S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/06/2018 - 20:28

విభిన్నమైన సినిమాలు, పాత్రలు చేస్తూ కొత్తదనానికి పెద్దపీట వేసే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో వరుస విజయాలను సాధించిన యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో రూపొందున్న మల్టీస్టారర్ ఎఫ్2. ఫన్ అండ్ ప్రస్టేషన్ ట్యాగ్‌లైన్. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్లు నటిస్తున్నారు.

11/06/2018 - 20:27

అదోరకం డైలాగులతో విడుదలైన ‘ఏడుచేపల కథ’ టీజర్‌కి ప్రపంచంలోని తెలుగు కుర్రోళ్లు ఫుల్‌ఛార్జ్‌తో యాక్టివేట్ అయ్యారు. అడల్డ్ కామెడీగా వస్తున్న చిత్రానికి యూట్యూబ్‌లో 20 మిలియన్ల వ్యూస్ రావటం అతిపెద్ద రికార్డుగా నిలిచింది. అదీ ఆర్గానిక్‌గా రావటంతో టాలీవుడ్‌లో ‘ఏడు చేపల కథ’ సంచలనంగా మారింది. అటు తమిళనాటా టీజర్ సంచలనం కావటం విశేషం.

11/06/2018 - 20:26

కానె్సప్ట్ ఓరియెంటెడ్ కథలు ఆకట్టుకుంటున్న ట్రెండ్‌లో ‘లా’ మూవీ ఆ ట్రెండ్‌ని కొనసాగిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసింది చిత్ర యూనిట్. కమల్ కామరాజ్, వౌర్యాణి, పూజా రామచంద్రన్ లీడ్ రోల్స్ పోషించిన చిత్ర ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్మాత రాజ్‌కందుకూరి చేతులమీదుగా జరిగింది. రాజ్ కందుకూరి మాట్లాడుతూ ట్రైలర్ ఇంప్రెసివ్‌గా వుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది.

11/06/2018 - 20:25

లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజానాయుడు ఎన్ దర్శకత్వంలో పదిలం లచ్చన్న దొర (లక్ష్మణ్) నిర్మిస్తోన్న చిత్రం ‘కొత్త కుర్రోడు’. శ్రీరామ్, శ్రీప్రియ హీరోహీరోయిన్లు. సినిమా సెన్సార్ పూర్తయిన సందర్భంగా నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ డైరెక్టర్ రాజానాయుడు సినిమాను అనుకున్న ప్రణాళిక ప్రకారం చక్కగా తీశారు. హీరో హీరోయిన్ల నటన సినిమాకు హైలెట్. సాయి ఎలెందర్ సంగీతంలోని పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి.

11/06/2018 - 20:24

మూవీ లెజెండ్ మోహన్‌లాల్ మలయాళంలో నటిస్తున్న అత్యంత భారీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఓడియన్’. ఈ చిత్రానికి తెలుగు ట్రేడ్‌లోనూ మంచి క్రేజ్ వచ్చింది. యోగా, వ్యాయామాలతో 35 ఏళ్ల యువకుడిలా మోహన్‌లాల్ తన శరీరాన్ని మార్చుకుని నటించిన చిత్రం కావటం.. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో నిర్మిస్తుండటంతో ప్రాజెక్టుకి సౌత్ ఇండియాలో పెద్ద క్రేజ్ వచ్చింది.

11/06/2018 - 20:22

బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జీరో’. ఫిలిం మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రెండు రోజుల క్రితం విడుదల చేశారు. షారూఖ్‌ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ఒక వివాదంలో కూడా చిక్కుకుంది. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

11/06/2018 - 20:21

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు బ్యాక్ సపోర్ట్ అవసరం లేదు. కానీ వైవిధ్యం, విభిన్న చిత్రాలకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది అంటున్నాడు నిర్మాత సురేష్ బాబు. పంది పిల్ల ప్రధాన పాత్రగా రవిబాబు తెరకెక్కించిన చిత్రం -అదుగో. బుధవారం ఆడియన్స్ ముందుకొస్తున్న నేపథ్యంలో, చిత్ర నిర్మాతల్లో ఒకరైన సురేష్‌బాబు మీడియాతో మాట్లాడారు. అల్లరి సినిమా నుంచీ రవిబాబు మాతో ట్రావెల్ అవుతున్నాడు. ఉన్నట్టుండి ఓ కథ చెబుతాడు.

11/05/2018 - 19:55

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం మళ్లీ షూటింగ్ మొదలవ్వనుంది. రెండువారాల క్రితం జార్జియాలో జరుపుకున్న లాంగ్ షెడ్యూల్‌లో కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే భారీ యుద్ధ సన్నివేశాల నేపథ్యంతో కూడిన క్లైమాక్స్‌నూ కెమెరామెన్ రత్నవేలు భారీ పరికరంతో చిత్రీకరించిన విషయం తెలిసిందే.

11/05/2018 - 19:54

ఒక్కో సీజన్‌లో ఒక్కొక్కరు చమక్కు మనిపిస్తారు. కాలం కలిసొస్తే -స్టార్ హోదా అందుకుంటారు. ఇప్పుడు టైం -నిధి అగర్వాల్‌దే అంటున్నారు కుర్రాళ్లు. చైతూ కెరీర్‌కు ఇటీవల వచ్చిన సవ్యసాచి ఎంతవరకూ కలిసొచ్చిందో తెలీదుకానీ, నిధికి మాత్రం బాగా వర్కౌటైనట్టే కనిపిస్తోంది. ఈ బక్చపల్చని అందానికి కుర్రాళ్లంతా ఫిదా అయిపోతున్నారు.

11/05/2018 - 19:52

నాని- విక్రమ్‌కుమార్‌ల కాంబో మూవీని అశ్వినీదత్ నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నాడు. వీరిద్దరి కాంబో మూవీని మహేష్ సోదరి మంజుల కూడా నిర్మించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మనం, 24లాంటి విభిన్నమైన కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్‌కుమార్‌తో మెగా హీరో అల్లు అర్జున్ ఒక చిత్రం చేయాల్సి వుంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే గత సమ్మర్‌లోనే వీరిద్దరి కాంబినేషన్ మూవీ పట్టాలెక్కాల్సి వుంది.

Pages