S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/19/2018 - 20:08

బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టిన తనీష్ నచ్చావులే సినిమాతో హీరో అయ్యాడు. పలు చిత్రాల్లో నటించినా వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. బిగ్‌బాస్ టీవీ షో తరువాత కొత్త ఎనర్జీతో అడుగులేస్తున్న తనీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు. నటుడిగా కెరీర్ మొదలై ఇరవై ఏళ్ళు. ఈ సందర్భంగా మీడియాతో తన అనుభవాలు పంచుకున్నాడు.

12/19/2018 - 20:04

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను వద్ద పదేళ్లుగా అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన అర్జున్ జంధ్యాల మెగా ఫోన్ పట్టనున్నారు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌లా ఉండే బోయపాటి సినిమాల్లాగానే తన శిష్యుని సినిమా కూడా ఉండబోతోంది. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి, బోల్డంత క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ ఈ చిత్రంలో హీరోగా నటించనున్నారు.

12/18/2018 - 20:12

ఆడియో, ట్రైలర్ లాంచ్ ముహూర్తం దగ్గర పడుతుండటంతో రోజుకో లుక్‌తో యన్‌టిఆర్ పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ ఆసక్తి పెంచుతున్నాడు. హైదరాబాద్‌లో కథానాయకుడు చిత్రానికి సంబంధించి 21న ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

12/18/2018 - 20:10

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం ‘మహర్షి’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదలకానుంది. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు మహేష్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ తర్వాత మహేష్- సుకుమార్ కాంబో ఫైనలైంది. కానీ కథాంశం ఫైనల్ కాలేదన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. సుకుమార్ చెప్పిన కథ మహేష్‌కు నచ్చకపోవడంతో, మరో కథ రెడీ చేస్తున్నాడని సమాచారం.

12/18/2018 - 20:07

క్వీన్ కంగన చారిత్రక చిత్రం ట్రైలర్ విడుదలవ్వడంతోనే సెనే్సషన్ క్రియేట్ చేస్తుంది. మణికర్ణిక టైటిల్ రోల్‌లో కంగన ప్రదర్శించిన సాహస విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. కథా బీజం క్లియర్‌గా అర్థమయ్యే డైలాగులతో వచ్చిన ట్రైలర్ -ప్రాజెక్టుపై అంచనాలు పెంచేదిగానే ఉంది. ‘లక్ష్మీబాయి అనే నేను..

12/18/2018 - 20:06

అప్పుడు శ్రద్ధా.. తరువాత దిశా.. ఇప్పుడు సారా. బాఘి సీక్వెన్స్ హీరోయిన్ల గురించేనని అర్థమైంది కదూ. ఔను, ‘బాఘి-3’ ప్రాజెక్టులో సారా అలీ ఖాన్ అవకాశం ఖరారైందట. తొలి ప్రాజెక్టు ‘కేదార్‌నాథ్’తో స్క్రీన్‌కు వచ్చిన సారా అలీ ఖాన్, అది షూటింగ్ జరుగుతున్న టైంలోనే ‘సింబా’లో చాన్స్ దక్కించుకుంది.

12/18/2018 - 20:04

సాయిపల్లవి ఫిదా సినిమాలో తన అభినయంతో అందరినీ మనసు దోచుకుని తెలుగు సినీ పరిశ్రమలో స్థానం సుస్థిరం చేసుకుంది. తీసిన మొదటి సినిమా అయినప్పటికీ నీది నాది ఒకే కథ లాంటి డిఫరెంట్ సినిమాను విభిన్న పద్ధతిలో తీసి, తానేంటో నిరూపించుకున్నాడు దర్శకుడు వేణు ఊడుగుల. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది.

12/18/2018 - 20:02

శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ‘పడి పడి లేచే మనసు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ట్రైలర్ బాగా నచ్చింది. నాకు ప్రేమకథలంటే ఇష్టం. ఆ మ్యాజిక్ ట్రైలర్‌లో ఉంది. ఈ సినిమాతో విశాల్ శేఖర్ పెద్ద సంగీత దర్శకుడు అవుతాడన్న నమ్మకం కలుగుతుంది. ప్రేమమ్, ఫిదా, ఎంసిఏలో సాయిపల్లవి బాగా నటించారు.

12/18/2018 - 20:01

టీజర్ విడుదలతో నందమూరి కల్యాణ్‌రామ్ చిత్ర టైటిల్ ‘118’ అంతరార్థం వెల్లడైంది. కల్యాణ్ హీరోగా కెవి గుహన్ తెరకెక్కిస్తున్న చిత్రం 118. నివేదా థామస్, షాలిని పాండే కథానాయికలు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న చిత్రానికి సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. కల్యాణ్‌రామ్, షాలిని పాండేల లవ్‌స్టోరీతో మొదలైన టీజర్‌లో -1.18 గంటల సమయంలో ఏదో ప్రమాదం జరగడాన్ని చూపించారు.

12/18/2018 - 20:00

పేరడీ స్టార్‌గా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు పృధ్వీ. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఖడ్గం సినిమాలో చేసిన అల్లరికి మంచి క్రేజ్ దక్కింది. తరువాత వరుస సినిమాలతో బిజీగా మారిన పృధ్వీ, స్టార్ హీరోల పవర్‌ఫుల్ పాత్రలకు పేరడీ స్టార్‌గా మారాడు. అటు కమెడియన్‌గా.. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన పృధ్వీ తాజాగా సత్య హీరోగా

Pages