S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2018 - 21:58

తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్స్ తమ చిత్ర ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసారు. వీర భోగ వసంతరాయలు చిత్రంలోని శ్రీవిష్ణు లుక్‌ని ఆ చిత్రానికి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ రిలీజ్ చేశారు. ఈ స్టన్నింగ్ లుక్‌లో శ్రీవిష్ణు కూల్‌గా కనిపించాడు. లాంగ్ హెయిర్‌తో సరికొత్త హెయిర్ స్టయిల్‌లో కనిపిస్తూ శ్రీవిష్ణు కొత్తలుక్‌లో కనిపించాడు.

07/29/2018 - 21:56

‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’వంటి మంచి హిట్ చిత్రాల తర్వాత మా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్‌లో యాక్షన్ హీరో గోపీచంద్‌తో చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన ‘పంతం’అన్ని సెంటర్స్‌లో దిగ్విజయంగా 25రోజులు పూర్తి చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

07/29/2018 - 21:55

సుశాంత్, రుహాణి శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘చి.ల.సౌ’. నటుడు రాహుల్ రవీంద్రన్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్‌ని పొందింది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి రుహానీ శర్మ అనే కొత్త అమ్మాయి పరిచయం కాబోతోంది. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వెనె్నల కిషోర్, రోహిణి మరియు అను హసన్‌లు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

07/29/2018 - 21:54

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్‌తేజ్‌ల కలయికలో హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరెకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్‌లైన్. కొద్ది రోజుల క్రితం మొదలైన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ నిన్నటితో పూర్తయింది. ఈ షెడ్యూల్ హీరోలతోపాటు కథానాయికలు తమన్నా, మెహ్రీన్‌లు పాల్గొన్నారు.

07/29/2018 - 21:53

ఈమధ్యకాలంలో సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఇది ఒక్క టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్- ఇలా అన్నిచోట్లా వుంది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ ఈ వ్యవహారంలో ధైర్యంగా ముందుకు వచ్చి ఈ విషయంపై బాహాటంగానే స్పందించారు. తాజాగా టాలీవుడ్‌లో కూడా కొందరు హీరోయిన్స్ స్పందించిన విషయం తెలిసిందే. ఇప్పటికే శ్రీరెడ్డి వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది.

07/29/2018 - 21:51

పిఎల్ క్రియేషన్స్, ఆకుల రాజయ్య ప్రెసెంట్స్, జాకీ తోట దర్శకత్వంలో ప్రసాద్ నల్లపాటి, లోహిత్ కుమార్ నిర్మాతలు. హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్‌ఎన్‌సిసిలో ఏర్పాటుచేసిన అక్షరం ఆడియో విడుదల కార్యక్రమం సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఫ్రీన్ ఫౌండేషన్‌కి చెందిన బధిర విద్యార్థుల ప్రత్యేక ప్రదర్శనలతో ఘనంగా నిర్వహించారు.

07/27/2018 - 20:35

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోయాడు. కాగా ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ త్వరలోనే డైరెక్ట్‌గా బాలీవుడ్‌లో ఓ చిత్రం చేయబోతున్నారనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. కాగా కరణ్ జోహార్ బాహుబలి చిత్రానికి బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చి అక్కడ భారీ స్థాయిలో విడుదల చేశారు.

07/27/2018 - 20:34

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన 35 రోజుల తాజా షెడ్యూల్ నిన్నటితో ముగిసింది. ఈ షెడ్యూల్‌లో బ్రిటీష్ సైనికులకు వ్యతిరేకంగా పోరాడిన సన్నివేశాలను చిత్రీకరించారు. అతి తక్కువ కాంతిలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారట.

07/27/2018 - 20:33

ప్రముఖ నటి నయనతార తమిళ భాషలో నటిస్తున్న తాజా చిత్రం ‘కొలమావు కోకిల (కోకో). నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయన్ డ్రగ్స్ అమ్మే యువతి పాత్రలో నటిస్తుంది. ఇక ఈ చిత్రం మొదట ఆగస్టు 10న విడుదలవ్వాల్సి ఉండగా, అదే రోజు కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ కూడా విడుదల కానుండడంతో కోకోని వాయిదా వేశారు. ఇక ఆగస్టు 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

07/27/2018 - 20:31

జాతీయ నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్న కమల్‌హాసన్ నటన గురించి ఇవాళ మనం కొత్తగా చెప్పే పనిలేదు. ఎన్నో అద్భుత పాత్రల్లో జీవించిన కమల్ ఈమధ్యే కాస్త సినిమాల విషయంలో వివాదాల్లో పడ్డాడు. అటు సక్సెస్ రేటు తగ్గడంతో అవకాశాలు రాలేదు. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన విశ్వరూపం సినిమా పెద్ద దుమారమే రేపింది. ప్రస్తుతం దానికి సీక్వెల్‌ని విడుదల చేసే పనిలో పడ్డాడు.

Pages