S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/31/2018 - 19:37

భాగమతి తర్వాత అనుష్క మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కొత్త సినిమా తాలూకు అప్ డేట్స్ లేవు. పోనీ పెళ్లి వార్తయినా ఉందా? అంటే అదీ లేదు. గత కొంతకాలంగా వెయిట్ లాస్‌మీద సీరియస్‌గా ఫోకస్‌పెట్టి దానికి సంబంధించిన శిక్షణలో బిజీగావున్న అనుష్క, త్వరలోనే స్వదేశానికి తిరిగి రానుంది. అందరూ ఊహించినట్టు పెళ్లికోసం కాదు, ఓ తమిళ సినిమాలో నటించేందుకు.

10/31/2018 - 19:36

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్‌లో భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకున్న చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్‌రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాగణం.

10/31/2018 - 19:39

తిరుడన్ పోలీస్, ఉల్‌కుత్తు వంటి చిత్రాలను రూపొందించిన కార్తిక్‌రాజు ఈసారి ద్విభాషా చిత్రంగా సరికొత్త హారర్ థ్రిల్లర్‌తో వస్తున్నాడు. సందీప్ కిషన్, అన్యసింగ్ జోడీగా తెలుగు, తమిళంలో వి స్టూడియోస్ తెరకెక్కిస్తున్న చిత్రం -కన్నాడి. తమిళంలోనూ మూడు నాలుగు చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న సందీప్ కిషన్ చాలెంజింగ్ పాత్ర చేస్తుంటే, అన్యసింగ్ హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది.

10/31/2018 - 19:31

ప్రాంతీయ, జాతీయ సినీ పరిశ్రమలను బయోపిక్‌లు వెంటాడుతున్నాయి. వివిధ రంగాల్లోని ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా తీస్తోన్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో -అదొక ఒరవడిగా పరిశ్రమ పరుగులు తీస్తోంది. అలా ఇస్రో శాస్తవ్రేత్త జీవితంలోని క్రైం క్షణాలను కథగా ఎంచుకుని తెరపైకి వస్తోన్న చిత్రం -రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. ప్రముఖ నటుడు మాధవన్ నంబి పాత్రను పోషిస్తున్నాడు.

10/31/2018 - 19:30

కొద్దికాలం క్రితం రీమిక్స్‌లు తెలుగు పరిశ్రమను ఒక ఊపు ఊపేశాయి. తరువాత గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు హీరో చైతూ -తండ్రి నాగ్ హిట్టు సాంగ్‌ను రీమిక్స్‌గా సవ్యసాచిలో ప్రయోగం చేస్తున్నాడు. చైతూ హీరోగా తాజా చిత్రం ‘సవ్యసాచి’ వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. చైతూతో నిధి అగర్వాల్ జోడీ కడితే, చందు మొండేటి దర్శకత్వం వహించాడు.

10/31/2018 - 19:28

ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ పెళ్లి డిసెంబర్ 1న ఘనంగా జరగనుంది. అంతకుముందే నిక్ జోనాస్ బంధువులు, పీసీ తరఫున బంధువులు ఇటీవలే జోధ్‌పూర్‌లోని వెన్యూని విజిట్ చేసి ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి సంగతి సరే కానీ, చాలాముందే పీసీ ప్రీవెడ్డింగ్ సంబరాల హడావుడి మొదలైంది. ప్రస్తుతం పీసీ అమెరికాలో నిక్‌తోనే ఉంటోంది. అక్కడ పీసీ విదేశీ స్నేహితురాళ్లు ఒక స్పెషల్ పార్టీ ఇచ్చారట.

10/31/2018 - 19:27

ఒక్కమనసు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మెగా హీరోయిన్ నిహారిక ఆ తరువాత చేసిన హ్యాపీ వెడ్డింగ్ సినిమా కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేకపోయింది. దాంతో అటు తమిళంలో అయినా సక్సెస్ అవ్వాలని అక్కడా ప్రయత్నాలు చేసింది. అక్కడా పరిస్థితి మారకపోవడంతో తెలుగులోనే బెటర్ అనే ఉద్దేశ్యంతో ఇక్కడే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మరో తెలుగు సినిమాలో నటించేందుకు రెడీ అయ్యింది.

10/31/2018 - 19:25

ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడిగా విజయ్‌వర్మ పాకలపాటి ఎంపికయ్యారు. ద్వితీయ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళగిరి మండలం ఆత్మకూరు హ్యాపీ రిసార్ట్స్‌లో ఆదివారం నిర్వహించారు. సమావేశంలో వాణిజ్య మండలి నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి కె సురేష్‌బాబు ప్రకటించారు.

10/31/2018 - 19:24

మిషాల్ శైలేష్‌జైన్, హేమలత హీరో హీరోయిన్లుగా శుక్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3 చిత్రం బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ప్రారంభమైంది. విఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో సంజీవ్‌కుమార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సత్యప్రకాశ్ క్లాప్ కొట్టగా నిర్మాత సంజీవ్‌కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా సత్యప్రకాశ్ దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్‌లకు అభినందనలు తెలిపారు.

10/31/2018 - 19:23

అంతకుముందు ఆ తరువాత, లవర్స్, కేరింత వంటి సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో సుమంత్ అశ్విన్, దండుపాళ్యం సిరీస్ దర్శకుడు శ్రీనివాసరాజు కాంబినేషన్‌లో భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ‘గరుడవేగ’ వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Pages