S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/12/2018 - 21:27

విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై స్టార్ యాక్టింగ్ స్టూడియో సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ‘ఎమ్6’. జైరామ్ దర్శకుడు. విశ్వనాథ్ తన్నీరు, సురేష్ నిర్మాతలు. ధ్రువ, శ్రావణి, అశ్విని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమైంది.ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ..

06/12/2018 - 21:25

నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలనీ ఉందంటున్నారు హీరో సుధీర్‌బాబు. ఎస్‌ఎంఎస్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన సుధీర్‌బాబు ఆ తరువాత తనకంటూ విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటూ ఎదుగుతున్నాడు. అటు హిందీలో కూడా విలన్‌గా పరిచయం అయిన సుధీర్ తాజాగా ఓ భిన్నమైన ప్రేమకథతో మన ముందుకు వస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సమ్మోహనం. అతిథిరావు హైదరీ హీరోయిన్.

06/12/2018 - 21:22

అందమైన ప్రేమకథగా మలిచిన ‘నా లవ్ స్టోరీ’ ఆడియో విడుదల ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ప్రముఖుల చేతుల మీదుగా జరిగింది. ప్రముఖ రచయితలు శివశక్తి దత్త, భువనచంద్రలు ఆడియోని ఆవిష్కరించిన ప్రత్యేక అతిథులు ప్రవీణ్ సత్తారు, అనీల్ రావిపూడి, సి.ఉమామహేశ్వరరావులకు అందజేసారు.

06/11/2018 - 21:35

వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో నాని మరో చిత్రానికి ఓకె చెప్పాడు. 2016లో తనతో కృష్ణగాడి వీరప్రేమగాథలాంటి హిట్ చిత్రాన్ని అందించిన హనుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం హను రాఘవపూడి శర్వానంద్-సాయి పల్లవి జంటగా ‘పడి లేచే మనసు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఇదే నిర్మాతలతో నానితో సినిమా చేస్తారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడనున్నాయి.

06/11/2018 - 21:33

సుధీర్‌బాబు, అతిథిరావు హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన సమ్మోహనం చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కొరటాల శివ, వంశీ పైడిపల్లి, హరీశ్ శంకర్, దిల్‌రాజు, ఎస్.వి.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

06/11/2018 - 21:31

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం కార్యక్రమం మరోసారి కష్టాల్లో వున్నవారిని ఆదుకుంది. ఆదివారం ఫిలిం ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు పేదలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాని, దేవులపల్లి అమర్, వక్కంతం వంశి, అనీల్ రావిపూడి, కోటగిరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

06/11/2018 - 21:29

హేమానంద్, పావని నాయకానాయికలుగా నటిస్తోన్న చిత్రం ‘మిస్టర్ హేమానంద్’. జైరామ్‌కుమార్ దర్శకత్వంలో ఓం తీర్థం ఫిల్మ్ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగింది. సీడీని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహీందర్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సీడీలను నిర్మాత మల్కాపురం శివకుమార్ ఆవిష్కరించి తొలి ప్రతిని మహీందర్‌రెడ్డికి అందించారు.

06/11/2018 - 21:28

మనీష్‌గౌర్ హాలీవుడ్ ఫిలింస్ పతాకంపై మనీష్‌గౌర్ సమర్పణలో అమ్మాయి రసజ్ఞ టైటిల్ పాత్రలో శ్రీరాజ్‌గౌడ్, పూజ జంటగా రూపొందుతున్న చిత్రం ‘అమ్మో అమ్మోరు’. ఈ చిత్రం టీజర్ లాంచ్ సోమవారం ఫిలింఛాంబర్‌లో లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘సంగీత దర్శకుడు అర్జున్ నా తొంభై సినిమాలకు సంగీతాన్ని అందించారు. ‘అమ్మోఅమ్మోరు’ చిత్రానికి కూడా తనే మ్యూజిక్ చేశారు.

06/11/2018 - 21:26

బాలీవుడ్ గ్లామర్ భామ ప్రియాంక చోప్రా అంటే ప్రస్తుతం ఇండియన్ సినీ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. ఇన్నాళ్లూ ఇండియన్ సినిమాల్లో నటించి ఈ రేంజ్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ప్రియాంక ఇలా ఇండియన్ సినిమా గురించి చీప్‌గా మాట్లడటం ఏమిటా అని గుర్రుగా వున్నారు. కొందరైతే ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ప్రియాంక వ్యవహారం వుందని అంటున్నారు.

06/11/2018 - 21:24

జెఎస్‌ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డ హీరోగా పరిచయంచేస్తూ.. ప్రముఖ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలో రిలీజ్‌కి రెడీఅయ్యింది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మాస్ మహారాజా రవితేజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ..

Pages