S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/16/2017 - 21:35

‘దువ్వాడ జగన్నాథం’ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్నఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మలయాళ భామ అను ఇమాన్యుయెల్ నటిస్తోందట. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలించినప్పటికీ ఫైనల్‌గా ఆమెను ఎంపిక చేసారు.

07/15/2017 - 22:54

ఒక్కసారి ఓ జంట ప్రేక్షకులకు నచ్చేసి ఆ సినిమా హిట్ అయిందంటే చాలు, ఆ జంటతోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని ప్రేక్షకులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లేనని అర్థం. అందుకే దర్శక నిర్మాతలు కూడా అదే కాంబినేషన్‌లో రూపొందించే ప్రయత్నం చేస్తారు. తాజాగా నాని, నివేదా థామస్ జంటకు ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో జంటిల్‌మేన్, నిన్నుకోరి చిత్రాలు విడుదలయ్యాయి.

07/15/2017 - 22:52

‘రిషి, గిరి సహదేవా కథానాయకులుగా నటించిన డా.చక్రవర్తి విడుదలై అన్ని కేంద్రాల్లో అద్భుతమైన ఆదరణ పొందుతోంది. 2015లో ముంబయిలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా చేసుకొని ఎంటర్‌టైన్‌మెంట్ బేస్‌తో ఈ సినిమా రూపొందించాం. నా గత చిత్రాలకన్నా వైవిధ్యంగా రూపొందిన ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికీ నచ్చుతుంది. ఇప్పటివరకూ చూసినవాళ్ళెవరూ నెగెటివ్ టాక్ చేయకపోవడం విశేషం’ అని దర్శకుడు శేఖర్ సూరి తెలిపారు.

07/15/2017 - 22:50

హర్షిణి, రోజాభారతి, మేఘ నరమి, జయ, ప్రవల్లిక ప్రధాన తారాగణంగా భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం బటర్‌ఫ్లైస్. ఆర్.కె.్ఫణిరాజ్ దర్శకత్వంలో రూ పొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రా రంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. అంబికా కృష్ణ క్లాప్‌నివ్వగా, జీవిత రాజశేఖర్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

07/15/2017 - 22:50

మానస్, నిత్యా నరేష్ జంటగా ఎస్.బి.ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై మల్లు హరిబాబు దర్శకత్వంలో భువనగిరి సత్య సింధుజ రూపొందిస్తున్న చిత్రం ‘సోడా గోలీసోడా’. అమలాపురం, పాలకొల్లులలో మొదటి షెడ్యూల్ పూర్తిచేసి ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తిచేశారు. అన్ని కార్యక్రమాలు ముగించి ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

07/15/2017 - 22:50

నయనతార ప్రధాన పాత్రలో మలయాళంలో విజయవంతమైన పుదియ నియమం తెలుగులో వాసుకిగా అనువాదమైంది. శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్.మోహన్ తెలుగులో అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ప్రస్తుతం టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం వైరల్ అవుతోందని, డ్రగ్స్ తీసుకుంటున్న కొందరు యువ హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాలు ‘సిట్’ అధికారుల ముందుకు వచ్చి తమ వాంగ్మూలాలు ఇస్తార’ని తెలిపారు.

07/15/2017 - 22:49

తమిళంలో విజయవంతమైన ఒరుబంతి నాల్న్,్ర ఒరు వికెట్ చిత్రాన్ని తెలుగులో కాదంబరి (ఇంటి నెంబర్ 150) పేరుతో అనువదిస్తున్నారు. ఆర్.డి.ఆర్ట్స్ పతాకంపై జె.రాధా శివరామ్, మన్వర్ బాషా అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఈనేలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

07/15/2017 - 22:49

ఎ.ఆర్.రెహమాన్ అంటేనే సంగీత కెరటం. ప్రస్తు తం ఆయన యు.కెలో మ్యూజిక్ మ్యాజిక్ చేస్తున్నారు. ఐఐఎఫ్‌ఎ తరఫున న్యూయార్క్‌లో నిర్వహించిన సం గీతోత్సవానికి పలువురు అభిమానులు హాజరై ఆయన పాటలను ఆస్వాదించారు. ఊర్వశి ఊర్వశి, హమ్మ హమ్మ పాటలతో ప్రారంభించిన ఆయన తెలుగు, తమిళ పాటలతోపాటుగా హిందీ గీతాలను కూడా ఆలపించి ప్రేక్షకులను తన్మయంలో ముంచెత్తారు.

07/15/2017 - 22:49

సినీ పరిశ్రమలో ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు దర్శకుడు రాఘవేంద్ర రావు కారణమని, ఇటీవల ఓ కామెడీ షోలో తాను చేసిన వ్యాఖ్యలు ఆయనకు బాధ కలిగి ఉంటే తనను క్షమించాలని బహుభాషా హీరోయిన్ తాప్సీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె రాఘవేంద్రరావుకు క్షమాపణలు చెబుతూ తాజాగా 3ఫేస్‌బుక్2లో ఓ వీడియోను పోస్టు చేశారు.

07/15/2017 - 22:48

పూరణ్, సాక్షి చౌదరి జంటగా ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై సూర్య దర్శకత్వంలో ఎం.ఎల్.లక్ష్మి రూపొందించిన చిత్రం 3సువర్ణసుందరి2 (చరిత్ర ఎప్పుడూ భవిష్యత్తును వెంటాడుతుంది). ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన లభిస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు.

Pages