S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/15/2018 - 20:59

అడవి శేష్, శోభిత ధూళిపాళ్ళ హీరోహీరోయిన్స్‌గా నటించిన ‘గూఢాచారి’ సినిమా ట్రైలర్, పాటలు త్వరలో విడుదల చేసి, ఆగస్టు 3న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ద్వారా శశికిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది.

06/14/2018 - 21:32

నందమూరి అందగాడు బాలకృష్ణ హీరోగా నటించిన 104వ సినిమాకు రంగం సిద్ధం అయింది. పైసా వసూల్ తరువాత బాలయ్య హీరోగా నటిస్తున్న 103వ సినిమా ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యూనిట్‌లోకి దర్శకుడు క్రిష్ ఎంటర్ అవ్వడంతో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

06/14/2018 - 21:28

కొవెర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘యు’. శ్రీమతి నాగానిక సమర్పించారు. విజయలక్ష్మి కొండా, నాగానిక చాగంరెడ్డి నిర్మాతలు. కొవెర దర్శకుడు. ఆయనే హీరోగా నటించారు. హిమాన్షి కాట్రగడ్డ నాయిక. ఈ చిత్రం ప్రెస్‌మీట్‌లో హీరో, దర్శకుడు మాట్లాడుతూ ‘యు’ టైటిల్‌కి కథే హీరో. నేను విజయేంద్రప్రసాద్ దగ్గర నాలుగేళ్లు పనిచేశాను. కథాపరంగా ఉన్న అనుభవంతో ‘యు’ రాసుకున్నాను.

06/14/2018 - 21:26

మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాత్ర అనే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ చేశారు. కానీ పూర్తిగా పాత్రలకు సంబంధించిన క్యారెక్టర్స్‌ను ఫైనల్ చేయలేదు.

06/14/2018 - 21:23

రామ్‌చరణ్ రంగస్థలం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకొని మంచి ఊపుమీద ఉన్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ కూడా అదే రేంజ్‌లో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. బోయపాటి స్టైల్ ఎలా వుంటుందో స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కి ఏ మాత్రం బ్రేకులు పడటంలేదు.

06/14/2018 - 21:21

కోలీవుడ్ స్టార్ హీరోలు కార్తి, సూర్య ఇద్దరూ కూడా తెలుగులో మంచి ఆదరణను అందుకుంటున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో అన్నతో సమానంగా ఇంకా మార్కెట్ సెట్ చేసుకోలేదు గానీ టాలీవుడ్‌లో మాత్రం కార్తీ సూర్య స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాడు. ఇకపోతే వీరిద్దరూ కలిసి ఇపుడు ఒకే తెరపై కనిపించడానికి సిద్ధమయ్యారు. వీళ్లు చేసే చిత్రాన్ని బ్రదర్స్ మల్టీస్టారర్ అనవచ్చు.

06/14/2018 - 21:19

షాలిని, నందికొండ వాగుల్లోనా లాంటి చిత్రాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న లక్కీ ఏకారి, నజియా హీరో హీరోయిన్లుగా అర్కాన్ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై రంజిత్ కోడిప్యాక సమర్పణలో సత్యనారాయణ ఏకారి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మోని’. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రమిది.

06/14/2018 - 21:17

బాల నటుడిగా తెరంగేట్రం చేసి.. ఎన్నో వైవిధ్యమైన హాస్య పాత్రల్లో కనిపించాడు మాస్టర్ భరత్. తనదైన డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు. కొంత గ్యాప్ తీసుకున్న భరత్ ఇప్పుడు అల్లు శిరీష్ హీరోగా తెలుగులో రూపొందిస్తున్న ఏబీసీడీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. బాల నటుడిగా బొద్దుగా కనిపించిన భరత్ ఇప్పుడు స్లిమ్‌గా రెడీ అయ్యాడు.

06/14/2018 - 21:16

ఇండియన్ సినిమా చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా ‘టిక్ టిక్ టిక్’ విడుదలకు సిద్ధమవుతోంది. విలక్షణమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించటంలో ముందుండే చదలవాడ బ్రదర్స్ టిక్ టిక్ టిక్‌ను టాలీవుడ్‌లోకి అనువదిస్తున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి, చదలవాడ లక్ష్మణ్ జూన్ 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. చదలవాడ లక్ష్మణ్ మాట్లాడుతూ..

06/14/2018 - 21:13

కాలకూట విషాన్ని కంఠంలో పెట్టుకుని మృత్యువును జయించిన ఆ పరమశివుడి పేరుపెట్టుకున్న శంకరుడినిరా!... చావు లేదు...! అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు శంకర్ అలియాస్ శంభోశంకర. షకలక శంకర్‌గా తెలుగు లోగిళ్ళకు పరిచయస్తుడైన శంకర్ కామెడీలోనేకాదు హీరోయిజంలోనూ సత్తా చాటేందుకు.. తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు కోరుతూ థియేటర్‌లోకి వస్తున్నాడు. కమెడియన్లు హీరోలు అయితే అంగీకరించని వాళ్లుంటారు.

Pages