S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/21/2018 - 23:48

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 21: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు జైలు నుంచి విడుదలకు సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం, సౌదీ అరేబియా ప్రభుత్వం మధ్య ఎలాంటి డీల్(ఒప్పందం) జరగలేదని ఓ మంత్రి వివరించారు. అవినీతి కేసులో జైలుశిక్ష పడ్డ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, కుటుంబ సభ్యులను విడుదల చేయాలని పాక్ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

09/21/2018 - 17:07

భోపాల్: ఎస్సీ, ఎస్టీ చట్టసవరణపై మధ్యప్రదేశ్‌లో చేస్తున్న అందోళనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరణ ఇచ్చారు. విచారణ తరువాతే అరెస్టులు ఉంటాయని, ఈమేరకు ప్రభుత్వ ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించారు.

09/21/2018 - 13:31

గుజరాత్: రాష్ట్రంలోని అమ్రేలి జిల్లా దాల్ఖనియా అటవీ రేంజ్ పరిధిలోని గిర్ అడవుల్లో 12 సింహాలు మరణించిన ఘటనపై వన్యప్రాణుల ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. సింహాల వరుస మరణాల ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని గుజరాత్ రాష్ట్ర అటవీశాఖ మంత్రి గణపత్ వాసవ చెప్పారు.

09/21/2018 - 13:14

ఒడిసా: దయె తుపాను ధాటికి ఒడిసా అతలాకుతలం అయింది. రాష్టవ్య్రాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. మల్కాన్‌గిరిలో భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరింది. బలమైన ఈదురు గాలులు వీచి చెట్లు నేలకొరిగాయి.

09/21/2018 - 13:07

ధర్మాబాద్: బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆందోళనపై మహారాష్టల్రోని ధర్మాబాద్ కోర్టులో విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంటు జారీ చేసిన విషయం విదితమే. ఇదిలా ఉండగా చంద్రబాబుకు జారీ చేసిన నాన్‌బెయిల్ బుల్ వారెంట్‌ను రీకాల్ చేయాలని కోరుతూ న్యాయవాది జి.

09/21/2018 - 13:06

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోషియానా జిల్లాలో తెల్లవారుజామున ఉగ్రవాదులు ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. స్పెషల్ పోలీసు అధికారులుగా విధులు నిర్వహిస్తున్న ఫిర్దోస్ అహ్మద్ కుచే, కుల్దీప్ సింగ్, నిసార్ అహ్మద్‌లను కిడ్మాప్ చేసి హత్య చేశారు. కాగా గత కొద్ది రోజులు క్రితమే వీరిని ఉగ్రవాదులు బెదిరించినట్లు తెలిసింది.

09/21/2018 - 03:59

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తి మేరకు రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు న్యూయార్క్‌లో సమావేశం జరిపేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం అంగీకరించింది.

09/21/2018 - 02:11

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నకిలీ యువరాజని, ప్రధాని మోదీ ప్రభుత్వం 15 మంది పారిశ్రామికవేత్తలకు సంబంధించి రూ.2.5 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. రాహుల్ గాంధీ మాటల్లో నిజం లేదని, అవాస్తవాలను చెప్పుకుంటూ తిరుగుతున్నారన్నారు. ఫేస్‌బుక్‌లో రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలకు అరుణ్ జైట్లీ స్పందించారు.

09/21/2018 - 02:10

ముంబయి, సెప్టెంబర్ 20: ముప్పై మంది జెట్ ఎయర్‌వేస్ ప్రయాణికులు గురువారం నరకం చూశారు. విమానంలో గాలి ఆడకపోవడంతో ప్రయాణికులు ముక్కు, చెవుల్లోంచి రక్తం వచ్చేసింది. విమాన సిబ్బంది కేబిన్‌లోని గాలి ఒత్తిడిని కంట్రోల్ చేసే స్విచ్‌ను ఆన్ చేయడం మరచిపోయారు. కాక్‌పిట్ సహా మొత్తం విమానంలో 177 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

09/21/2018 - 02:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఏకీకృత వ్యవస్థ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేసేందుకు డేటాబేస్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్సులను బహుళ వ్యవస్థల ద్వారా జారీ చేసే విధానం వల్ల ఒక వ్యక్తి అనేక రకాల లైసెన్సులను పొందుతున్నారన్నారు. భారత్‌లో 22లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందన్నారు.

Pages