S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2018 - 20:38

అందాలభామ రకుల్‌ప్రీత్ సింగ్ జోరుగా హుషారుగా కెరీర్‌ని కొనసాగిస్తోంది. వచ్చిన చిత్రాల్లో మంచివి అనుకున్నవి మాత్రమే ఎంచుకుంటూ ముందుకు కదులుతోంది. అయితే తను నటిస్తున్న చిత్రాలన్నింటిలో లభిస్తున్న పాత్రలన్నీ ఒకే మూసలో వుంటున్నాయని.. ఆ పాత్రల్లో ఏ మాత్రం కొత్తదనం కనిపించడం లేదని ఆమె సన్నిహితులు తెగ బాధపడిపోతున్నారట.

08/03/2018 - 20:36

‘సంతోషం’ అవార్డుల పండుగ షురూ అయింది. 16 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తిచేసుకుని 17వ ఏటలోకి అడుగుపెట్టేసింది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అవార్డులకు సంబంధించిన కర్టైన్ రైజర్ ఫంక్షన్‌గా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో పలువురు టాలీవుడ్ తారలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ..

08/02/2018 - 20:29

ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కే ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రముఖ రచయిత వాసుదేవ నాయర్ రాసిన రండా మూలమ్ అనే నవల ఆధారంగా రూపొందించనున్నారు.

08/02/2018 - 20:27

ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు, శ్రీ తనయుడు రాజేష్ శ్రీ చక్రవర్తిని హీరోగా పరిచయం చేస్తూ మాస్టర్ హరి సమర్పణలో సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం శివకాశీపురం. హరీష్ వట్టికూటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మోహన్‌బాబు పులిమామిడి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హీరో రాజేష్ శ్రీ చక్రవర్తి చెప్పిన విశేషాలు...

08/02/2018 - 20:26

కమెడియన్‌గానే కాకుండా హీరోగా కూడా దూసుకుపోతున్న నవ్వుల వీరుడు షకలక శంకర్. తాను హీరోగా నటించిన శంభోశంకర చిత్రం ఘన విజయం సాధించింది. ఇపుడు అంతే ఉత్సాహంతో డ్రైవర్ రాముడు సినిమాని శరవేగంగా పూర్తిచేస్తున్నాడు.

08/02/2018 - 20:22

ప్రముఖ రచయిత సదానంద్ శారద యస్ త్రి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న నేనే సరోజ ఉరఫ్ కారం ఛాయ్ అనే సినిమాకోసం ‘పాల సంద్రం ఎగసి ఎగసి’ అనే పాటను ఓరుగల్లు కోటలో హీరో కౌషిక్‌బాబు హీరోయిన్ మేఘనలపై చిత్రీకరించారు. వరంగల్‌లోని రుద్రమదేవి చారిత్రాత్మక తోరణాల మధ్యన కుష్‌మహల్ ఏకశిల ప్రాంతంలో ఈ పాటను చిత్రీకరించారు.

08/02/2018 - 20:21

మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రభార్.పి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన చిత్రం ‘బ్రాండ్‌బాబు’. ఈనెల 3న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు ప్రభాకర్ చెప్పిన విశేషాలు.. నేను దర్శకత్వం చేసిన తొలి చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’ పెద్ద డిస్సపాయింట్ చేసింది. అందుకు కారణం సీరియల్స్ ద్వారా నాకు ఫ్యామిలీ, చిన్నపిల్లలు అభిమానులయ్యారు.

08/02/2018 - 20:19

తాజాగా తెలుగులో అభిమన్యుడు సినిమా హిట్‌తో మంచి ఊపుమీదున్న టూ లాంగ్వేజ్ స్టార్ విశాల్.. ఇప్పటికే పందెంకోడి చిత్రానికి సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే. పందెంకోడి-2 (సందకోడి 2 తమిళంలో) తెరకెక్కుతున్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ చివరిదశకు చేరుకుంది. లింగుస్వామి దర్శకత్వంలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బిజినెస్ పరంగా భారీ హైప్ క్రియేట్ అయింది.

08/02/2018 - 20:16

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ‘మారి -2’ చిత్రంలో నటిస్తున్నారు. బాలాజీ మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. 2015లో ధనుష్, కాజల్ జంటగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘మారి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలోని ఒక సాంగ్‌కు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు.

08/02/2018 - 20:17

సౌత్ క్రేజీ భామ త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటినుండి వరుస సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో జోరుమీదున్న త్రిష, తాజాగా మోహిని అంటూ భయపెట్టే ప్రయత్నాలు చేసింది. కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతోపాటు మరో మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా త్రిష ఓ భారీ సినిమా నుండి తప్పుకోవడం ఈమధ్య ఆసక్తి రేకెత్తించిన విషయం తెలిసిందే.

Pages