S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2018 - 21:51

నందు, తేజస్విని ప్రకాష్ జంటగా ఎఎస్‌పి క్రియేటివ్ బ్యానర్‌పై బిక్స్ ఇరుసర్ల దర్శకత్వంలో భాసాని నిర్మిస్తున్న చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. నిర్మాణానంతర పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల మాట్లాడుతూ- ‘మా చిత్రాన్ని 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం.

06/18/2018 - 22:07

సిరి క్రియేషన్స్ వర్క్స్ బ్యానర్‌లో రూపొందనున్న ‘ప్రేమదేశం’ చిత్రం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూరి జగన్నాథ్ అబ్బాయి ఆకాష్ పూరి చిత్ర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అజయ్, మాయ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్ర తొలి సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టారు. అనంద్ రవి గౌరవ దర్శకత్వం వహించగా జీవితా రాజశేఖర్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

06/18/2018 - 22:13

సన్‌రైజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ముదస్సిర్‌ఖాన్, ప్రియాంకా జంటగా సి.వి.ఎస్.పుల్లారావు దర్శకత్వంలో యం.శ్రీనివాస్ మరియు బి.అమర్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఓ జంట కథ’. ఈ చిత్రం టీజర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎపిఎఫ్‌డిసి చైర్మన్ అంబికా కృష్ణమూర్తి ఆఫీసులో ఆయన చేతులమీదుగా నిర్వహించారు.

06/18/2018 - 21:48

తొలి చిత్రం ‘ఉయ్యాల జంపాల’తో సక్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకులందరికీ చాలా దగ్గరయ్యారు. ఇప్పుడు సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారధ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘లవర్’ సినిమాలో నటిస్తున్నారు.

06/18/2018 - 22:11

సింధీ భామ సిద్ధి ఇద్నానీ నటించిన తొలి తెలుగు సినిమా ‘జంబలకిడి పంబ’, శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన చిత్రమిది. మను దర్శకుడు. ఈనెల 22న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సిద్ధి ఇద్నానీ విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు.. ‘మా నాన్న సింధీ. మా అమ్మ గుజరాతీ. వాళ్ళది ప్రేమ వివాహం. మా అమ్మ హిందీ టెలివిజన్ సీరియల్స్, గుజరాతీ చిత్రాల్లో నటించేవారు. నాన్నకు బ్యాగ్స్ బిగినెస్ వుంది.

06/17/2018 - 21:04

రామ్‌చరణ్ హీరోగా డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నాలుగో షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ శివార్లలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు.

06/17/2018 - 21:02

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా నటించే మూడవ సినిమాకు రంగం సిద్ధమైంది. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఈనెల 20న ప్రారంభం కానున్నదట. షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరగనుంది. నిజానికి ఈనెల మొదటివారంలోనే ప్రారంభం కావాల్సి వుండగా వీసా ప్రాబ్లమ్‌వల్ల వాయిదా పడింది. ఈ షెడ్యూల్‌లోనే దాదాపు 70 శాతంపైగా షూటింగ్ పూర్తి చేస్తారట.

06/17/2018 - 21:00

హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో జెఎస్‌ఆర్ మూవీస్ పతాకంపై సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. ఈ సినిమా ట్రైలర్ శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో శ్రీకాంత్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, ఒ.కళ్యాణ్, డాలి మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

06/17/2018 - 20:56

శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధిఇద్నాని హీరోహీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జె.బి.మురళి కృష్ణ దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాస్‌రెడ్డి.ఎన్ నిర్మిస్తున్న చిత్రం ‘జంబలకిడి పంబ’. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది.

06/17/2018 - 20:54

చరణ్‌తేజ్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నేనులోకల్ చిత్ర దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన స్టోరీ, దర్శకత్వ పర్యవేక్షణలో ప్రముఖ దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఆయుష్మాన్‌భవ. ఈ చిత్రాన్ని సి.టి.ఎఫ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు.

Pages