S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/19/2018 - 22:06

వరుసగా సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటిస్తున్న సమంత ప్రస్తుతం ‘యు టర్న్’ సినిమాలో నటిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సమంత ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. తాజాగా హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒక పోలీస్‌స్టేషన్ సెట్‌లో జరుగుతోంది. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

06/19/2018 - 22:09

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం కోకాపేట్ దగ్గర 7 ఎకరాల్లో భారీ సెట్‌ను నిర్మించారు. 40 రోజులపాటు జరుగనున్న ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

06/19/2018 - 22:10

సంపత్ నంది టీమ్‌వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్. సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, ప్రియాశ్రీ, తన్యహోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. టాకీపార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

06/19/2018 - 21:56

మొట్టమొదటిసారిగా మోషన్ పిక్చర్ టెక్నాలజీని సమర్థవంతంగా వాడి, దాదాపు 1000 షాట్స్ విఎఫ్‌ఎక్స్ చేసిన చిత్రం సంజీవని. ఇలాంటి చిత్రాలు కేవలం హాలీవుడ్‌లో మాత్రమే వస్తాయి. కానీ మొట్టమొదటిసారి ఎన్నో కష్టాలు భరించి దర్శకుడు రవి వీడే, నిర్మాత జి.నివాస్‌లు దాదాపు రెండు సంవత్సరాలు ఇష్టంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

06/19/2018 - 22:07

శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నానీ హీరో హీరోయిన్లుగా శివ సెల్యులాయిడ్స్, మెయిన్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై జె.బి.మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాస్‌రెడ్డి.ఎన్ నిర్మిస్తున్న చిత్రం ‘జంబలకిడి పంబ’. ఈనెల 22న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జె.బి.మురళీకృష్ణ చెప్పిన విశేషాలు...

06/19/2018 - 21:37

సుధీర్‌బాబు, అదితిరావు హైదరీ జంటగా శ్రీదేవి మూవీస్ పతాకంపై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొంది ఇటటీవలలే విడుదలైన ‘సమ్మోహనం’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తొలి ఆటనుంచి పాజిటివ్ బజ్ సినీ, ప్రేక్షక వర్గాల్లో మార్మోగుతోంది. ఈ చిత్రంపై సినీ ప్రముఖులు తమ స్పందనను సోషల్ మీడియాలో వ్యక్తంచేస్తున్నారు.

06/19/2018 - 22:11

తమిళ స్టార్ హీరో ‘ఇళయదళపతి’ విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 62వ చిత్రం యొక్క టైటిల్‌ను అలాగే ఫస్ట్‌లుక్‌ను ఈనెల 21న సాయంత్రం 6 గంటలకి విడుదల చేయనున్నారు. ఈనెల 22న ఆయన పుట్టినరోజు కావడం విశేషం. తూత్తుకుడి జరిగిన ఘటన నేపథ్యంలో ఈసారి ఆయన తన పుట్టినరోజును జరుపుకోవడం లేదని మనకు తెలిసిందే. ఇక విజయ్ నటిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.

06/18/2018 - 22:10

సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంగళవారం నుండి హిల్ స్టేషన్ డెహ్రాడూన్‌లో మొదలుకానుంది. మహేష్‌బాబు ఈ షూటింగ్ కోసం ఈరోజే డెహ్రాడూన్ బయలుదేరి వెళ్ళారు. రేపటినుండి ఆయన చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్నారు.

06/18/2018 - 22:08

అల్లు శిరీష్ కథానాయకుడిగా మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ హీరో, హీరోయిన్లపై క్లాప్‌నివ్వగా సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సంజీవ్‌రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

06/18/2018 - 22:06

రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్‌లుగా నంది క్రియేషన్స్ పతాకంపై కె.యం.డి.రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘బంగారి బాలరాజు’. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచింగ్ గ్రాండ్‌గా రామానాయుడు స్టూడియోలో జరిగింది.

Pages