S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2017 - 00:23

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన 25వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని కొంతభాగం విదేశాల్లో చిత్రీకరించాలని టీమ్ నిర్ణయించింది. ఈమేరకు నిన్న సాయంత్రం పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్‌లు బల్గేరియా బయలుదేరి వెళ్లారు.

07/20/2017 - 00:22

నోటికి ఎంత మాట వస్తే అంత మాటను బాలీవుడ్ బ్యూటీ ధైర్యంగా చెప్పేస్తోంది. తన భావాలను బయటపెట్టడంలో ఎలాంటి మొహమాటం పెట్టుకోదు. తాను నటించిన చిత్రం గురించి ధైర్యంగా ఓ విషయాన్ని కూడా చెప్పింది. వాస్తవిక సంఘటనల ఆధారంగా చిత్రించే ఓ సినిమాలో సన్నివేశం గురించి వివరించింది. ఈ సినిమా కోసం అలియా పబ్లిక్ ప్లేస్‌లో మూత్ర విసర్జన చేయవలసి వచ్చిందట.

07/18/2017 - 20:53

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘పైసా వసూల్’ పూర్తి కావచ్చింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత బాలయ్య తన 102వ సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడు. వచ్చే నెల 3న ఈ సినిమా మొదలుకానుంది. దీని తరువాత ఆయన బోయపాటి దర్శకత్వంలో నటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బాలయ్యకు బోయపాటి సింహ, లెజెండ్ లాంటి సంచలన విజయాలను అందించాడు.

07/18/2017 - 20:51

బంపర్ ఆఫర్.. అని కొన్ని షాపుల వాళ్ళు పెడుతుంటారు. అక్కడికి వెళ్లి ఆ ధరలు చూస్తే మనకు పెద్దగా బంపర్ ఆఫర్ అనిపించకపోవచ్చు. కానీ అది ఆ షాపువాడికి మాత్రం బంపర్ ఆఫర్! ఇప్పుడు నిజంగా ఈ బాలీవుడ్ భామ ఇచ్చిన బంపర్ ఆఫర్ చూస్తే ఎగిరి గంతేస్తారు ఎవరైనా? ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. బాలీవుడ్ భామ జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు ఈమధ్య పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు.

07/18/2017 - 20:50

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 151వ సినిమాకు సన్నాహాలు జోరందుకున్నాయి. సినిమా వచ్చే నెలలో మొదలుకానున్న విషయం తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభం కానున్న ఈ సినిమా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందనుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారు.

07/18/2017 - 20:48

నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లై’ ఆరంభం నుండి మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే విడుదలైన టీజర్ కూడా బ్రహ్మాండంగా ఉండటంతో ఈ సినిమా పట్ల అందరిలోనూ పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది. దీంతో సినిమా హక్కులు భారీ ధర పలుకుతున్నాయ్. ఫిల్మ్‌నగర్ వార్తల ప్రకారం ఈ చిత్రం శాటిలైట్స్ రైట్స్ భారీ ధరకు పలుకుతున్నాయట. ప్రముఖ చానెల్ ఒకటి ఈ భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉందని కూడా తెలుస్తోంది.

07/18/2017 - 20:47

వెండితెరపై సెన్సిబిలిటీతో సినిమాలు తీసి మెప్పించగల దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ లాంటి గుడ్ ఫీల్ చిత్రాలు రూపొందించిన ఆయన తాజాగా వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా రాజు నిర్మాణంలో రూపొందించిన చిత్రం ఫిదా’. ఈ నెల 21న విడుదల కానున్న ఈ చిత్రం విశేషాలు ఆయన తెలిపారు.
* గ్యాప్ ఎక్కువగా తీసుకున్నారు? ఎందుకు?

07/18/2017 - 20:44

వైశాఖం చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులతోపాటు మేము కూడా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్నాం. తొలి సినిమానే సోలో హీరోగా నటించడంతో అందరూ సపోర్టు చేస్తున్నారు. హరీశ్ అనే ఓ కొత్త హీరో వస్తున్నాడని అందరికీ తెలిసింది. ఇది నా అదృష్టం అని నటుడు హరీశ్ తెలిపారు. ఆర్.జె. సినిమాస్ పతాకంపై జయా.బి దర్శకత్వంలో బి.ఎ.రాజు రూపొందించిన లవ్, ప్యామిలీ ఎంటర్‌టైనర్ వైశాఖం.

07/18/2017 - 20:42

రాజన్న మూవీస్ నిర్మిస్తున్న పడిపోయా..నీ మాయలో చిత్రానికి సంబంధించి ఓ పాటను మంగళవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో చిత్రీకరించారు. రాచర్ల అరుణ్‌కుమార్, సావేరి హీరో హీరోయిన్‌లుగా ఈ సినిమా నిర్మిస్తున్నట్లు దర్శకుడు ఆర్‌కె వివరించారు.

07/18/2017 - 20:42

హీరో గోపీచంద్, సంపత్‌నందిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గౌతమ్‌నంద’. హన్సిక, కేథరిన్‌లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.్భగవాన్, జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 28న విడుదలవుతుంది. ఆడియో సీడీలను హీరోయిన్ కాథరిన్ విడుదల చేశారు. ఆనంతరం తమన్ మాట్లాడుతూ- ‘గౌతమ్‌నంద సినిమా ష్యూర్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది.

Pages