S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/16/2018 - 21:57

సీనియర్ యన్‌టిఆర్ జీవితం ఆధారంగా కొడుకు బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం -యన్‌టిఆర్. క్రిష్ డైరెక్షన్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరిలో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. డిసెంబర్ 16న హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేసి, 21న నిమ్మకూరులో ఆడియో విడుదల నిర్వహించాలని చిత్రబృందం తొలుత భావించింది.

12/16/2018 - 21:55

సూపర్‌స్టార్ మహేష్‌తో సినిమా తీయడానికి ప్రతి ప్రొడ్యూసర్ ఆసక్తి చూపిస్తాడు. అలా తెలుగు ఇండస్ట్రీలో ఓ కొత్త కాంబినేషన్‌కు స్క్రీన్‌కు వస్తుంది. అదే గీతామహేష్. గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, హీరో మహేష్‌బాబుతో ఓ ప్రాజెక్టు చేయడానికి సంయుక్త ప్రణాళిక సిద్ధమైందట. ప్రస్తుతం మహర్షి షూటింగ్ బిజీలోవున్న మహేష్, తరువాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.

12/16/2018 - 21:52

కంటెంట్ కథలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న క్రేజీ ప్రాజెక్టును మధుర శ్రీ్ధర్‌రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలనటుడు భరత్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా కనిపించనుంది. చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నారు.

12/16/2018 - 21:50

జననేతగా తెలుగోడి గుండెల్లో పదిలమైన చోటుదక్కించుకున్న నేత, ఉమ్మడి ఆంధ్ర సీఎంగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్రలోని ఒక పార్శ్వాన్ని ‘యాత్ర’ పేరిట నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్ర పోషిస్తున్నారు.

12/16/2018 - 21:49

భీమవరం టాకీస్ పతాకంపై శైలేష్, శ్రీరితిక జంటగా సాగర్ శైలేష్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తోన్న చిత్రం రహస్యం. చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ సిఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, సి కల్యాణ్, శివశక్తిదత్తా, రాజ్ కందుకూరి, యంగ్ హీరో మానస్, శివశంకర్ మాస్టర్ హాజరయ్యారు.

12/16/2018 - 21:45

నంది గ్రహీత, 150 చిత్రాలకు కళా దర్శకత్వం వహించిన అశోక్ కె దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇష్టం’. ఆషా అశోక్ నిర్మించిన చిత్రం విడుదలకు సిద్ధమైంది. రామ్‌కార్తీక్, పార్వతి అరుణ్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. తాజాగా సీనియర్ డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు చేతుల మీదుగా ఫస్ట్‌లుక్ విడుదలైంది.

12/16/2018 - 21:43

దక్షిణాది సెలబ్రిటీల్లో నెటిజన్లు ఎక్కువ వెతుకుతున్న వాళ్ల జాబితాలో తనకూ ఓ ప్లేస్ సంపాదించుకుంది ఫ్రెష్ బ్యూటీ రష్మిక మండన్న. సైరా సినిమా విడుదలకు దగ్గరపడిన సమయంలో గూగుల్ సౌత్ స్టార్స్ సెర్చ్‌లో చిరంజీవి టాప్ ప్లేస్‌లోవుంటే, మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీ లిస్టులో రష్మికకు ఫిఫ్త్ ప్లేస్ దక్కిందట. కేవలం కన్నడ, తెలుగు సినిమాలే చేసిన రష్మికకు ఈ ప్లేస్ దక్కడాన్ని గొప్పగానే చెప్పాలి.

12/16/2018 - 21:41

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంలో నటించి మెప్పించిన శేఖర్‌వర్మ హీరోగా, వినియా, విద్య హీరోయిన్లుగా సతీష్ రేగళ్ళని దర్శకుడుగా పరిచయం చేస్తూ కెఎన్ రావు నిర్మిస్తోన్న చిత్రం నివాసి. ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్‌లా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ దాదాపు పూరె్తైంది. ఈ ట్రావెల్ బేస్డ్ కథకు చరణ్- అర్జున్ సంగీతం సమకూర్చారు.

12/14/2018 - 20:13

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం పడిపడి లేచె మనసు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం 21న థియేటర్లకు రానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చిన చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. సునీల్, మురళీశర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘నా పేరు సూర్య.

12/14/2018 - 20:11

తమిళ చిత్రం ‘96’ హిట్టు టాక్ తెచ్చుకోవడంతో -టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆలస్యం చేయకుండా రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాడు. హిట్టు ఊపులోనే రీమేక్ మొదలుపెట్టాలని అనుకున్నా -కాస్టింగ్ సంగతి ఎటూ తేలక ఆలస్యమైంది. తొలుత నాని, అల్లు అర్జున్, గోపీచంద్.. ఇలా చాలా పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ, ఎవరితోనూ ప్రాజెక్టు సెట్ కాలేదు. అయితే ఎట్టకేలకు నాయకా నాయకల పాత్రల్ని దిల్ రాజు ఫైనల్ చేయగలిగాడట.

Pages