S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/09/2018 - 20:00

7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) సెప్టెంబర్‌లో జరగనుంది. దుబాయ్‌లో జరగబోయే ఈ ఈవెంట్‌కోసం ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు నిర్వాహకులు. సైమా గురించి ప్రెస్‌మీట్ జరగనుంది. ఇదే ప్రెస్‌మీట్‌లోనే షార్ట్ ఫిల్మ్ అవార్డులుకూడా ప్రకటించనున్నారు. సైమాకు ఎంతోమంది తారలు దిగిరానున్నారు. రెడ్ కార్పెట్‌పై చాలామంది స్టార్స్ తళుక్కుమనబోతున్నారు. 24శాఖల్లో వాళ్లు వాళ్లుచేసిన కృషి..

08/08/2018 - 19:29

అనుష్క.. టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్. ఓ వైపు గ్లామర్ హీరోయిన్‌గా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదే స్టార్ హీరోలకు బాక్సాపీస్ వద్ద పోటీనిచ్చింది. తాజాగా ఈమె మెగాస్టార్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. రచయితగా కెరీర్‌ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్దిమంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు.

08/08/2018 - 19:26

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా క్రేజీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన రోబో (యందిరన్- తమిళం) ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కించారు. త్వరలోనే ఈ రోబో 2.0 విడుదల కావాల్సి వుంది. అయితే రోబో సినిమా కథ విషయంలో పెద్ద దుమారం రేగింది. ఈ కథ నాది అంటూ ఆరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి మద్రాసు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

08/08/2018 - 19:25

తనను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోకుండా ఫిదా చేయించి దర్శకుడు శేఖర్ కమ్ముల కోసం మరో సినిమా ఒప్పుకుందట సాయి పల్లవి. ప్రేమమ్ సినిమాతో మలయాళంలో హీరోయిన్‌గా పరిచయం అయినా, సాయి పల్లవి తెలుగులో శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో టాలీవుడ్‌ని ఫిదా చేసింది. ఆ సినిమా తరువాత ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు తమ ఇంటి అమ్మాయిగా ఫిక్స్ అయ్యారు.

08/08/2018 - 19:23

అనిరుధ్ ప్రొడక్షన్స్ సమర్పణలో విజయ్ ఆనంద్ దర్శకత్వంలో సిహెచ్.వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి జి.సంధ్యరెడ్డి నిర్మాతలుగా శ్రీ వెంకటలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ‘వామ్మో బామ్మ’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మరియు పాటలు ఈరోజు హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ప్రముఖుల సమక్షంలో విడుదలచేసారు.

08/08/2018 - 19:21

ఇటీవల ‘మళ్ళీరావా’ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న ప్రామిసింగ్ హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈషా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

08/08/2018 - 19:20

బాలీవుడ్‌లో క్రేజీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న అజయ్ దేవగన్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ కూడా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన రజనీకాంత్‌తో కలిసి రోబో 2.0లో నటించాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా కోలీవుడ్‌లోకి వెళ్లడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

08/08/2018 - 19:18

రత్తాలు.. రత్తాలు.. అంటూ మెగాస్టార్‌తో చిందులేసిన రత్తాలు.. అదేనండి హాట్ భామ లక్ష్మిరాయ్ ఐటెం గర్ల్‌గా టర్న్ అయింది. ఇక సినిమాలు చేస్తుందా.. అసలు హీరోయిన్‌గా అవకాశాలు వస్తాయా అనుకున్నారు జనాలు.. కానీ ఈ అమ్మడు తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమా కథ మొత్తం లక్ష్మిరాయ్ పాత్ర చుట్టే తిరుగుతుందట..

08/08/2018 - 19:17

టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలు విశేషమైన ఆదరణ చూరగొంటున్నాయ. ఆ నేపథ్యంలో అద్భుతమైన కంటెంట్, అమేజింగ్ గ్రాఫిక్స్‌తో ఎపిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘సువర్ణసుందరి’. పునర్జన్మ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రఖ్యాత నటీమణి జయప్రద కీలక పాత్ర పోషిస్తోండగా.. ఆమెకు తల్లిగా పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కి విశేషమైన స్పందన లభించగా..

08/07/2018 - 20:40

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మంచి జోష్‌లో వుంది రాశీఖన్నా. వరుస సినిమాలతో బిజీగా వున్న ఈమె అంటే యూత్‌లో మంచి క్రేజ్. అటు గ్లామర్, ఇటు నటనలోనూ రాణిస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ తాజాగా నితిన్ సరసన శ్రీనివాస కళ్యాణంలో నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సతీశ్ వేగేశ్న దర్శకుడు.

Pages