రం సాహో. బాహుబలి ప్రాజెక్టుతో యూనివర్శల్ హీరో అయిపోయిన ప్రభాస్ పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్న చిత్రమిది.

12/17/2018 - 19:52

విలక్షణ నటుడు కమల్‌హాసన్ సరసన చాన్స్ కొట్టేసిన కాజల్ మంచి ఊపుమీదుంది. బ్లాక్‌బస్టర్ హిట్టుగా నిలిచిన ఇండియన్‌కు సీక్వెల్, మరోపక్క కమల్‌కు జోడీ, పైగా శంకర్ సినిమా.. ఇవన్నీ తన కెరీర్‌కు మరో బ్రేక్ త్రూ అంటోంది కాజల్. కాజల్ కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతున్నపుడల్లా అదృష్టంకొద్దీ ఇలాంటి ప్రాజెక్టు ఒకటి పడటం, మళ్లీ టాప్ హీరోయిన్ల రేస్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ రావడం కాజల్‌కు అలవాటైపోయింది.

12/17/2018 - 19:51

వరుణ్‌తేజ్, అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో క్రిష్ జాగర్లమూడి, సాయిబాబా జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మాతగా రూపొందింది. ఈనెల 21న చిత్రం విడుదలవుతుంది. ఆస్ట్రోనాట్ పాత్రతో ఆకాశంలో తేలిపోయనంత ఆనందం పొందానని చెబుతున్న అతిదిరావ్ హైదరి చెప్పిద విశేషాలు...

12/17/2018 - 19:49

‘నిరాశ ఓ మేలుకొలుపు. అప్పుడప్పుడూ అలాంటిది ఎదురుకాకపోతే లైఫ్‌లో చాలా రుచులు మిస్సవుతాం’ అంటోంది బాలీవుడ్ బార్బీగాళ్ కత్రినా కైఫ్. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇటీవలే వచ్చిన ‘్థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ గురించేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్‌వాల్ట్స్ అమితాబ్, అమీర్‌ఖాన్, కత్రినా కీలక పాత్రల్లో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘్థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ తీవ్ర నిరాశ మిగిల్సిన విషయం తెలిసిందే.

12/17/2018 - 19:47

వరుసగా పరాజయాలతో సతమతం అవుతున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం పూరి, ఎనర్జిటిక్ హీరో రామ్‌తో ఒక చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తరువాతి చిత్రాన్నీ పూరి లైన్లో పెట్టాడు. తాజా సమాచారం ప్రకారం క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నట్టు తెలిసింది. కాకినాడలో డియర్ కామ్రేడ్ చిత్రం షూటింగ్‌లో బిజీగాఉన్న విజయ్ దగ్గరికొచ్చి మరీ పూరి తన స్టోరీని వినిపించాడట.

118
12/17/2018 - 19:45

‘నా నువ్వే’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రస్తుతం తన 16వ చిత్రం 118లో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్ర ట్రైలర్ రేపు ఉదయం విడుదల చేయనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేద థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

12/17/2018 - 19:44

అడివి శేష్ హీరోగా వచ్చిన గూఢచారి భారీ విజయాన్ని అందుకోవడంతో, సీక్వెల్ తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా సీక్వెల్‌ను చిత్రవర్గాలు ప్రకటించాయి. స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని ప్రకటిస్తూనే, చిత్ర కానె్సప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలుపెట్టి 2020నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నట్టు ప్రకటించారు.

12/17/2018 - 19:42

కుర్ర హీరో సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ అనే ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. డిసెంబర్ 17న ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, భోగవల్లి ప్రసాద్ ముఖ్య అతిథులుగా వచ్చారు. హీరో సందీప్ కిషన్‌పై తొలి క్లాప్‌ను అనీల్ సుంకర, భోగవల్లి ప్రసాద్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఛార్మింగ్ బ్యూటీ హన్సిక ఇందులో తొలిసారిగా సందీప్‌కిషన్‌తో జోడీ కడుతున్నారు.

12/16/2018 - 22:00

చివరి సినిమాల రేస్‌లోకి తాజాగా తమిళ హీరో ధనుష్ కూడా వచ్చి చేరాడు. మారి సాధించిన సెనే్సషనల్ హిట్టుతో మారి-2ని సీక్వెల్‌గా తెస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సైతం వచ్చే శుక్రవారం అంటే -డిసెంబర్ 21న విడుదలయ్యే చిత్రాల రేసులోకి తీసుకొచ్చారు. దీంతో వచ్చ శుక్రవారం ఆరు సినిమాల మధ్య గట్టి పోటీయే కనిపిస్తోంది.

Pages