S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/29/2015 - 22:06

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించే నెక్స్ట్ సినిమాకు సన్నాహాలు మొదలవుతున్నాయి. తమిళ సూపర్ హిట్ సినిమా ‘తానిఒరువన్’ సినిమా రీమేక్‌లో చరణ్ నటిస్తున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఇప్పటికే తమిళంలో ఈ పాత్రలో అరవింద్‌స్వామి నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఈ పాత్రలో ఎవరు నటిస్తారా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

11/29/2015 - 22:05

తెలుగు సినిమా విప్లవ చిత్రాల కథానాయకుడు ఆర్.నారాయణమూర్తి ప్రధాన పాత్రలో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దండకారణ్యం’. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై రూపొందించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

11/29/2015 - 22:02

అర్పిత క్రియేషన్స్ పతాకంపై అశోక్‌కుమార్, కిరణ్, మేఘశ్రీ ప్రధాన తారాగణంగా మనోన్ ఎం. దర్శకత్వంలో పత్తికొండ కిరణ్ రూపొందించిన చిత్రం ‘కాకి’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, కాకి చిత్రంలో కథ డిఫరెంట్‌గా ఉంటుందని, అందుకు తగిన విధంగానే ఆ పేరును నిర్ణయించామని తెలిపారు.

11/29/2015 - 21:59

అప్పటికప్పుడు కావలసిన సమాచారం అందుబాటులో ఉంటున్న ఈ రోజుల్లో సెన్సార్ విధానం అసంబద్ధమైనదని, కాలం చెల్లిన సెన్సార్‌బోర్డును రద్దు చేయాలని ప్రఖ్యాత దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. జేమ్స్‌బాండ్ సినిమా ‘స్పెక్టర్’లో ముద్దు సన్నివేశం నిడివిని కుదించాలన్న సెన్సార్‌బోర్డు అధ్యక్షుడు పహలాజ్ నిహలానీ నిర్ణయంపై దేశంలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నవేళ వర్మ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

11/28/2015 - 21:22

దక్షిణాదిలో హీరోయిన్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకుని, జాతీయ నటిగా గుర్తింపు సంపాదించుకున్న గ్లామర్ భామ ప్రియమణి ఈమధ్య బాగా వెనకబడింది. చేసిన సినిమాలన్నీ వరుస అపజయాలతో అవకాశాలు తగ్గాయి. దాంతో ప్రస్తుతం కన్నడంలో ఓ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో చెన్నయ్ ఎక్స్‌ప్రెస్ సినిమాలో చేసిన ఐటెమ్‌సాంగ్ హిట్‌అవ్వడంతో ఐటెం గర్ల్‌గా కూడా ముద్ర పడింది.

11/28/2015 - 21:18

ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న బ్రహ్మోత్సవం చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత మహేష్ తన తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడు. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటోంది.

11/28/2015 - 21:15

‘శంకరాభరణం’ సినిమాకు బిహార్ బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉందని సినిమా చేశాం. ప్రయోగంగా చేసిన ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇస్తే ఇలాంటి కథలతో మరిన్ని సినిమాలు చేయవచ్చు అని అంటున్నారు ప్రముఖ రచయిత కోనవెంకట్. తెలుగు తెరపై నవ్వులపూలు పూయించి కమర్షియల్ సినిమాల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన రచయితకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టారు.

11/28/2015 - 21:09

శ్రీకాంత్, కామ్నాజఠ్మలానీ జంటగా సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో బి.సుధారెడ్డి సమర్పణలో పుష్యమి ఫిలిమ్ మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వీడికి దూకుడెక్కువ’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 4న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా చిత్ర వివరాలను గురించి నిర్మాత తెలియజేస్తూ శ్రీకాంత్ కెరీర్‌లో నిలిచిపోయేలా రూపొందించిన చిత్రమిది.

11/28/2015 - 21:07

వెండి తెరపై వండర్స్‌ను క్రియేట్ చేస్తూ సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శంకర్ ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘రోబో-2’ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ 12న లాంఛనంగా ప్రారంభమయ్యే ఈ సినిమా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందట!

11/28/2015 - 21:04

నాగశౌర్య, మాళవికానాయర్ జంటగా బి.వి.నందినీరెడ్డి దర్శకత్వంలో శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణ వైభోగమే’.

Pages